MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Train : రైలులో నాన్ స్టాప్ గా వాటర్ సప్లై అవుతుంది.. అసలు ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడుంటుంది?

Train : రైలులో నాన్ స్టాప్ గా వాటర్ సప్లై అవుతుంది.. అసలు ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడుంటుంది?

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వాష్‌బేసిన్లు, టాయిలెట్లలో నీళ్లు వాడుతుంటాం కదా? ఇంతకీ ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు రైలులో వాటర్ ట్యాంక్ ఎక్కడుంటుంది? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే దీన్ని ఇక్కడ క్లియర్ చేసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 25 2026, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రైలులో వాటర్ ట్యాంక్ ఎక్కడుంటుంది?
Image Credit : Gemini AI

రైలులో వాటర్ ట్యాంక్ ఎక్కడుంటుంది?

సాధారణంగా ఇళ్లలో నిత్యావసరాల కోసం వాడుకునే నీళ్లు వాటర్ ట్యాంక్ నుండి వస్తాయి. ఇంటిపైన దీన్ని అమర్చుతారు... కాబట్టి ఎలాంటి కరెంట్ అవసరం లేకుండానే నీళ్లు కిందకి వస్తాయి. అయితే మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వాష్ బేసిన్, టాయి లెట్స్ లో వాటర్ వాడుతుంటారు... మరి ఈ నీళ్లు ఎక్కడినుండి వస్తాయి? రైలు పైన ఎక్కడా వాటర్ ట్యాంక్ కనిపించదుగా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

చాలామంది మన ఇళ్లలో ఉన్నట్లే రైలు పైకప్పుపై పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుందని అనుకుంటారు. అయితే పాత రైళ్లలో అలాగే ఉండేది... కానీ ఇప్పుడున్న ఆధునిక ICF, LHB కోచ్‌లలో వాటర్ ట్యాంకులు పైకప్పు మీద కాదు, కోచ్ కింది భాగంలో (అండర్‌ఫ్రేమ్) అమర్చారు. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన ఈ ట్యాంకులు కోచ్ కింద సురక్షితంగా బిగించి ఉంటాయి. ఒక్కో కోచ్‌లో 450 లీటర్ల సామర్థ్యం గల 4 ట్యాంకులు ఉంటాయి. అంటే మొత్తం 1,800 లీటర్ల నీటిని నిల్వ చేస్తారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో 'క్విక్ వాటరింగ్ సిస్టమ్' ద్వారా కేవలం 10 నిమిషాల్లో ఈ ట్యాంకులను నింపుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రైలులో నీళ్లు పైకి ఎలా వస్తాయి?
Image Credit : AI

రైలులో నీళ్లు పైకి ఎలా వస్తాయి?

రైలు కింద ట్యాంకులో ఉండే నీళ్లు పైనున్న పైపుల్లోకి ఎలా వస్తాయనేగా మీ డౌట్. ఇక్కడే రైల్వే సాంకేతికత దాగి ఉంది. 'హైడ్రో-న్యూమాటిక్ ప్రెజర్ పంప్', 'ఎయిర్ అసిస్టెడ్ సిస్టమ్స్' ద్వారా కింద ఉన్న నీటిని పైకి పంపిస్తారు. రైలు బ్రేక్ సిస్టమ్ కోసం ఉపయోగించే గాలి ఒత్తిడిలోని కొంత భాగాన్ని ఈ నీటి వ్యవస్థకు కూడా వాడతారు. ఈ గాలి ఒత్తిడిని వాటర్ ట్యాంకుల్లోకి పంపిస్తారు. అప్పుడు ఏర్పడిన శక్తి నీటిని పైకి నెట్టి, టాయిలెట్లు, వాష్‌బేసిన్ పైపులకు నిరంతరాయంగా సరఫరా చేస్తుంది. రైలు కదులుతున్నా, ఆగి ఉన్నా.. ఎలాంటి మోటార్లు లేకుండా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

Related Articles

Related image1
India Facts : భారత్ పొడవు, వెడల్పు ఎంతో తెలుసా? ఏది ఎక్కువో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Related image2
Seven Sisters of India : ఈశాన్య రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అని ఎందుకంటారు? వీటికి ఓ బిగ్ బ్రదర్ కూడా ఉన్నాడు, ఎవరో తెలుసా?
33
ట్యాంకులు పైకప్పు నుంచి కిందికి ఎందుకు మారాయి?
Image Credit : Gemini AI

ట్యాంకులు పైకప్పు నుంచి కిందికి ఎందుకు మారాయి?

మన ఇళ్లలో మాదిరిగానే పాతకాలంలో వాటర్ ట్యాంకులు రైలు పైకప్పు మీదే ఉండేవి. కానీ కొన్ని సమస్యల వల్ల రైల్వే శాఖ వాటిని కోచ్ కింది భాగానికి మార్చింది. పైకప్పు మీద ఎక్కువ బరువు పెట్టలేరు కాబట్టి కేవలం 900 నుంచి 1,000 లీటర్ల నీటిని మాత్రమే నిల్వ చేయగలిగేవారు. దీంతో దూర ప్రయాణాల్లో నీళ్లు త్వరగా అయిపోయేవి. ఇప్పుడు కింద పెట్టడం వల్ల 1,800 లీటర్ల వరకు నిల్వ చేయగలుగుతున్నారు.

అంతేకాదు రైళ్లు గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు పైకప్పుపై బరువు ఎక్కువగా ఉండటం వల్ల దాని స్థిరత్వం దెబ్బతినేది. ఇలా భద్రతా కారణాల దృష్ట్యా కూడా వాటర్ ట్యాంకులను కిందకు మార్చారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
India Facts : భారత్ పొడవు, వెడల్పు ఎంతో తెలుసా? ఏది ఎక్కువో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Recommended image2
Seven Sisters of India : ఈశాన్య రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అని ఎందుకంటారు? వీటికి ఓ బిగ్ బ్రదర్ కూడా ఉన్నాడు, ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved