MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: ప్రేమలో మునిగి తేలుతున్న యష్, వేద.. మాళవికకు బుద్ధి చెప్పిన వేద?

Ennenno Janmala Bandham: ప్రేమలో మునిగి తేలుతున్న యష్, వేద.. మాళవికకు బుద్ధి చెప్పిన వేద?

 Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 28 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

3 Min read
Author : Navya G
Published : Dec 28 2022, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ లో వేద గిల్లడంతో యష్ గిచ్చుతోంది అని అనగా ఏంటమ్మా అని రాజా అనగా లేదు తాతయ్య గోరు తగిలింది అని అంటుంది వేద. అప్పుడు రాణి కాస్త నాజూగ్గా వీపు రుద్దు అనడంతో అప్పుడు యష్ చెయ్ తీసుకొని ఇలా నాజుగ్గా రుద్దు వేద అని అంటాడు. అప్పుడు వేద స్నానం చేయిస్తూ ఉండగా యష్ అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు వారిద్దరూ ఒకవైపు ఒకరు చూసుకుంటూ ఆనంద పడుతూ ఉండగా అప్పుడు తాతయ్య చెక్కలిగింతలు పెడుతోంది అనడంతో అలాగే ఉంటుందిలే మనవడా ఎంజాయ్ చెయ్ అని అంటాడు. అప్పుడు కుంకుడుకాయ పూసి శనగ పిండితో స్నానం చేయిస్తూ ఉంటుంది వేద.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అప్పుడు కోయిల కోయడంతో వెంటనే యష్ కూడా కోయిల మాదిరి అరుస్తూ ఉండగా  అప్పుడు ఆ కోయిల కూడా అరుస్తూ ఉంటుంది. మరి కోయిల నాకు ఫ్రెండ్ అయింది మళ్ళీ ఈ వేద నాకు ఎప్పుడు ఫ్రెండ్ అవుతుంది అనడంతో ఆశ దోశ అవన్నీ కుదరవు అని అంటుంది వేద. మరొకవైపు ఖుషి కోసం మాలిని,వేద,చిత్ర ముగ్గురు రకరకాల ఐటమ్స్ తీసుకుని వచ్చి తిందువురా అని పిలవడంతో ఎటు వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది ఖుషి. నేను మూడ్ ఆఫ్ లో ఉన్నాను నాకు కోపం తెప్పించారంటే జాగ్రత్త అని అంటుంది. మరొకవైపు గదిలోకి వెళ్లిన యష్ వేద వేద అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు.
 

38

ఇక్కడికి వస్తానని చెప్పింది కదా మిసెస్ న్యూసెన్స్ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వేద టవల్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా అలా వెళ్ళిపోతావేంటి వచ్చి తలతుడు అని అంటాడు. అప్పుడు అవన్నీ కుదరవు వెళ్లి నీ పని చూసుకోవడంతో యష్ కావాలని రాజారాణిని పిలుస్తాడు. అప్పుడు వేద ఎందుకు వాళ్ళని పిలుస్తున్నారు వద్దు ప్లీజ్ అంటుండగా వాళ్ళని పిలవాలి నువ్వు సైలెంట్ గా ఉండు అని అంటారు యష్. ఇప్పుడు రాణి ముందర వేదని అడ్డంగా ఇరికిస్తాడు యష్. అప్పుడు వేద చేసేది ఏమీ లేక సరే అని అంటుంది.
 

48

అప్పుడు వేద తల తుడుస్తూ ఉంటుంది. మరొకవైపు మాళవిక ఏంటి ఈ వేద, యష్ ఇద్దరు కలిసి ఊరికి వెళ్లారా ఎందుకు వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ కొంపదీసి హనీమూన్ ట్రిప్ కాదు కదా అనుకుంటూ వాళ్లకు ఫోన్ చేయాలి అనుకుంటుంది. మరొకవైపు వేద ప్రేమతో యష్ కి తల తుడుస్తూ ఉంటుంది. అప్పుడు యష్ వేద వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మరొకవైపు మాళవిక యష్ కి ఫోన్ చేస్తుంది. యష్ వేద మాత్రం ఆ ఫోన్ ని పట్టించుకోకుండా ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. మాళవిక పదేపదే ఫోన్ చేస్తూనే ఉంటుంది.
 

58

నా ఫోను ఆ యశోదర్ లిఫ్ట్ చేయడా ఎంత పొగరు ఆ వేద పక్కన ఉండి ఉంటుంది ఫస్ట్ దాని అంతు చూడాలి అని ముందుకు వెళ్తారా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మాళవిక ఫోన్ చేయడంతో యష్ అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. అప్పుడు వేద ఫోన్ లిఫ్ట్ చేయడంతో వెంటనే మాళవిక ఏమైంది నీకు ఎందుకు ఫోన్ ఎత్తవు అని అనడంతో మాట్లాడవేంటి అనడంతో ఇక్కడ వేదశ్విని మాట్లాడుతోంది అని అంటుంది. నువ్వు ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి అనడంతో నా భర్త ఫోను నేను కాకపోతే ఇంకెవరు లిఫ్ట్ చేస్తారు అని అంటుంది వేద.
 

68

చూడు మాళవిక మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ఎందుకు  భర్తని కాదనుకున్నావు వెళ్లిపోయావు. నీ మానాన నువ్వు బతుకుతూ ఆయన్ని బతకనివ్వొచ్చు కదా అనగా ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవరూ అనడంతో ఎన్నిసార్లు చెప్పాలి నీకు డాక్టర్ వేదస్విని వైఫ్ ఆఫ్ మిస్టర్ యశోదర్ అని అంటుంది. ఆయనను మామూలుగా టెన్షన్ పెట్టావా అవన్నీ వద్దనుకుని కొద్ది రోజులు ఆనందంగా గడపడానికి వస్తే ఇప్పుడు కూడా ఫోన్ చేసి విసిగిస్తున్నావు అంటూ ఒక రేంజ్ లో విరుచుకుపడుతుంది వేద. వేద దెబ్బకు మాళవిక మౌనంగా ఉంటుంది.

78

ఇంకొకసారి ఫోన్ చేయకు అనడంతో చేస్తాను మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తాను నిన్ను ఆ  యష్ ని మనశ్శాంతి లేకుండా చేస్తాను అని అంటుంది. అప్పుడు మాళవిక నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో నోరు ముయ్యి నేనంటే ఎవరనుకుంటున్నావు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. ఐ యాం డాక్టర్ వేదశ్విని, యష్ కి భార్య కాకముందు కూడా నాకు సమాజంలో డాక్టర్ గా మంచి గౌరవం ఉంది ఆ విషయం తెలుసా. మరి నీకేముంది భర్తని కాదనుకొని వెళ్లిపోయావు ఆ అభి దగ్గర ఉన్నావు అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటో కూడా తెలియదు నువ్వు వాడుతున్న ఫోను కట్టుకునే బట్టలు ప్రతి ఒక్కటి నీవి కావు నువ్వు ఉంటున్న ఇండ్లు కూడా నీది కాదు అంటూ మాళవిక తగిన విధంగా బుద్ధి చెబుతుంది వేద.
 

88

 అప్పుడు మాళవిక మాట్లాడాలి అని చూడడంతో ఇప్పుడు నేను మా ఆయన బండిమీద షికారుకు వెళ్తున్నాము మాట్లాడడానికి టైం లేదు మళ్లీ ఫోన్ చెయ్ నీతో తీరిగ్గా మాట్లాడుతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వేద. అప్పుడు ఫోన్ కట్ చేసిన తర్వాత మాళవిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు వేద ఏంటి ఈ మాళవిక తన జీవితం నాశనం చేసుకొని కూడా ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Recommended image3
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved