MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • ప్రత్యేక మార్గంలో ఇజ్రాయెల్ చేరుకున్న మోదీ విమానం.. ఆ దేశాల‌ను పూర్తిగా త‌ప్పించారు

ప్రత్యేక మార్గంలో ఇజ్రాయెల్ చేరుకున్న మోదీ విమానం.. ఆ దేశాల‌ను పూర్తిగా త‌ప్పించారు

PM Modi: ప్రధాని న‌రేంద్ర మోదీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఈ ప‌ర్య‌ట‌నను ప్ర‌పంచం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. తొమ్మిదేళ్ల త‌ర్వాత ఇజ్రాయెల్ వెళ్లిన మోదీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం 

3 Min read
Author : Narender Vaitla
Published : Feb 26 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచంలోనే ఎక్కువ మంది ట్రాక్ చేసిన విమానం
Image Credit : ANI/X

ప్రపంచంలోనే ఎక్కువ మంది ట్రాక్ చేసిన విమానం

ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేసిన ఫ్లైట్‌గా నిలిచింది. బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో విమానం జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు ఒకేసారి సుమారు 9,000 మందికిపైగా ఆన్‌లైన్‌లో ఈ ఫ్లైట్‌ను గమనించారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

India One is flying to Israel today and is currently passing over Saudi Arabia. On board is India’s Prime Minister Narendra Modi.

Track: https://t.co/SCiSlS1p2g pic.twitter.com/SvVX4P60f8

— Flightradar24 (@flightradar24) February 25, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రత్యేక మార్గంలో ఇజ్రాయెల్ చేరుకున్న విమానం
Image Credit : X

ప్రత్యేక మార్గంలో ఇజ్రాయెల్ చేరుకున్న విమానం

ప్రధాని విమానం సాధారణ మార్గాన్ని కాకుండా ప్రత్యేక రూట్‌లో ప్రయాణించింది. భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్, ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా తప్పించింది. మోదీ విమాన ప్ర‌యాణ మార్గం ఇలా సాగింది.

* మొద‌ట ఢిల్లీలోని పలం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరింది. గుజరాత్ మీదుగా ప్రయాణించింది.

* అనంత‌రం అరేబియా సముద్రం దాటింది.

* అలా ఒమాన్ చేరుకుంది.

* అక్కడి నుంచి సౌదీ అరేబియా గగనతలంలో ప్రయాణించింది

* తరువాత జోర్డాన్ మీదుగా వెళ్లింది

* చివరకు ఇజ్రాయెల్‌లో దిగింది. విమానం బెన్ గురియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది.

సాధారణంగా భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు నేరుగా ప్రయాణిస్తే 6–7 గంటలు పడుతుంది. అయితే ఈసారి ప్రత్యేక మార్గం కారణంగా ప్రయాణ సమయం కొద్దిగా పెరిగింది.

Israeli PM Benjamin Netanyahu tweets, "My wife Sara and I welcomed today our good friend, Prime Minister of India Narendra Modi, who has arrived for another historic visit to Israel. Prime Minister Modi previously visited Israel in 2017, and I later paid a reciprocal visit to… pic.twitter.com/zqD7bm4Esw

— ANI (@ANI) February 25, 2026

35
ప్రత్యేక విమానం – ఎయిర్ ఇండియా వన్
Image Credit : X

ప్రత్యేక విమానం – ఎయిర్ ఇండియా వన్

ప్రధాని మోదీ ఎయిర్ ఇండియా వన్ అనే ప్రత్యేక ప్రభుత్వ విమానంలో ప్రయాణించారు. ఇది సాధారణ విమానం కాదు. ఈ విమానం సాధారణంగా Boeing 777-300ER మోడల్‌పై రూపొందించారు. ఇందులో సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థ, ప్రత్యేక కమాండ్ సెంటర్, రక్షణ పరికరాలు, అధిక భద్రతా సదుపాయాలు ఉంటాయి. ప్రధానితో పాటు ఇతర ప్రముఖుల అధికారిక విదేశీ పర్యటనలకు ఈ విమానం ఉపయోగిస్తారు.

#WATCH | Tel Aviv: Israeli Prime Minister Benjamin Netanyahu, along with his wife Sara Netanyahu, at the airport to welcome PM Narendra Modi

At the invitation of PM Benjamin Netanyahu, PM Modi is undertaking a state visit to Israel from February 25-26, 2026. 

(Source: Reuters) pic.twitter.com/XXSUP8Ry43

— ANI (@ANI) February 25, 2026

45
9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ పర్యటన
Image Credit : X

9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ పర్యటన

ప్రధాని మోదీకి ఇది రెండో ఇజ్రాయెల్ పర్యటన. ఆయన మొదటిసారి 2017 జూలైలో ఇజ్రాయెల్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజ‌మిన్ నెత‌న్యాహుతో స‌మావేశ‌మ‌య్యారు. అలాగే ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్ర‌సంగించారు. ఇక ఈ పర్యటనలో భారత్–ఇజ్రాయెల్ మధ్య రక్షణ సహకారం ప్రధాన అంశంగా ఉండ‌నుంది. ఇందులో భాగంగా డ్రోన్లు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, ఆధునిక రక్షణ సాంకేతికత, విషయాలపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

55
ఇజ్రాయెల్ మీడియా ఘన స్వాగతం
Image Credit : X

ఇజ్రాయెల్ మీడియా ఘన స్వాగతం

ఇజ్రాయెల్ ప్రముఖ పత్రిక The Jerusalem Post ప్రధాని మోదీ పర్యటనకు ప్రత్యేక స్వాగతం పలికింది. ఫ్రంట్ పేజీలో మోదీ ఫోటో ప్రచురించి. "నమస్తే" (హిందీ), "షాలోమ్" (హీబ్రూ) అనే పదాలతో స్వాగతం తెలిపింది. ఈ రెండు పదాల అర్థం "హలోష‌.

ప్రపంచ దృష్టి ఎందుకు ఆకర్షించింది?

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై అంత ఆసక్తి రావడానికి ముఖ్య కారణాలు. ప్రత్యేక విమాన మార్గం, భద్రతా ఏర్పాట్లు, రక్షణ ఒప్పందాల అవకాశాలు, అంతర్జాతీయ రాజకీయ ప్రాధాన్యం వంటి కార‌ణాల వ‌ల్ల మోదీ ప్రయాణించిన విమానం ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేసిన ఫ్లైట్‌గా నిలిచింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
నరేంద్ర మోదీ
ప్రపంచం
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Post office: ఇలా చేస్తే మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం.. 5 ఏళ్ల‌లో రూ. 2.2 ల‌క్ష‌ల వ‌డ్డీ
Recommended image2
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved