MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • స్లీప్ మాస్క్ ను వాడే అలవాటుందా.. అయితే మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

స్లీప్ మాస్క్ ను వాడే అలవాటుందా.. అయితే మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

గాఢంగా నిద్రపోవడానికి స్లీప్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రస్తుత కాలంలో వీటిని చాలా మంది ఉపయోగిస్తున్నారు. కానీ ఇవి మనకు, పర్యవరణానికి ఎంతో హాని చేస్తాయని నిపుణులు అంటున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 31 2023, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నిద్రలోనే సగం రోగం తగ్గుతుంది. మరెన్నో రోగాల ముప్పు తప్పుతుంది. కానీ ప్రస్తుతం ఎంతో మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, హై బీపీ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.  అందుకే నిద్రలేమి సమస్యలను పోగొట్టడానికి, గాఢంగా నిద్రపట్టడానికి మార్కెట్ లోకి కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అందులో ఒకటి స్లీప్ మాస్క్. ఈ స్లీప్ మాస్క్ కళ్లపై కాంతిని పడకుండా చేసి కళ్లకు రెస్ట్ ఇస్తుంది. అలాగే ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తుంది. ఇది నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. అందుకే ఈ మద్యకాలంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. వీటిని చాలా మంది వాడుతున్నారు. ఏదేమైనా స్లీప్ మాస్క్ వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. 

26

చాలా స్లీప్ మాస్క్ లను తయారు చేసే మెటీరియల్లోనే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అంటే చాలా స్లీప్ మాస్క్ లు పాలిస్టర్ లేదా నైలాన్ వంటి సింథటిక్ పదార్థాలతో తయారవుతాయి. ఈ పదార్థాలు మన ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. వీటివల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
 

36

సింథటిక్ పదార్థాలను మృదువుగా, సౌకర్యవంతంగా చేయడానికి వీటికి రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు మన చర్మానికి హానికరం. వీటివల్ల కొంతమందికి అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి. దీనికితోడు ఈ మాస్క్ లను ఉతికినప్పుడు ఈ రసాయనాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇవి కాలుష్యం, పర్యావరణ నష్టానికి దారితీస్తాయి. 
 

46

సింథటిక్ పదార్థాలు బయోడిగ్రేడబుల్ కావు. ఈ మాస్క్ లను యూజ్ చేసి పారేసినప్పుడు.. ఇవి వందల సంవత్సరాలు అలాగే పాడుకాకుండా ఉంటాయి. ఈ మాస్క్ కరాబైన తర్వాత దానిలో ఉండే  రసాయనాలు పర్యావరణంలోకి విడుదల అవుతాయి. 

56

కాబట్టి  స్లీప్ మాస్క్ లను చూసి కొనడం మంచిది. ఒక వేళ మీరు స్లీప్ మాస్క్ ను వాడాలనుకుంటే వెదురు లేదా పత్తి వంటి సహజ పదార్ధాలతో తయారైన స్లీప్ మాస్క్ ను కొనండి. ఈ పదార్థాలు సింథటిక్ పదార్థాల కంటే మృదువైనవి. అలాగే సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. చర్మపు చికాకు లేదా అలెర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. 

66

అలాగే సహజ పదార్థాలు బయోడిగ్రేడబుల్. అందుకే  వీటిని పారేసినప్పుడు అవి కాలుష్యం, పర్యావరణానికి ఎలాంటి నష్టాన్ని కలిగించవు. అయితే మీరు స్లీప్ మాస్క్ ను కొనేటప్పుడు అవి సర్దుబాటు చేయడానికి, ముఖానికి సౌకర్యంగా సరిపోయే వాటినే సెలెక్ట్ చేసుకోండి. సరిగ్గా సరిపోని మాస్క్ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి మాస్క్ లను వాడటం వల్ల నిద్రహాయిగా పట్టడానికి బదులుగా మొత్తమే నిద్ర ఉండదు. 

  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
AC : ఎండలోంచి నేరుగా ఏసీ రూమ్‌ లోకి వెళ్తున్నారా..? ఆ చల్లదనం ఎంత డేంజరో తెలుసా..?
Recommended image2
Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు
Recommended image3
Health : ఆల్కహాల్ అలవాటే లేకున్నా లివర్ డ్యామేజ్ అవుతుందా..! ఈ ఐదు విషయాలే కారణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved