MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫైట్‌ సీన్‌ చేసే సమయంలో విజయశాంతికి పీరియడ్స్.. ఆ రాత్రి సమయంలోనూ లేడీ సూపర్‌ స్టార్‌ ఏం చేసిందో తెలుసా?

ఫైట్‌ సీన్‌ చేసే సమయంలో విజయశాంతికి పీరియడ్స్.. ఆ రాత్రి సమయంలోనూ లేడీ సూపర్‌ స్టార్‌ ఏం చేసిందో తెలుసా?

అర్థరాత్రి సినిమా షూటింగ్‌. విలన్లతో ఫైట్‌ సీక్వెన్స్. భారీ కాస్టింగ్ తో సీన్లు. అదే సమయంలో పీరియడ్స్. దీంతో విజయశాంతి ఏం చేసిందో తెలుసా.. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 28 2024, 09:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్‌ తొలి లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి. కమర్షియల్‌ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమై ఆ తర్వాత స్టార్‌ హీరోయిన్ గా ఎదిగింది. తొలి తరం హీరోల నుంచి సెకండ్‌ రేంజ్‌ హీరోలతోనూ జోడీ కట్టింది. అనేక విజయాలు అందుకుంది. హీరోల సినిమాల్లోనూ బలమైన పాత్రలతో మెప్పించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసి ఆకట్టుకుంది. లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగింది.  స్టార్‌ హీరోల సినిమాలతోనే కాదు, కలెక్షన్ల పరంగానూ పోటీ పడింది నిలబడింది. 
 

25

వర్క్ పట్ల చాలా కమిట్‌ మెంట్‌తో ఉండేది విజయశాంతి. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ అనేది ఆమె బ్లడ్‌లోనే ఉంది. వెండితెరపై సినిమాల్లో అయినా, రియల్‌ లైఫ్‌లో అయినా ఆమె ఎక్కువగా అలాంటి పాత్రలే చేసి మెప్పించింది. ఇక లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో చాలా పవర్‌ ఫుల్‌ రోల్స్ చేసింది. పోలీస్‌ ఆఫీసర్‌గా ఆమె అనేక మూవీస్‌ చేసింది. ప్రత్యర్థులను రఫ్ఫాడించింది. విజయశాంతి డైలాగ్‌లు అన్నా, ఆమె యాక్షన్‌ అన్నా కోట్లాది మంది ఇష్టపడతారు. ఎంజాయ్‌ చేస్తారు. 
 

35

అయితే హీరోలు యాక్షన్‌ చేయడం వేరు. అది కామన్‌గానే ఉంటుంది. పెద్ద రిస్క్ ఉండదు. కానీ హీరోయిన్లు యాక్షన్‌ అంటే చాలా పెద్ద రిస్క్. వారికి చాలా సమస్యలుంటాయి. హీరోల(మగవారిలా) హీరోయిన్లు ఫైట్స్ చేయడం అంటే చాలా సవాళ్లతో కూడుకున్న విషయం కూడా. అలాంటి సవాళ్లని ఎన్నింటినో ఫేస్‌ చేసింది విజయశాంతి. వాటిని అంతే ధీటుగా ఎదుర్కొంది. సినిమా కోసం తట్టుకుని నిలబడింది. 
 

45

ఆ సమయంలో ఆ విషయం గమనించిన కస్తూరి విజయశాంతిని అడిగారట. ఈ సీన్లు రెండు మూడు రోజుల తర్వాత, మీ హెల్త్ అంతా సెట్ అయ్యాక చేసుకోవచ్చుగా, ఎందుకు ఇంత రిస్క్ అని అడిగిందట. అందుకు విజయశాంతి రియాక్ట్ అవుతూ, నో నో మిగిలిన పెద్ద కాస్టింగ్‌ అంతా ఉన్నారు కదా, వాళ్ల డేట్స్ ఇష్యూ అవుతుందని చెప్పిందట. నోప్పిని తగ్గించడం కోసం టాబ్లెట్‌ వేసుకుని షూటింగ్‌లో పాల్గొన్న విజయశాంతిని తాను చూశానని తెలిపింది కస్తూరి. ఆ మూవీకి తనే నిర్మాత అని తెలిపింది. 
 

55

విజయశాంతిలోని డెడికేషన్‌ లెవల్‌ని, కమిట్‌మెంట్‌ని వివరించింది కస్తూరి. ఇక విజయశాంతి నిర్మాతగా `నిప్పురవ్వ`, `ఆశయం`, `తేజస్విని`, `తడయం`, `అడవి చుక్క` వంటి సినిమాలు నిర్మించింది విజయశాంతి. ఇక ఆమె 17ఏళ్ల క్రితమే సినిమాలకు దూరమైంది. చాలా గ్యాప్‌తో ఇటీవల `సరిలేరు నీకెవ్వరు`లో మెరిసింది. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌ కొత్త సినిమాలో కనిపించబోతుందట విజయశాంతి. మరోవైపు రాజకీయాల్లోనూ ఆమె యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవికి ఎక్కువ డైలాగ్స్ లేకున్నా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? మెగాస్టార్ కెరీర్ మార్చేసిన మూవీ?
Recommended image2
Top 5 Female Villains: గ్లామర్‌తో కాదు, క్రూరత్వంతో అదరగొట్టారు.. విలన్లుగా మారిన బెస్ట్ టాప్‌ 5 హీరోయిన్లు వీరే
Recommended image3
Naga Chaitanya : భార్య శోభిత తో కలిసి తీర్థయాత్రలు చేస్తోన్న నాగచైతన్య, పూరీ జగన్నాథుడి సన్నిథిలో స్టార్ కపుల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved