MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Mutton Vs Goat meat: మేక మాంసం, గొర్రె మాంసం రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది తినడం బెటర్?

Mutton Vs Goat meat: మేక మాంసం, గొర్రె మాంసం రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది తినడం బెటర్?

Mutton Vs Goat meat: మీరు రెగ్యులర్ గా నాన్ వెజ్ తింటారా? మేక మాంసం తింటారా లేక గొర్రె మాంసం తింటారా? ఈ రెండింటికి తేడా ఏంటి? అసలు ఈ రెండింటిలో ఏది తింటే ఆరోగ్యంగా ఉంటామో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 18 2026, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Goat Meat vs Sheep Meat
Image Credit : Geminiai

Goat Meat vs Sheep Meat

సండే వచ్చిందంటే చాలు నాన్-వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక మటన్ ప్రియుల విషయానికి వస్తే.. మార్కెట్‌లో దొరికే మేక మాంసం లేదా గొర్రె మాంసం రెండింటినీ 'మటన్' అని పిలుస్తూ లాగించేస్తుంటారు. రెండింట్లోనూ ప్రోటీన్, ఐరన్, బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, కొవ్వు, కేలరీల విషయంలో ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. మరి ఆరోగ్య దృష్ట్యా ఏది బెస్ట్? ఏది తింటే మన ఒంటికి మంచిది? అసలు నిజాలేంటో చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేక మాంసం:
Image Credit : Getty

మేక మాంసం:

మేక మాంసంలో సంతృప్త కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.

ప్రోటీన్ & పోషకాలు: కండరాల బలానికి కావలసిన ఉత్తమ ప్రోటీన్‌తో పాటు ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ B12 ఇందులో పుష్కలంగా ఉంటాయి.

తక్కువ కొలెస్ట్రాల్: ఇతర రెడ్ మీట్స్‌తో పోలిస్తే మేక మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి ఇది మంచిదే.

Related Articles

Related image1
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Related image2
Parenting: ఆడపిల్లలకు తండ్రి అవసరం ఏ వయసులో ఎలా ఉంటుంది? వయసుని బట్టి తండ్రి ప్రేమ మారాలా?
34
గొర్రె మాంసం (మటన్):
Image Credit : Getty

గొర్రె మాంసం (మటన్):

గొర్రె మాంసం( మటన్) లో కూడా ప్రోటీన్, ఐరన్ , విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో లభించే 'హీమ్ ఐరన్' రక్తహీనత ఉన్నవారికి త్వరగా ఐరన్‌ను అందిస్తుంది.

అధిక కొవ్వు: గొర్రె మాంసంలో కొన్ని భాగాలలో సంతృప్త కొవ్వు , కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

ఈ గొర్రె మాంసంలో కొవ్వు శాతం ఎక్కువ కాబట్టి దీనిని పరిమితికి మించి తరచుగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు.

44
ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
Image Credit : Getty

ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు ఉంటూనే.. అధిక ప్రోటీన్ అందించే విషయంలో మేక మాంసం ముందు ఉంటుంది. అయితే గొర్రె మాంసంలో పోషకాలు లేవని కాదు, అందులో కొవ్వు శాతం కొంచెం ఎక్కువ. అందుకే.. ఈ రెండింటిలో మేక మాంసమే ఆరోగ్యానికి మంచిది.

అయితే.. మనం సరిగా వండినప్పుడు మాత్రమే పోషకాలు మనకు అందుతాయి.మీరు మేక మాంసమే తింటున్నప్పటికీ.. దాన్ని కేజీల కొద్దీ నూనె, కొవ్వు, ఉప్పు , ఘాటైన మసాలాలు వేసి ఫ్రై చేస్తే దాని ఆరోగ్య ప్రయోజనాలన్నీ తగ్గిపోతాయి. కాబట్టి, వీలైనంత వరకు తక్కువ నూనెతో వండటం మంచిది. ఇక గొర్రె మాంసం వండేటప్పుడు పైన కనిపించే తెల్లటి కొవ్వును తొలగించి, తక్కువ నూనెతో బ్రేజింగ్, గ్రిల్లింగ్ లేదా పులుసు రూపంలో వండుకుంటే కొవ్వును అదుపు చేయవచ్చు.

గుండె జబ్బులు, బిపి, కిడ్నీ సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు తమ ఆహారంలో ఎంత పరిమాణంలో మాంసం తీసుకోవాలో డాక్టర్ లేదా డైటీషియన్ సలహా మేరకు నిర్ణయించుకోవడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Morning Routine : ఉదయం లేవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
Recommended image2
Gold Studs: తక్కువ బంగారంతోనే అద్భుతమైన గోల్డ్ స్టడ్ డిజైన్లు
Recommended image3
Mini Jhumkas: అదిరిపోయే గోల్డ్ మినీ జుంకాలు డిజైన్లు ఇవిగో
Related Stories
Recommended image1
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Parenting: ఆడపిల్లలకు తండ్రి అవసరం ఏ వయసులో ఎలా ఉంటుంది? వయసుని బట్టి తండ్రి ప్రేమ మారాలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved