MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Jantar Mantar: ముంబై, హైద‌రాబాద్ నుంచి జంత‌ర్‌మంత‌ర్‌కి.. భారీగా జొమాటో, స్విగ్గీ ఆర్డ‌ర్లు

Jantar Mantar: ముంబై, హైద‌రాబాద్ నుంచి జంత‌ర్‌మంత‌ర్‌కి.. భారీగా జొమాటో, స్విగ్గీ ఆర్డ‌ర్లు

Jantar Mantar: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు దేశం నలుమూలల నుంచి అనూహ్యమైన మద్ధతు లభిస్తోంది. నిర‌స‌న తెలుపుతోన్న విద్యార్థులకు ప్రజలు స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆహారం పంపిస్తున్నారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 23 2026, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసి విద్యార్థులకు పంపిస్తున్న ప్రజలు
Image Credit : Against Corruption/X

ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసి విద్యార్థులకు పంపిస్తున్న ప్రజలు

జూలై 20న జరిగిన ఆందోళనల తర్వాత మహారాష్ట్రకు చెందిన అనుజ్ రావత్ అనే వ్యక్తి జొమాటో ద్వారా ఆహారం ఆర్డర్ చేసి, అక్కడ ఆకలితో ఉన్న ఎవరికైనా అందించాలని డెలివరీ పార్ట్‌నర్‌కు సూచించినట్లు సమాచారం. అలాగే గ్రేటర్ కైలాష్‌కు చెందిన అనిల్ యాదవ్ స్విగ్గీ ద్వారా 25 వెజ్ థాళీలను పంపించి విద్యార్థులకు మద్ధతు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇదే తరహాలో అనేక మంది ఆహారం పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

Continuous Food Delivery at Jantar Mantar from All over India…#cjp_पार्टी#CJP#India#Delhipic.twitter.com/lR5hDZO7YE

— Orugallu Adda (@OrugalluAdda) July 22, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్థానికులు కూడా స్వయంగా ఆహారం తీసుకొచ్చిన ఘటనలు
Image Credit : Orugallu Adda/X

స్థానికులు కూడా స్వయంగా ఆహారం తీసుకొచ్చిన ఘటనలు

ఆన్‌లైన్ డెలివరీలతో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా స్వయంగా ఆహారం తీసుకొచ్చి విద్యార్థులకు అందిస్తున్నారు. చావ్డీ బజార్‌కు చెందిన ఉస్మాన్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఆందోళనల వీడియోలు చూసిన తర్వాత తమ కాలనీ ప్రజల సూచనతో ఆహారం తీసుకొచ్చినట్లు తెలిపాడు. అలాగే ఫరీదాబాద్‌కు చెందిన శివమ్ తన సోదరుడితో కలిసి వచ్చి నిరసనకారులకు భోజనం అందించాడు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులకు మద్ధతుగా ఈ చర్యలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.

देशभर में अपने अपने घरों पर बैठे लोग जोमेटो, स्विगी पर खाना ऑर्डर करके जंतर मंतर पर प्रदर्शनकारी छात्रों/नौजवानों के लिए पहुंचवा रहे हैं। जोमेटो डिलीवरी बॉय बता रहा है कि सुबह से 20 बार जंतर मंतर पर खाना ला चुका हूं।

Insta Video : @dilnawazpashapic.twitter.com/BU5G19qDvq

— Sachin Gupta (@Sachingupta) July 21, 2026

Related Articles

Related image1
రూ. 40 వేల జీత‌మున్నా ఈ ల‌గ్జ‌రీ కారుకు ఓన‌ర్ అయిపోవ‌చ్చు.. లుక్‌లోనే కాదు ఫీచ‌ర్ల‌లో కూడా తోపు
Related image2
Business Idea: నెల‌కు ల‌క్ష సంపాదించే అవ‌కాశం.. ట్రెండీ ఐడియా, ప్రైవేట్ థియేట‌ర్ బిజినెస్‌తో సాధ్య‌మే
34
ఆహారం, నీరు, మందులతో నిండిన నిరసన ప్రాంగణం
Image Credit : Orugallu Adda/X

ఆహారం, నీరు, మందులతో నిండిన నిరసన ప్రాంగణం

జంతర్‌మంతర్ వద్ద ప్రస్తుతం పిజ్జాలు, బర్గర్లు, వెజ్ థాళీలు, వాట‌ర్ బాటిల్స్‌, అవసరమైన మందులు వంటి వస్తువులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచినట్లు అక్కడి దృశ్యాలు చూపిస్తున్నాయి. అవసరమైన వారు వాటిని ఉచితంగా తీసుకునేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఉద్రిక్త ఘటనల తర్వాత కూడా మంగళవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు అక్కడే నిరసనలు కొనసాగించారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు సెక్షన్ 163 అమలు చేస్తూ, పెద్ద సంఖ్యలో గుమికూడవద్దని హెచ్చరిస్తున్నారు.

STUDENTS AT JANTAR MANTAR DIDN’T SLEEP HUNGRY 

From food packets to water bottles, people from across India are sending whatever they can. 

No one have never met the students but they simply don’t want them to go hungry. pic.twitter.com/LLXsK8ef17

— Ravi Prakash Official (@raviprakash_rtv) July 22, 2026

44
సోషల్ మీడియాలో భిన్న స్పందనలు.. ఆహారం పంపొద్దని సీజేపీ విజ్ఞప్తి
Image Credit : Orugallu Adda/X

సోషల్ మీడియాలో భిన్న స్పందనలు.. ఆహారం పంపొద్దని సీజేపీ విజ్ఞప్తి

ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఆహారం పంపించడం విద్యార్థుల పట్ల సంఘీభావానికి నిదర్శనమని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఈ నిరసనలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరికొందరు భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తూ, తెలియని వ్యక్తులు పంపే ఆహారంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం అవసరమైనంత ఆహారం అందుబాటులో ఉందని, ఇకపై స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ద్వారా ఆహారం లేదా ఇతర వస్తువులు పంపవద్దని కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

People delivering free food from home to Jantar Mantar protest site.

That's how my India works pic.twitter.com/sTsqtsKY9i

— 🪳Against Corruption (@akashuchani08) July 21, 2026

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
వైరల్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Fact Check: ఢిల్లీ నిరసనల్లో ప్రాణ నష్టంపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
PM Modi: మోదీ మార్క్.. దేశ రాజ‌కీయాల్లో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం
Recommended image3
PM Kisan Hike: పీఎం కిసాన్ నిధులు పెరుగుతాయా? 24వ విడత రూ.2000 పొందాలంటే ఈ 3 పనులు వెంటనే చేయండి
Related Stories
Recommended image1
రూ. 40 వేల జీత‌మున్నా ఈ ల‌గ్జ‌రీ కారుకు ఓన‌ర్ అయిపోవ‌చ్చు.. లుక్‌లోనే కాదు ఫీచ‌ర్ల‌లో కూడా తోపు
Recommended image2
Business Idea: నెల‌కు ల‌క్ష సంపాదించే అవ‌కాశం.. ట్రెండీ ఐడియా, ప్రైవేట్ థియేట‌ర్ బిజినెస్‌తో సాధ్య‌మే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved