MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: రాజా రాణి ఇంటికి చేరుకున్న యష్, వేద.. యష్ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్న వేద?

Ennenno Janmala Bandham: రాజా రాణి ఇంటికి చేరుకున్న యష్, వేద.. యష్ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్న వేద?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 20 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

2 Min read
Author : Navya G
Published : Dec 20 2022, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్ లో వేద, యష్ కారులో వెళ్తుండగా అప్పుడు యష్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్న పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వేద కోపంతో పగిలిపోతూ ఉంటుంది. అప్పుడు వేద అంటే ఏంటి మీ ఉద్దేశం నేను చెప్పేవన్నీ అబద్ధాలేనా అని అనగా అవును నేను చెప్పేది అదే కదా అందుకే పాట పెట్టాను అని అంటాడు యష్. అయినా మిమ్మల్ని ఎవరు చూస్తే నాకేంటి మీరు ఎవరిని చూస్తే నాకేంటి అని అనగా నాకేంటి నాకేంటి అంటూ నువ్వు ఎంత జలసీగా ఫీల్ అయ్యావో నేను చూశానులే అని అంటాడు యష్. మరి జలసీ కాకపోతే ఇంకేంటి అమ్మాయిలు నన్ను చూస్తే నువ్వు ఎందుకు కోప్పడ్డావు అని అనగా వేద తడబడుతూ ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 తర్వాత వాళ్ళిద్దరూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత యష్ కార్ నడుపుతూ ఉండగా వేద నిద్రపోతూ యష్ భుజంపై తల పెట్టుకుని పడుకుంటుంది. దాంతో యష్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు నిద్రపోతున్న వేద ని అలాగే చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు యష్. ఇప్పుడు వేద నిద్రలేచి ఏంటి ఇక్కడ ఆపారు అని అడగగా నువ్వు నిద్రపోతున్నావు అందుకే కారు ఆపేశాను అని అంటాడు. మనం ఎక్కడిదాకా వచ్చాము అనగా మీ ఊరు వచ్చేసాము అని అంటాడు యష్. ఆ తరువాత మళ్ళీ వాళ్ళు బయలుదేరుతారు.

35

అప్పుడు వేద మనం ఏ పరిస్థితులలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వాళ్లకు తెలియకుండా మనం సంతోషంగా ఉండి వాళ్ళని సంతోషంగా ఉంచుదాం అని అనడంతో సరే అని అంటాడు. తరవాత ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఇల్లు రావడంతో యష్, వేద ఇద్దరు కారు దిగుతారు. అప్పుడు అక్కడ వాళ్ళందరూ బ్యాండ్ మేళాలతో గ్రాండ్గా వెల్కం చెబుతుండడంతో అది చూసి సంతోషపడుతూ ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు వేద వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గరికి పరిగెడుతూ ఉండగా తనకంటే ముందుగా యష్ వెళ్ళి వాళ్ల కాళ్ల మీద పడతాడు.
 

45

అది చూసి వేద ఆశ్చర్య పోతుంది. అప్పుడు యష్ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడంతో నీ గురించి మాకు ఎందుకు తెలియదు బాబు నిన్ను ప్రతిరోజు చూస్తూనే ఉంటాము అని అంటుంది రాణి. అప్పుడు వేద టెన్ రుపీస్ యాక్టింగ్ చేయమంటే 1000 రుపీస్ యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి హారతి ఇచ్చిన తర్వాత వేద యష్ కాళ్లపై నీళ్లు పోస్తుంది. అది చూసి యష్ సంతోష పడుతూ ఉంటాడు. ఆ తర్వాత వేద వాళ్ళు లోపలికి వెళ్తుంటారు. అప్పుడు వాళ్లు వేద,యష్ లను ఒకరి పేరు ఒకరు చెప్పి తర్వాత ఇంట్లోకి అడుగు పెట్టమని చెబుతారు.

55

అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని సిగ్గుపడుతూ లోపలికి కుడికాలు పెట్టి వెళ్తారు. ఆ తర్వాత యష్ వేద అందరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాజా రాణి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ అది చూసి యష్,వేద నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు యష్ తన మాటలతో రాజారాణి ని తన బుట్టలో వేసుకోవడంతో వేద ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత వేద, యష్ ని బెడ్రూంలోకి పిలుచుకొని వెళ్లి ఆ బెడ్ రూమ్ కి చరిత్ర గురించి చెబుతూ ఉంటాడు రాజా. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్లిపోవడంతో వేద ఇద్దరు ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved