MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు

Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు

కాలు విరిగినా కూడా షూటింగ్‌లో పాల్గొన్నాడు నాగార్జున. అంతేకాదు హీరోయిన్‌ కి కూడా కాలు ఫ్రాక్చర్‌ అయ్యిందట. ఆ సమయంలో సెట్‌లో నాగ్‌ని చూసి అంతా నవ్వారట. దీంతో నాగార్జునని రియాలిటీ చూపించారట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 29 2026, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నాగార్జున 67వ బర్త్ డే
Image Credit : Asianet News

నాగార్జున 67వ బర్త్ డే

కింగ్‌ నాగార్జున నేడు తన 67వ పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న `కింగ్‌ 100` మూవీ టీజర్‌ని విడుదల చేశారు. దీనికి `కింగ్‌ 100` టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన టీజర్‌ ఆకట్టుకుంటోంది. నాగార్జున ఇందులో బికారీ నుంచి కరోడ్‌పతిగా ఎదుగుతాడు. తాను పడ్డ అవమానాలను, తాను ఎదిగిన తీరుని ఈ మూవీని చూపించబోతున్నట్టు టీజర్‌లో ఆవిష్కరించారు. ఏదేమైనా డబ్బు కంటే పవర్‌ చాలా ముఖ్యమని, ఆ గుర్తింపు చాలా కీలకమని దానికోసమే నిత్యం పరిగెడుతూనే ఉన్నట్టు చూపించారు. అదే సమయంలో ఓ స్కామ్‌ గురించి చూపించబోతున్నట్టు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విక్రమ్‌ మూవీతో హీరోగా పరిచయం అయిన నాగార్జున
Image Credit : Asianet News

విక్రమ్‌ మూవీతో హీరోగా పరిచయం అయిన నాగార్జున

ఇదిలా ఉంటే నాగార్జున బర్త్ డే వేళ ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తన కెరీర్‌ ప్రారంభంలో జరిగిన ఒక సంఘటన బయటకు వచ్చింది. దర్శకుడు గీతాకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. నాగార్జున 1986లో హీరోగా పరిచయం అయ్యారు. `విక్రమ్‌` అనే చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ప్రారంభంలో నాగార్జున నటనకు సంబంధించిన చాలా అవమానాలు ఫేస్‌ చేశారు. నటుడిగా సెట్‌ కాదన్నారు. అప్పట్లోనే ట్రోల్స్ కి గురయ్యాడు. `శివ` వరకు నాగార్జునకి హిట్‌ లేదు.

34
కాలు విరిగినా షూటింగ్‌లో నాగార్జున
Image Credit : stockPhoto

కాలు విరిగినా షూటింగ్‌లో నాగార్జున

కానీ మధ్యలో కొన్ని మంచి సినిమాలు చేశారు. మంచి క్లాసికల్స్ చేశారు. అందులో `గీతాంజలి`, `సంకీర్తన` చిత్రాలున్నాయి. ఇందులో `సంకీర్తన` మంచి క్లాసికల్‌ హిట్‌. మ్యూజిక్‌ పరంగా బాగా ఆకట్టుకుంది. దీనికి దర్శకుడు గీతాకృష్ణ. ఇందులో రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నాగార్జున కాలు ఇరిగిందట. వేరే సినిమా షూటింగ్‌లో ఆయన కాలు విరిగిందట. కాలుకు పట్టి వేసుకొనే `సంకీర్తన` షూటింగ్‌లో పాల్గొన్నాడట. అదే సమయంలో రమ్యకృష్ణకి కూడా గాయమైందట. ఆమె ఓ ఈవెంట్‌లో స్టేజ్‌ నుంచి కింద పడి కాలు విరిగిందట. దీంతో అటు నాగ్‌, ఇటు రమ్యకృష్ణ కాలు గాయాలతోనే `సంకీర్తన` చిత్రీకరణలో పాల్గొనాల్సి వచ్చిందట. గోదావరి వెంట ఇసుకలో నడిచే సమయంలో ఇద్దరూ ఇబ్బంది పడ్డారని, కానీ అది తెలియకుండా తాను షూటింగ్‌ చేసినట్టు చెప్పాడు గీతాకృష్ణ.

44
నాగార్జునకి అవమానం .. రియాలిటీలోకి తీసుకొచ్చిన దర్శకుడు
Image Credit : Asianet News

నాగార్జునకి అవమానం .. రియాలిటీలోకి తీసుకొచ్చిన దర్శకుడు

అయితే ఓ పాట పర్వతం ప్రాంతంలో చిత్రీకరణ జరిపారట. నాగార్జున కాలు మడతగా వేసే సన్నివేశం ఉంది. అందులో ఆయన తూలినట్టు వేశారట. దీంతో సెట్‌లో ఉన్న వారంతా గొళ్లున నవ్వారట. షూటింగ్‌ చూడ్డానికి వచ్చినవారు, సెట్‌లో ఉన్న సిబ్బందితోపాటు అంతా నవ్వారట. ఇలా రెండు మూడు సార్లు జరిగిందట. దీంతో చాలా అవమానంగా ఫీలయ్యారట నాగార్జున. ఆ తర్వాత గోదావరిలో ప్రయాణిస్తున్న సమయంలో నాగార్జున ఇబ్బంది పడ్డాడట. పడవలో సినిమా కార్మికులతో కలిసి నాగార్జున కూడా ఎక్కాల్సి వచ్చిందట. తాను వాళ్లతో కలిసి ఈ చిన్న పడవలో ప్రయాణించడమేంటి? అనుకున్నాడట. కానీ అక్కడే ఒక వ్యక్తి ఉండి, ఎవరితను తెగ ఇబ్బంది పడుతున్నాడని కామెంట్‌ చేశాడట. అంతేకాదు నార్మల్‌ వ్యక్తిగానే ట్రీట్‌ చేశాడట. ఆ తర్వాత పక్కనే ఉన్న కెమెరామెన్‌.. చూశావా అది నీ స్థాయి. నువ్వు ఎవరనేది ఇక్కడ ఎవరికీ తెలియదు, కాబట్టి ఇబ్బంది పడాల్సిన పనిలేదని చెప్పాడట. అప్పటి వరకు తాను పెద్ద స్టార్‌ కొడుకుని అనే ఊహలో ఉన్న నాగార్జునని రియాలిటీలోకి తీసుకొచ్చారట దర్శకుడు గీతాకృష్ణ. తాజాగా ఏసియానెట్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు దర్శకుడు. ప్రస్తుతం ఆయన కామెంట్‌ వైరల్‌ అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Recommended image2
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved