పవన్ కల్యాణ్ స్పీడ్ కు బ్రేకులు, బిజెపిపైనే భారం: అంతే సంగతులు

First Published 18, Sep 2020, 12:21 PM

బీజేపీ తీసుకున్న నిర్ణయాల వల్ల పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అమరావతి అంశాలను పూర్తిగా పక్కనపెట్టేశారు పవన్ కళ్యాణ్. దీనివల్ల ఆయన అక్కడి రైతులకిచ్చిన మాట పోవడంతో పాటుగా ఆయన క్రెడిబిలిటీ కూడా ప్రమాదంలో పడింది.

ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎందుకో బాగా డల్ అయినట్టు  పార్టీతో పొత్తు పెట్టుకున్న తరువాత పార్టీలో జోష్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా జనసేనలో మాత్రం నీరసం ఆవరించింది. ఉత్సాహంతో పరుగులెత్తే జనసైనికులు ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు.

2014లో జనసేనను ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీపై భారీ స్థాయి ఆశలే ఉన్నాయి. పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికలు ఉండడంతో.... సంస్థాగత నిర్మాణం లేనందున ఆ దఫా ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగలేదు. బరిలోకి దిగకున్నప్పటికీ, టీడీపీ, బీజేపీల కూటమికి మద్దతు తెలిపింది.

టీడీపీ, బీజేపీల కూటమి అప్పుడు అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది అంటే.... అది  మద్దతు వల్లే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయన సామాజికవర్గ సమీకరణాలు బాగానే పనిచేసాయి. గోదావరి జిల్లాల్లో జగన్ కనీస ప్రభావాన్ని చూపలేకపోయాడంటేనే... మనం పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఇక 2019 ఎన్నికలకు ముందు టీడీపీతో విడిపోయిన పవన్ కళ్యా.... సొంతగా బరిలోకి దిగాడు. వామపక్షాలను కలుపుకొని, లాల్ నీల్ అంటూ మాయావతితో పొత్తు పెట్టుకున్నాడు. ఆ ఎన్నికల్లో జగన్ ధాటికి టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూస్తే జనసేన అడ్రస్ లేకుండా కొట్టుకుపోయింది. అధినేత పవన్ కల్యాణే పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు.

ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ.... పవన్ కళ్యాణ్ మాత్రం వెరవలేదు. ప్రజాక్షేత్రంలోనే ఉంటానని అన్నారు. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యలను భుజానికెత్తుకున్నారు. అంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయ పాఠాలను ఆలస్యంగానయినా వంటపట్టించుకున్నాడు అని అన్నారు.

ఎన్నికలయిపోగానే రాష్ట్రంలో దొరక్క నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. ఎందరో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇసుక కొరతకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఆనాడు విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఆ లాంగ్ మార్చ్ ని అడ్డుకోవడానికి అధికార పక్షం భారీ ప్రయత్నాలనే చేసినప్పటికీ.... పవన్ మాత్రం దాన్ని దిగ్విజయం చేసారు.

పవన్ చూపిన తెగువకు, ఆయన కమిట్మెంట్ కి రాష్ట్రంలోని ప్రజలు ముగ్ధులయ్యారు. ప్రజా సమస్యలపై అంత ఎత్తున ఆఖరికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా పోరాడలేదు. ఇసుక దీక్ష ధాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అని అనిపించింది. అంతా కూడా పవన్ ఇక రాష్ట్రంలో ఒక ప్రధాన ప్లేయర్ గా మారుతాడు అని అనుకున్నారు.

వ్యక్తిగత, ఆర్ధిక అవసరాల దృష్ట్యా ఆయన సినిమాల వైపు తిరిగి చూసారు. ఈ  కొందరు పార్టీని వీడారు. మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకొందరు వేరే పార్టీ ఖండువాలు ఎమ్మెల్యే రాపాక ఎప్పుడో జగన్ క్యాంపులో చేరిపోయారు.

ఇలాంటి సమయంలోనే బీజేపీతో పొత్తు పొడిచింది. జనసేనకు అవసరమైన మీడియా కవరేజ్, కార్యకర్తలకు రక్షణ దొరుకుతుందని అంతా భావించారు. బీజేపీతో కలిసిన తరువాత పవన్ స్పీడ్ పెంచుతారు అని అంతా భావించారు. అమరావతి విషయంలో దూసుకుపోతారు అని అనిపించింది.

కానీ బీజేపీ తీసుకున్న నిర్ణయాల వల్ల పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అమరావతి అంశాలను పూర్తిగా పక్కనపెట్టేశారు పవన్ కళ్యాణ్. దీనివల్ల ఆయన అక్కడి రైతులకిచ్చిన మాట పోవడంతో పాటుగా ఆయన క్రెడిబిలిటీ కూడా ప్రమాదంలో పడింది.

ఇక ఆయన ప్రజాసమస్యలపై కూడా ఎప్పటికప్పుడు గళమెత్తుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటారు. బీజేపీతో పొత్తు వల్ల వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులను కలిగించలేకపోతుంది జనసేన. వైసీపీ మీద రాజకీయంగా చేసే ఏ ఎదురుదాడైనా టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉన్నందున బీజేపీ వైసీపీ పై విమర్శలు  చేయడంలేదు, జనసేనను చేయనివ్వడంలేదు అనే మాట జనసేన సర్కిల్స్ నుంచే వినబడుతుంది.

ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు బీజేపీ జనసేన కార్యక్రమాలకు ఆ ఎత్తున తరలిరావడంలేదని అంటున్నారు. ముఖ్యంగా పవన్ కాషాయవాదిగా మారి బీజేపీ నిర్ణయాలకు అనుకూలంగా మెలుగుతున్నాడని, బీజేపీ కి ఇబ్బంది కలగకుండా చాతుర్మాస దీక్ష అంటూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాడని వారు వాపోతున్నారు. చూడాలి భవిష్యత్తులో ఈ ఈక్వేషన్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో...!

loader