MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: నిజం చెప్పమంటూ భర్తని నిలదీసిన వేద.. అసలు విషయం చెప్పి అందరికీ షాకిచ్చిన విన్ని!

Ennenno Janmala Bandham: నిజం చెప్పమంటూ భర్తని నిలదీసిన వేద.. అసలు విషయం చెప్పి అందరికీ షాకిచ్చిన విన్ని!

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్ తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. పశ్చాత్తాపంతో కూలిపోతున్న ఒక భర్త తనకి తానే శిక్ష వేసుకుంటున్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Apr 26 2023, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎపిసోడ్ ప్రారంభంలో గేమ్ లో విన్ అవుతాడు యష్. మీరు చాలా గ్రేట్ ఇంతకుముందు చాలాసార్లు ఈ గేమ్ పెట్టాము కానీ ఇంత పర్ఫెక్ట్ గా ఎవరూ గేమ్ విన్ అవ్వలేదు దీన్నిబట్టి మీకు మీ భార్య అంటే ఎంత ఇష్టమో అర్థం అవుతుంది అంటుంది స్టాఫ్ మెంబర్. మీ బంధాన్ని గురించి ఒక్కమాటలో చెప్పండి అంటుంది ఆమె. ఆయన నా ఊపిరి, ఆయన లేకపోతే నేనులేను అంటుంది వేద.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 వావ్ గ్రేట్ మీరు కూడా ఏమైనా చెప్పండని యష్ తో  అంటారు అక్కడ ఉన్న వాళ్ళు. యష్ మనసులోనే ఒకప్పుడు యష్ అంటే కోపం, పగ. కానీ వేద వచ్చిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు తనే నా జీవితం అంటూ వేదకి ఐ లవ్ యు చెప్తాడు. ఇప్పుడు వేదకి  ఐ లవ్ యు చెప్పే బంధాన్ని మరింత దగ్గర చేస్తే అది మరింత ఇబ్బంది అవుతుంది అనుకుంటాడు.

37

అంతలోనే అక్కడున్న వాళ్ళందరూ ప్రపోజ్ చేయండి అంటూ గోల పెడతారు. అప్పుడు అక్కడ ఉన్న మాళవిక, యష్, వేదకి ఐ లవ్ యు చెప్పడం ఇంపాజిబుల్ ఎందుకంటే అతని మనసులో నేను ఉన్నాను వాళ్ళిద్దరికీ అసలు రిలేషనే లేదు, తను ఒక అద్దె అమ్మ అంటుంది. రిలేషన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకా అర్హత లేదు. నువ్వు అన్నట్లే నా మనసులో నీ గురించి  ఫీలింగ్స్ ఉన్నాయి.

47

కానీ అది ద్వేషం, అసహ్యం మాత్రమే అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యష్. ఇప్పటికైనా అర్థమైందా అతని మనసులో నీ స్థానం ఏమిటో అంటుంది వేద. కానీ నీకు కూడా ఐ లవ్ యు చెప్పలేదు కదా అంటుంది మాళవిక. బయటికి చెప్పక్కర్లేదు ఆయన మనసులో ఉన్న భావం నాకు తెలుసు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. మరోవైపు డ్రాయింగ్ చేసుకుంటున్న కూతురు దగ్గరికి వచ్చి నేను అమెరికా వెళుతున్నాను అని చెప్తాడు.

57

మమ్మీ చెప్పింది అంటుంది ఖుషి. నేను అమెరికా వెళ్తున్నందుకు బాధపడుతున్నావా అని అడుగుతాడు యష్. నా బాధ నా కోసం కాదు డాడీ నీకోసమే. నువ్వు అమ్మని వదిలి ఉండలేవు రెండు రోజుల్లో మళ్లీ వచ్చేస్తావు. నీకు అమ్మ అంటే ప్రాణం కానీ ఆ విషయం నీకు తెలియడం లేదు అంటుంది ఖుషి. కూతుర్ని దగ్గరకు తీసుకుని నువ్వు చెప్పింది నిజమే మీ అమ్మంటే నాకు చాలా ఇష్టం, తనని వదిలి ఉండలేను అంటాడు యష్. అప్పుడే వచ్చిన వేద ఈ మాటలన్నీ వింటుంది.

67

ఇలాంటి భర్తని, కూతుర్ని ఇచ్చినందుకు దేవునికి థాంక్స్ చెప్పుకుంటుంది. మరోవైపు బట్టలు సర్దుకుంటున్న భర్త దగ్గరికి వచ్చి ఎందుకు ఇన్ని బట్టలు సర్దుకుంటున్నారు, నిజం చెప్పండి నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా అంటూ నిలదీస్తుంది వేద. అలాంటిదేమీ లేదు అని మాట దాటవేస్తాడు యష్. నేను లేకపోతే నీ లైఫ్ ఇంకా బాగుంటుంది అని మనసులో అనుకొని కన్నీరు పెట్టుకుంటాడు. ఇంతలో ఖుషి ఫ్యామిలీ పిక్ తీసుకొని వచ్చి మేము గుర్తొస్తే ఈ ఫోటో చూసుకో అప్పుడు మేము నీ దగ్గరే ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటుంది.
 

77

నేను అమెరికాకి వెళ్లినా నీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. నీకు ఏమైనా అవసరమైతే వసంత్ ని అడుగు, నైట్ టైం ఒక్కదానివే క్లినిక్ కి వెళ్ళకు, నాన్నని గాని వసంత్ ను గాని తోడు తీసుకువెళ్ళు అంటూ భార్యకి జాగ్రత్తలు చెప్తూ కన్నీరు పెట్టుకుంటాడు యష్. తరువాయి భాగంలో ముందుకి వెళ్తూ గుమ్మం తగిలి పడిపోబోతాడు యష్. అతన్ని పడిపోకుండా  పట్టుకుంటుంది వేద. మరోవైపు విన్ని వచ్చి యష్ శాశ్వతంగా అక్కడ ఉండిపోవటానికి వెళ్ళాడు అని చెప్పి అందరికీ షాక్ ఇస్తాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image2
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Recommended image3
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved