MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Cancer Train: ఈ రైలులో 60 శాతం మంది క్యాన్సర్ పేషెంట్లే ప్రయాణికులు.. దీని వెనుక గుండె బరువెక్కే నిజం

Cancer Train: ఈ రైలులో 60 శాతం మంది క్యాన్సర్ పేషెంట్లే ప్రయాణికులు.. దీని వెనుక గుండె బరువెక్కే నిజం

Cancer Train: మనదేశంలో వందలాది రైళ్లు ఉన్నాయి. అందులో ఒక రైలు మాత్రం ప్రయాణికుల కన్నీటి కథను చెబుతుంది. దీన్ని 'క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్' అని పిలుస్తారు. ప్రతి రాత్రి వందలాది మంది క్యాన్సర్ రోగులను మోసుకెళ్లే ఈ రైలు వెనుక ఎంతో బాధాకర కథ ఉంది.

2 Min read
Author : Haritha Chappa
Published : May 25 2026, 08:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మనదేశంలో క్యాన్సర్ ట్రైన్
Image Credit : AI Image

మనదేశంలో క్యాన్సర్ ట్రైన్

ఇండియాలో వందలాది రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తారు. ప్రయాణంలో ఎంతో సరదాగా గడుపుతారు. కానీ ఒక్క ట్రైన్లో మాత్రం బరువెక్కిన గుండెలతో ప్రయాణికులు ఎక్కుతారు. వారి ముఖాల్లో ఆనందం కనిపించదు. తమకు, తమ వారికి ఏమవుతుందేమోనన్న భయం కనిపిస్తుంది. దీన్ని ప్రజలు క్యాన్సర్ ట్రైన్ అని పిలుచుకుంటారు. అందులో ఎక్కేది 60 శాతం మంది క్యాన్సర్ పేషెంట్లే. ఇక మిగతావారు వారికి సాయం వెళ్లే అటెండెంట్లు.  ఈ రైలు ప్రతిరోజూ రాత్రి 9:30 గంటలకు పంజాబ్‌లోని బఠిండా స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇది రాజస్థాన్‌లోని బికనీర్‌కు చేరుకుంటుంది. సుమారు 325 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి 8-9 గంటల సమయం పడుతుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఈ ప్యాసింజర్ రైల్ చాలా ఫేమస్
Image Credit : Getty

ఈ ప్యాసింజర్ రైల్ చాలా ఫేమస్

పంజాబ్, రాజస్థాన్ మధ్య నడిచే ఈ  రైలు సాధారణ సాధారణ ప్యాసింజర్ రైతు. దాని నంబర్ 14726. కానీ దాన్ని 'క్యాన్సర్ ట్రైన్' గానే ఎక్కువ మంది గుర్తుపడతారు. ఇది కేవలం ఒక రైలు కాదు పంజాబ్‌లోని మాళ్వా ప్రాంతంలో నెలకొన్న భయంకరమైన ఆరోగ్య సంక్షోభానికి ఒక సజీవ సాక్ష్యంగా చెప్పుకోవాలి. అక్కడి పేద రోగుల పాలిట ఈ రైలు ఒక ఆశాకిరణం.

Related Articles

Related image1
Silver Vaddanam: బంగారు వడ్డాణం కొనలేరా? అయితే వెండి వడ్డాణం కొనేయండి.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
Related image2
Bread Pakodi: కరకరలాడే బ్రెడ్ పకోడీని నిమిషాల్లో ఇలా చేసేయండి, సాయంత్రం స్నాక్ గా అదిరిపోతుంది
34
అసలేం జరిగింది?
Image Credit : Getty

అసలేం జరిగింది?

పంజాబ్‌లోని మాళ్వా ప్రాంతం ఒకప్పుడు పచ్చదానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉంది. ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతాన్ని 'క్యాన్సర్ బెల్ట్' అని పిలుస్తున్నారు. హరిత విప్లవం తర్వాత ఇక్కడి రైతులు అధిక దిగుబడి కోసం విపరీతంగా పురుగుమందులు, రసాయన ఎరువులు వాడారు. ఇవి క్రమంగా భూమిలోకి ఇంకి, తాగునీటిని కూడా విషపూరితం చేశాయి. ఆ నీటిని అక్కడ ఉన్న ఎన్నో గ్రామాల్లోని ప్రజలు తాగడం వల్ల ఇంటికొక క్యాన్సర్ రోగి తయారుయ్యాడు. పంజాబ్‌లో క్యాన్సర్ చికిత్స చేయించాలంటే బాగా డబ్బులుండాలి.  అందుకే పేద రోగులు రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉన్న 'ఆచార్య తులసి క్యాన్సర్ హాస్పిటల్' కు వెళుతూ ఉంటారు. అక్కడ ప్రభుత్వ సబ్సిడీలతో చాలా తక్కువ ధరకే నాణ్యమైన చికిత్స దొరుకుతుంది.  అక్కడికి వీరిని చేర్చేది ఈ రైలే. అందుకే ఈ రైలుకు క్యాన్సర్ రైలు అని పేరు వచ్చింది.  ప్రభుత్వం వీరికి ఉచిత లేదా రాయితీ ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.

44
పార్లమెంట్ లో చర్చ
Image Credit : Asianet News

పార్లమెంట్ లో చర్చ

 పార్లమెంటులో కూడా ఈ 'క్యాన్సర్ ట్రైన్' గురించి చర్చలు నడిచాయి. పంజాబ్‌లో కలుషిత నీరు వల్ల మాళ్వా ప్రాంతంలో క్యాన్సర్ పెద్ద సమస్యగా మారిందని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని నాయకులు చర్చలు జరిపారు. కానీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రైలే లేకపోతే ఎంతో మంది పేద ప్రజలు చికిత్స అందక ఇంట్లోనే మరణించే వారు. అందుకే ఈ రైలుకు అక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్‌కు మూడు రెక్క‌లే ఎందుకు ఉంటాయి.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే
Recommended image2
Fastest Animals : అబ్బా ఏం స్పీడ్ రా బాబు! బుల్లెట్ కంటే వేగంగా దూసుకెళ్లే టాప్ 5 జంతువులు ఇవే
Recommended image3
Sukanya Samriddhi Yojana : మీ కూతురి కోసం సుకన్య స్కీమ్ లో కట్టిన డబ్బు.. 21 ఏళ్లకు ముందే తీసుకోవచ్చా?
Related Stories
Recommended image1
Silver Vaddanam: బంగారు వడ్డాణం కొనలేరా? అయితే వెండి వడ్డాణం కొనేయండి.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
Recommended image2
Bread Pakodi: కరకరలాడే బ్రెడ్ పకోడీని నిమిషాల్లో ఇలా చేసేయండి, సాయంత్రం స్నాక్ గా అదిరిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved