Weight loss Tips: వీటిని మానకపోతే విపరీతంగా బరువు పెరిగిపోతారు జాగ్రత్త..
Weight loss Tips: బరువు తగ్గాలనుకునే వారు ముందుగా మీరు తీసుకునే ఆహార పదార్థాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే మీ బరువు నియంత్రణలో ఉంటుంది.

Weight loss Tips: మారుతున్న జీవన శైలీ, చెడు ఆహారపు అలవాట్ల వల్ల నేడు ఎంతో మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా శరీరంలో విపరీతంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీంతో వారు మరింత లావుగా కనిపిస్తుంటారు.
weight loss
అంతేకాదు లావుగా ఉండే వారు నలుగురిలోకి వెళ్లడానికి కూడా నామోషీగా ఫీలవుతుంటారు. ఇలాంటి వారిలో ఆత్మవిశ్వాసం కూడా తక్కువగానే ఉంటుంది. అంతేకాదు వీరే నలుగురిలో అవమానాలకు గురవుతుంటారు. అందుకే వీలైనంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో మార్గాలను వెతుకుతుంటారు.
weight loss
అయితే వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంచెం కూడా బరువు కోల్పోని వారు చాలా మందే ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు. ఇలాంటి వారు తాము తీసుకునే ఆహారం విషయంలో దృష్టి పెట్టరు. అందుకే ఏవేవో తింటుంటారు. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు మాత్రం తగ్గరు. అయితే బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటే సులభంగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునే వారు సమతుల్య ఆహారం తీసుకోవాలి. మీ ఆహారంలో కొవ్వులు, నిల్వ చేసిన, ప్యాకెట్ ఫుడ్స్ ఉండకుండా చూసుకోవాలి.
soft drinks
ముఖ్యంగా వేసవి కాలం వచ్చింది.. దాహం తీరడం లేదని శీతల పానీయాలను మోతాదుకు మించి తాగే వారు చాలా మందే ఉన్నారు. కానీ బరువు తగ్గాలనుకునే వారు మాత్రం వీటి జోలికి అస్సలు పోకూడదు. వీటిని తాగడం శరీరంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి.
వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు స్వీట్లు.. చక్కెర ఉండే ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు మరింత పెరిగే అవకాశం ఉంది.
మీ రోజు వారి ఆహారంల గింజలు ఉండేట్టు చూసుకోవాలి. వాల్ నట్స్, బాదం పప్పులు వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కండరాలను మరమ్మత్తు చేసేందుకు సహాయపడతాయి. అంతేకాదు వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు ఎక్కువ సేపు నిండుగానే ఉన్న భావన కలిగిస్తుంది.
మీ రోజు వారి ఆహారంల గింజలు ఉండేట్టు చూసుకోవాలి. వాల్ నట్స్, బాదం పప్పులు వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కండరాలను మరమ్మత్తు చేసేందుకు సహాయపడతాయి. అంతేకాదు వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు ఎక్కువ సేపు నిండుగానే ఉన్న భావన కలిగిస్తుంది.
మన శరీరంలో నీరే ఎక్కువ భాగం ఉంటుందని అందరికీ తెలుసు. శరీరానికి సరిపడా నీళ్లను తీసుకున్నప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మెటబాలిజం కూడా బావుంటుంది. ఇది బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
అయితే మీరు తిన్న తర్వాత నార్మల్ వాటర్ కాకుడా గోరువెచ్చని నీళ్లను తాగండి. ఇది మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బరువు కూడా పెరగరు.