MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాల్ రికార్డింగ్ లు, ఫ్రూఫ్ లు ఉన్నాయి..తప్పు ఒప్పుకో... మంచు విష్ణుపై మండిపడ్డాడు

కాల్ రికార్డింగ్ లు, ఫ్రూఫ్ లు ఉన్నాయి..తప్పు ఒప్పుకో... మంచు విష్ణుపై మండిపడ్డాడు

. యూట్యూబర్స్ ని బ్లాక్ మెయిల్ చేయటం నిజమే అని, ఆ మెయిల్స్ కూడా నిజమే అని, తన దగ్గర అన్ని ఫ్రూఫ్ లు ఉన్నాయని చెప్పారు. 

3 Min read
Author : Surya Prakash
Published : Jul 31 2024, 07:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Manchu Vishnu

Manchu Vishnu

మంచు విష్ణు, యూ ట్యూబర్స్ క్లాష్ ఇంకో టర్న్ తీసుకుంది. యూట్యూబర్ కింగ్ చంద్రహాస్ ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అంటున్నారు. కాల్ రికార్డింగ్ లు, మెయిల్స్ తో సహా అన్నీ ఓపెన్ గా షేర్ చేస్తానని, మంచు విష్ణుపై మండిపడుతూ తాజాగా మరో వీడియో విడుదల చేసారు.

29


సినిమా వాళ్లపై అసభ్యకర వీడియోలు చేస్తూన్న సోషల్ మీడియా యూట్యూబర్స్ పై టాలీవుడ్ హీరో, MAA (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu) ఇటీవలే అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు.  48 గంటల టైం ఇచ్చి అసభ్యకర కంటెంట్ డిలీట్ చేయని పలు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించాడు. దీన్ని చాలా మంది సెలబ్రెటీలు మెచ్చుకుంటున్నారు. అయితే యూట్యూబర్స్ కు ఇది మింగుడుపడని విషయంగా మారింది. తమ జీవన భృతిపై దెబ్బ తీసినట్లుగా వాపోతున్నారు. 
 

39


ఈ క్రమంలో చంద్రహాస్ అనే  ఓ యూట్యూబర్ మంచు విష్ణు చేస్తున్న పనిపై దారుణమైన విమర్శలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. మంచు విష్ణు ఇన్నాళ్లు బ్లాక్ చేయించిన యూట్యూబ్ ఛానల్స్ నటీనటులపై ట్రోల్స్ చేసినవి కాదని.. మంచు ఫ్యామిలీని, కన్నప్ప సినిమాని ట్రోల్ చేసిన ఛానల్స్ అని ఓ యూట్యూబర్ వీడియో చేసాడు. ఆ యూట్యూబర్ మంచు విష్ణుపై దారుణమైన విమర్శలు చేస్తూ.. కన్నప్ప గురించి ట్రోల్స్ వేసినందుకు యూట్యూబ్ ఛానల్స్ ని బ్లాక్ చేసాడు. 
 

49


చెప్పినవి 18 అయినా అనధికారికంగా చాలా ఛానల్స్ బ్లాక్ చేసాడు. ఎవ్వరి ఫ్యామిలీలను మేము ట్రోల్ చెయ్యట్లేదు. నిన్నే ట్రోల్ చేస్తున్నామంటే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. మా అసోసియేషన్ ని ఇలా వాడుకుంటున్నావు అంటూ మాట్లాడాడు. ఛానల్స్ బ్లాక్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కన్నప్ప గురించి పాజిటివ్ గా వీడియోలు చేస్తే ఛానల్స్ పై వేసిన స్ట్రైక్స్ తీయిస్తామని కూడా మెయిల్స్ చేసినట్టు వ్యాఖ్యానించాడు. దీంతో ఈ యూట్యూబర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి మంచు విష్ణుని పలువురు విమర్శించారు.

59


అయితే  ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టగా అక్కడ కూడా వీడియోకి స్ట్రైక్ వేసి తీయించాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మంచు విష్ణు పై విమర్శలు వచ్చాయి. అయితే అందులో ఎంత నిజం ఉందనేది ఆ యూట్యూబ్ ఛానల్స్ కి, మంచు విష్ణు కే తెలియాలి.

69


ఇక  తనలానే చాలామందికి చెందిన యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రైక్స్ వేసి, తొలగించారని.. వాటిని తీయమని చెబుతుంటే రాబోయే 'కన్నప్ప' మూవీ గురించి పాజిటివ్ వీడియో చేయాలని మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఫ్రూప్ కూడా చూపించాడు.

79


దీనిపై ఇప్పుడు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ స్పందించింది. పలువురు యూట్యూబర్స్‌కి మెయిల్స్‌కి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫేక్ మెయిల్స్‌తో తమకు భంగం కలిగిస్తున్నారని, ఈ విషయమై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఓ నోట్ రిలీజ్ చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే మంచు విష్ణుపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.
 

89


 మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుంచి స్పందిస్తూ.. మా సంస్థ నుంచి మెయిల్స్ వచ్చినట్టు కొంతమంది ఫేక్ మెయిల్ ఐడిలతో మా సంస్థపై, కన్నప్ప సినిమాపై నెగిటివ్ ప్రమోషన్ చేస్తున్నారు. దీనిపై సైబర్ కంప్లైంట్ ఇస్తాము. మంచు విష్ణుపై కొంతమంది కావాలని ఇలా అనెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు అని నోటిస్ విడుదల చేసారు.
 

99


ఈ విషయమై కూడా చంద్రహాస్ తాజాగా మరో వీడియో రిలీజ్ చేసారు. యూట్యూబర్స్ ని బ్లాక్ మెయిల్ చేయటం నిజమే అని, ఆ మెయిల్స్ కూడా నిజమే అని, తన దగ్గర అన్ని ఫ్రూఫ్ లు ఉన్నాయని చెప్పారు. మంచు విష్ణు ఇగో వల్లే ఇదంతా వచ్చిందని అన్నారు.  తన దగ్గర ఉన్న కాల్ రికార్డింగ్ లు, నెంబర్స్,  ప్రతీది నా దగ్గర ఉంది.  నేను వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తాను అన్నారు. మీరు నన్ను ఫేక్ అంటున్నారు కాబట్టి నిజమేంటనేది సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తాను అన్నారు. ఆ ట్వీట్ లో మంచు విష్ణుని ట్యాగ్ చేసారు. మీతప్పుని యాక్సెప్టు చేయండని అన్నారు. మరి మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం.. రెమ్యునరేషన్ పెంచిన నాగార్జున? ఎంత వసూలు చేస్తున్నాడంటే?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu:మీనా తల పగలకొట్టిన గుణ, శివలో మార్పు..రూ.30లక్షలు ఇవ్వమని రోహిణీకి దినేష్ బ్లాక్ మెయిల్
Recommended image3
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ ఏడుపు- డాక్టర్ ని కలిసిన జ్యో- చంపేయాలనుకున్న దాసు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved