MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Fastest Animals : అబ్బా ఏం స్పీడ్ రా బాబు! బుల్లెట్ కంటే వేగంగా దూసుకెళ్లే టాప్ 5 జంతువులు ఇవే

Fastest Animals : అబ్బా ఏం స్పీడ్ రా బాబు! బుల్లెట్ కంటే వేగంగా దూసుకెళ్లే టాప్ 5 జంతువులు ఇవే

Fastest Animals : ప్రపంచంలో భూమి పై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుత. చిరుత కంటే వేగంగా నీటిలో పరుగెత్తే, నింగిలో ఎగిరే జీవులు కూడా ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన జీవుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : May 24 2026, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Fastest Animals : గాల్లో, నేలపై, నీళ్లలో చిరుత కంటే వేగంగా దూసుకెళ్లే టాప్ 5 జంతువులు ఇవే!
Image Credit : Gemini

Fastest Animals : గాల్లో, నేలపై, నీళ్లలో చిరుత కంటే వేగంగా దూసుకెళ్లే టాప్ 5 జంతువులు ఇవే!

ప్రకృతిలో జీవించాలంటే వేగం చాలా అవసరం. వేటాడే జంతువులకైనా, వేటాడబడే జంతువులకైనా స్పీడే ప్రాణాధారం. తమ పరిసర ప్రాంతాలలో ఆధిపత్యాన్ని చెలాయించడానికి కొన్ని జంతువులు అసాధారణమైన వేగంతో దూసుకెళ్తాయి. నేలపై అయినా, గాల్లో అయినా, లేదా నీటిలో అయినా సరే.. ఇవి క్షణాల్లో కనిపించకుండా దూసుకుపోతాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ఆ టాప్ 5 జీవుల వివరాలు గమనిస్తే..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
నేలపై రారాజు చిరుతపులి
Image Credit : Asianet News

నేలపై రారాజు చిరుతపులి

నేలపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుతపులి. ఇది గంటకు 112 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని తక్కువ బరువు ఉండే శరీరం, చాలా ఈజీగా సాగే వెన్నెముక దీనికి ప్లస్ పాయింట్. ఇవి చాలా తక్కువ దూరంలోనే అత్యంత వేగంగా, తుపాను వేగంతో వెళ్తాయి. అందుకే వేటలో వీటికి తిరుగుండదు.

Related Articles

Related image1
Natural Cooling Foods: ఎండలు మండిపోతున్నాయ్.. బాడీని కూల్‌గా ఉంచే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే !
Related image2
Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
36
ఆకాశంలో సూపర్ సోనిక్ డేగ
Image Credit : Getty

ఆకాశంలో సూపర్ సోనిక్ డేగ

గాల్లో ప్రయాణించే జీవుల గురించి మాట్లాడుకుంటే పెరెగ్రిన్ ఫాల్కన్ (డేగా) అన్నింటికంటే ముందుంటుంది. ఇది పైనుంచి కిందికి డైవ్ చేసేటప్పుడు గంటకు 320 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకొస్తుంది. ఇది కేవలం పక్షులలోనే కాదు, మొత్తం భూమ్మీద ఉన్న అన్ని జంతువులలోనే అత్యంత వేగవంతమైన జీవిగా రికార్డు సృష్టించింది.

46
నీటిని చీల్చుకుపోయే సేల్ ఫిష్
Image Credit : Getty

నీటిని చీల్చుకుపోయే సేల్ ఫిష్

సముద్రపు నీటిలో సేల్ ఫిష్ వేగానికి ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే. ఇది నీటిలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదగలదు. దీని స్ట్రీమ్‌లైన్డ్ బాడీ, లోపలికి ముడుచుకునే వెన్ను రెక్క దీనికి బాగా సహాయపడతాయి. ఎలాంటి శ్రమ లేకుండా నీటిని చీల్చుకుంటూ ఇది చాలా ఈజీగా ముందుకు సాగిపోతుంది.

56
సుదూర పరుగుల వీరుడు ప్రాంగ్‌హార్న్ యాంటిలోప్
Image Credit : our own

సుదూర పరుగుల వీరుడు ప్రాంగ్‌హార్న్ యాంటిలోప్

నార్త్ అమెరికా పచ్చికభూముల్లో కనిపించే ప్రాంగ్‌హార్న్ యాంటిలోప్ సుదూర పరుగుల వీరుడు. ఇది గంటకు 88 కిలోమీటర్ల వేగంతో చాలా ఎక్కువ దూరం అలసిపోకుండా పరిగెత్తగలదు. అందుకే దీనిని ఎండ్యూరెన్స్ స్ప్రింటర్ అని పిలుస్తారు. ఎంత దూరం అయినా సరే ఒకే వేగంతో దూసుకుపోవడం దీని స్పెషాలిటీ.

66
ఫాస్టెస్ట్ క్షీరదం మెక్సికన్ ఫ్రీ-టెయిల్డ్ బ్యాట్
Image Credit : stockPhoto

ఫాస్టెస్ట్ క్షీరదం మెక్సికన్ ఫ్రీ-టెయిల్డ్ బ్యాట్

మెక్సికన్ ఫ్రీ-టెయిల్డ్ బ్యాట్ గాల్లో సమాంతరంగా ప్రయాణించడంలో చాలా ఫేమస్. ఈ గబ్బిలం గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గాల్లో ఇంత వేగంగా ఎగరగల ఏకైక క్షీరదం ఇదే. దీని వేగం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sukanya Samriddhi Yojana : మీ కూతురి కోసం సుకన్య స్కీమ్ లో కట్టిన డబ్బు.. 21 ఏళ్లకు ముందే తీసుకోవచ్చా?
Recommended image2
Snake Village: ఇది పాముల గ్రామం.. ప్రతి ఇంట్లో నాగుపాముకు ఒక చిన్న గది
Recommended image3
Snakes Village : ఈ ఊరంతా పాములే పాములు.. ప్రతి ఇంట్లో నాగుపాముల కోసమే ప్రత్యేక గది..!
Related Stories
Recommended image1
Natural Cooling Foods: ఎండలు మండిపోతున్నాయ్.. బాడీని కూల్‌గా ఉంచే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే !
Recommended image2
Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved