Mukesh Ambani: కొడుకుతో వాచ్ మెన్ కి క్షమాపణలు చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
Mukesh Ambani: మన దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ.. తన కొడుకు విషయంలో అంత కఠినంగా ప్రవర్తించాడా? కొడుకుతో.. వాచ్ మెన్ కి క్షమాపణలు చెప్పించాడా? ఎందుకు..?

ముఖేష్ అంబానీ...
మన దేశ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. ఆయన ఎంత బిజీ వ్యాపారవేత్త అయినా.. తమ కుటుంబానికి సమయం కేటాయించేవారు. ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా.. పిల్లలకు ఆ అహం దరిచేరకుండా ప్రవర్తించేవారు. ముఖ్యంగా.. తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తో.. వాచ్ మెన్ కి క్షమాపణలు చెప్పించాడు. అసలు.. తమ కొడుకుతో ఆయన అంత కఠినంగా ప్రవర్తించాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
పిల్లలను విలువలతో పెంచడం...
చాలా మంది కొంచెం డబ్బు ఉంటేనే తమ పిల్లలను చాలా అహంకారంతో పెంచుతారు. కానీ.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు మాత్రం కోట్లలో ఆస్తులు ఉన్నా కూడా... పిల్లలను డబ్బుతో కాకుండా.. విలువలతో పెంచారు. అందరితో మర్యాదగా ప్రవర్తించడం నేర్పించారు. దీనికి సంబంధించిన ఓ విషయాన్ని నీతా అంబానీ ఇంటర్వ్యూలో చెప్పారు. పిల్లలు తప్పు చేసినప్పుడు తాము పిల్లలతో ఎంత కఠినంగా ఉంటామో కూడా చెప్పారు.
కొడుకుతో వాచ్ మెన్ కి క్షమాపణలు...
ముఖేష్ అంబానీ పిల్లలు తప్పు చేసినప్పుడు అస్సలు క్షమించేవారు కాదని నీతా అంబానీ చెప్పారు. చిన్నప్పుడు ఆకాశ్ అంబానీ.. ఓసారి తమ ఇంటి వాచ్ మెన్ తో అమర్యాదగా మాట్లాడాడట. ఆకాశ్ మాట్లాడిన తీరు చాలా అమర్యాదకరంగా ఉండటం ముఖేష్ అంబానీ కంట పడింది. దీంతో.. ముఖేష్ కి కోపం వచ్చింది.. వెంటనే కొడుక్కి బుద్ధి చెప్పాలని అనుకున్నారు. వెంటనే.. కిందకు వాచ్ మెన్ దగ్గరకు వెళ్లి.. క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. తండ్రి చెప్పడంతో.. తాను చేసిన తప్పు అర్థం చేసుకున్న ఆకాశ్ వెంటనే వెళ్లి వాచ్ మెన్ కి క్షమాపణలు చెప్పాడని.. ఓ ఇంటర్వ్యూలో నీతా అంబానీ చెప్పారు.
‘సోషల్ స్టేటస్ తో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరినీ గౌరవించాలని ముఖేష్ తన పిల్లలకు స్పష్టంగా నేర్పించారు. అంబానీ కుటుంబంలో పుట్టామనే అహకారంతో... ఇతరులను తక్కువ చేసి చూడకూడదని, అగౌరవంగా ప్రవర్తించకూడదని పిల్లలకు చిన్నప్పటి నుంచే ముఖేష్ నేర్పించారు. డబ్బు ఉందనే అహంకారం దరిచేరకుండా చేసేవారు’ అని నీతా అంబానీ చెప్పారు.
ప్రస్తుత కాలంలో... చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను గారాబం చేస్తూ ఉంటారు. అలాంటివారు.. అంబానీ దంపతుల నుంచి కచ్చితంగా ఈ పాఠం నేర్చుకోవాల్సిందే. అంతేకాదు.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా.. పిల్లలకు వేలల్లో కూడా పాకెట్ మనీ ఇచ్చేవారు కాదట. తోటి పిల్లలు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీలను ఏడిపించినా కూడా... వీరు మాత్రం.. వారి అవసరానికి మించి ఏరోజూ ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు కాదు. మొదట్లో వారానికి కేవలం 5 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చేవారట. తర్వాత దానిని రూ.10కి పెంచారు. ఎంత డబ్బు ఉన్నా అవసరానికి మించి ఇవ్వకూడదని నీతా, ముఖేష్ అంబానీలు భావించేవారు.

