MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Hotel Safety Tips : హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్‌పై వాలిపోకండి..! ఈ విషయాలు చెక్ చేసుకొండి

Hotel Safety Tips : హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్‌పై వాలిపోకండి..! ఈ విషయాలు చెక్ చేసుకొండి

ట్రావెలింగ్ అలసటతో హోటల్ రూమ్ కి వెళ్లగానే నేరుగా బెడ్‌పై వాలిపోవద్దు. ఇలాంటిచోట మీ భద్రత చాలా ముఖ్యం. అందుకే రూమ్‌లోకి వెళ్లాక, మీ సేఫ్టీ కోసం కొన్ని విషయాలు తప్పకుండా చెక్ చేసుకోండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 28 2026, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోటల్ రూమ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Image Credit : Getty

హోటల్ రూమ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

టూర్ అయినా, ఆఫీస్ పని అయినా... వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు హోటల్‌లో ఉండటం తప్పనిసరి. రూమ్‌లోకి అడుగుపెట్టగానే చాలామంది అక్కడి లగ్జరీ సౌకర్యాలు, కిటికీ నుంచి కనిపించే వ్యూ చూసి మురిసిపోతారు. కానీ ఈ రోజుల్లో మన భద్రత, ప్రైవసీ చాలా ముఖ్యం. అందుకే, రూమ్ సర్వీస్‌కు ఆర్డర్ ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 డోర్, కిటికీలు పరిశీలించండి..
Image Credit : Getty

డోర్, కిటికీలు పరిశీలించండి..

గదిలోకి వెళ్లిన వెంటనే ముందుగా తలుపు వేసి దాని డెడ్‌బోల్ట్ లాక్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడండి. డోర్‌కు ఉండే చిన్న రంధ్రం (పీప్‌హోల్) కూడా పరిశీలించండి. అది పగిలిపోయినా లేదా దానిలో కాగితం లాంటివి పెట్టినా వెంటనే రిసెప్షన్‌కు కంప్లైంట్ చేయండి.

ప్రధాన ద్వారం ఎంత ముఖ్యమో, కిటికీల భద్రత కూడా అంతే ముఖ్యం. బాల్కనీ డోర్ లోపలి నుంచి సరిగ్గా లాక్ అవుతుందో లేదో చెక్ చేయండి. ముఖ్యంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లో బస చేస్తుంటే ఇది చాలా అవసరం.

Related Articles

Related image1
Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
Related image2
Moon Hotel : భూమిపై కాదు.. ఇక చంద్రుడిపై హనీమూన్ ! ఒక్క నైట్ రేటు మైండ్ బ్లాక్ !
35
రహస్య కెమెరాలున్నాయేమో చూడండి..
Image Credit : Getty

రహస్య కెమెరాలున్నాయేమో చూడండి..

ఈ మధ్య కాలంలో హోటల్ గదుల్లో రహస్య కెమెరాల బెడద ఎక్కువైంది. టీవీ సెట్-టాప్ బాక్స్, స్మోక్ డిటెక్టర్, ఏసీ వెంట్స్, గోడ గడియారం, అద్దాలు వంటి గదిలోని వస్తువుల్లో రహస్యంగా కెమెరాలు అమర్చుతున్నారు… కాబట్టి గదిలోకి వెళ్లగానే వస్తువులను జాగ్రత్తగా గమనించండి. స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌లైట్ వేసి మూలల్లో చెక్ చేయండి. కెమెరా ఉంటే దాని లెన్స్ మెరుస్తుంది.

45
ఎవరైనా దాక్కున్నారేమో వెతకండి...
Image Credit : StoryBlocks

ఎవరైనా దాక్కున్నారేమో వెతకండి...

ఇది కొంచెం అతిగా అనిపించినా భద్రత కోసం అవసరం. గదిలోకి వెళ్లగానే బాత్రూమ్, అలమరా లోపల, కర్టెన్ల వెనుక, మంచం కింద ఎవరైనా దాక్కున్నారేమో లేదా ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో ఒకసారి చూడండి.

అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ నెట్‌వర్క్ పనిచేయకపోవచ్చు. అందుకే గదిలోని ఫోన్ పనిచేస్తుందో లేదో చెక్ చేయండి. రిసెప్షన్ నంబర్‌కు డయల్ చేసి, వాయిస్ సరిగ్గా వినిపిస్తుందో లేదో నిర్ధారించుకోండి.

55
విలువైన వస్తువులు జాగ్రత్త...
Image Credit : Getty

విలువైన వస్తువులు జాగ్రత్త...

 మీ విలువైన వస్తువులు పెట్టుకోవడానికి గదిలో సేఫ్ బాక్స్ ఉంటుంది. అది సరిగ్గా లాక్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ అది ముందే లాక్ చేసి ఉన్నా లేదా సరిగా పనిచేయకపోయినా వెంటనే సిబ్బందితో దాన్ని రీసెట్ చేయించుకోండి.

ప్రతి హోటల్ గది తలుపు వెనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ ఉంటుంది. అగ్నిప్రమాదం లాంటివి జరిగితే గది నుంచి బయటకు వెళ్లే దగ్గరి దారి ఏదో ముందుగానే తెలుసుకోండి.

తెగిపోయిన కరెంట్ వైర్లు లేదా పగిలిపోయిన సాకెట్లు ప్రమాదకరం. బాత్రూమ్‌లోని గీజర్ లేదా హెయిర్ డ్రైయర్ దగ్గర వైర్లు బయటకు వచ్చాయేమో చూడండి. ఏమాత్రం ప్రమాదకరంగా అనిపించినా వెంటనే రూమ్ మార్చమని అడగండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
యుటిలిటీ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్
విశాఖపట్నం

Latest Videos
Recommended Stories
Recommended image1
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Recommended image3
Longest Lifespan Animals: బాబోయ్.. ఏకంగా 4300 ఏళ్లు బతుకుతుందా? భూమిపై అత్యంత ఎక్కువ ఆయుష్షు ఉన్న జీవి ఇదే !
Related Stories
Recommended image1
Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image2
Moon Hotel : భూమిపై కాదు.. ఇక చంద్రుడిపై హనీమూన్ ! ఒక్క నైట్ రేటు మైండ్ బ్లాక్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved