- Home
- Entertainment
- Yami Gautam: యామీగౌతమ్ సోషల్ మీడియా పేజ్ హ్యాక్... నోట్ రిలీజ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
Yami Gautam: యామీగౌతమ్ సోషల్ మీడియా పేజ్ హ్యాక్... నోట్ రిలీజ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
ఈ మధ్య సెలబ్రిటీల సోషల్ మీడియా పేజ్ లకు రక్షణ లేకుండా పోతుంది. పోలిటిక్ లీడర్స్ తో పాటు ఫిల్మ్ సెలబ్రిటీల సోషల్ మీడియా పేజ్ లు వరుసగా హ్యాక్ అవుతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ యామీ పేజ్ ను కూడా హ్యాక్ చేశారు.

సోషల్ మీడియాలో హీరోలు,హీరోయిన్లు, ఫిల్మ్ సెలబ్రిటీ, రాజకీయ నాయకులు ఇలా స్టార్స్ అంతా చాలా ఆక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో శేర్ చేసుకుంటారు స్టార్స్. కాని ఈ మధ్య స్టార్స్ సోషల్ మీడియా పేజ్ లు హ్యాక్ అవుతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ సోషల్ మీడియా పేజ్ కూడా హ్యాక్ అయ్యింది.
యామీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. నేరుగా యామీ గౌతమ్ నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. సడెన్ గా యామీ సోషల్ మీడియా ఫేజ్ హ్యాక్ కు గురయ్యాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఇది సాధారణ విషయంగా మారింది.
ప్రస్తుతం యామీ గౌతమ్ పేజ్ హ్యాక్ అయినట్టుగానే గతంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్ల అకౌంట్లను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి డబ్బు వసూలు చేయడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం జరుగుతూనే ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా తమ ఫాలోవర్స్‌ను అప్రమత్తం చేస్తుంటారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ కూడా తన ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను అలర్ట్ చేసింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. దీనిపట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని, తన ఖాతా నుంచి వచ్చిన ఎలాంటి పోస్ట్, ప్రకటనలకు స్పందించవద్దని పేర్కొంది.
ప్రస్తుతం యామీ గౌతయ్ టీం దీనిపైవర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా స్పష్టం చేసింది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న యామీ ప్రస్తుతం దస్వీ మూవీతో బిజీగా ఉంది. అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది.
పెళ్ళి తరువాత కూడా బాలీవుడ్ బిజీబిజీగా ఉంటోంది యామీ. అభిషేక్ మూవీతో పాటు ఆమె ఓ మై గాడ్ సిక్వెల్ లో కూడా యామీ నటిస్తోంది. తన టీమ్ ఈ సమస్యను పరిష్కరించేవరకూ పోస్ట్ లపై స్పందించవద్దంటోంది.