- Home
- Entertainment
- Pawan Kalyan: పవన్ వల్లే ఉదయ్ కిరణ్ ఫోటోలు లీక్.. సుస్మిత ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ వెనుక జరిగింది ఇదే
Pawan Kalyan: పవన్ వల్లే ఉదయ్ కిరణ్ ఫోటోలు లీక్.. సుస్మిత ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ వెనుక జరిగింది ఇదే
ఉదయ్ కిరణ్, సుస్మిత ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అయితే దీనికి కారణం పవన్ కళ్యాణ్ అట. ఆయన చేసిన నిరసన వల్లే డీసీ వాళ్లు ఉదయ్ కిరణ్ ఫోటోలు లీక్ చేశారట.

ఓజీతో కమ్ బ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించిన దాదాపు పదేళ్ల తర్వాత ఆయన సక్సెస్ అయ్యారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించారు. డిప్యూటీ సీఎంగా ఆయన ప్రజలు మెచ్చే నాయకుడిగా రాణిస్తున్నారు. అదే సమయంలో చాలా రోజుల తర్వాత ఆయన సినిమాల్లోనూ సక్సెస్ అందుకున్నారు. `ఓజీ`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కానీ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నారు పవన్.
సుస్మిత, ఉదయ్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ కి కారణం పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమాకి రెడీ అవుతున్నారు. ఆయన `ఓజీ 2` చేయబోతున్నారు. ఆ మధ్యనే ఈ మూవీని ప్రకటించారు. ఎప్పుడుంటుందనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో పవన్‌కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్, షాకింగ్ సంఘటన బయటకు వచ్చింది. ఉదయ్ కిరణ్, చిరంజీవి కూతురు సుస్మిత ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ విషయానికి సంబంధించిన షాకిచ్చే సంఘటన రివీల్ చేశారు దర్శకుడు గీతా కృష్ణ.
ఉదయ్ కిరణ్, సుస్మిత కొంప ముంచిన డీసీ
వరుస హిట్లతో ఉన్న ఉదయ్ కిరణ్ కి సుస్మితని ఇచ్చి పెళ్లి చేయాలని చిరంజీవి భావించారు. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేశారు. అయితే ఆ సమయంలో ఏదో గొడవ విషయంలో పవన్ కళ్యాణ్ రోడ్డుమీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నాడు. ఆ నిరసనలో భాగంగా డీసీ(డెక్కన్ క్రానికల్) రిపోర్టర్‌తో దురుసుగా వ్యవహరించారట. దీంతో వాళ్లు పవన్ కళ్యాణ్‌పై కోపంతో ఉదయ్ కిరణ్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు విడుదల చేశారట. సుస్మితతో ఎంగేజ్‌మెంట్‌కి ముందే ఉదయ్ కిరణ్‌కి మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయినట్టుగా ఆ ఫోటోలు ఉన్నాయట. ఆ ఫోటోలు చూసి చిరంజీవితోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం అగ్గిమీద గుగ్గిలం అయ్యారట. ఉదయ్ కిరణ్‌ని కొట్టేంత పని చేశారట. కానీ చిరంజీవి పెద్ద స్టార్ కావడంతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఉదయ్‌ని వదిలేశారట. ఆ సమయంలోనే ఉదయ్ కిరణ్, సుస్మిత ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారని తెలిపారు గీతా కృష్ణ.
పడిపోతున్న పవన్ గ్రాఫ్
ఉదయ్ కిరణ్ అనుకున్నంత అమాయకుడేం కాదని వెల్లడించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆవేశం కొంప ముంచిందని తెలిపారు. ఉదయ్ కిరణ్, సుస్మిత ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్‌కి పరోక్షంగా పవనే కారణమని అన్నారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చే ముందు చెగువేరా నినాదం ఎత్తుకున్నారని, కానీ ఇప్పుడు హిందుత్వం అంటున్నాడని, అధికారం కోసం రూట్ మార్చే వ్యక్తి అని చెప్పారు. అయితే కాపుల నినాదం ఎత్తుకొని గెలిచిన ఆయన ఇప్పుడు ఆ కాపులకే ద్రోహం చేస్తున్నారని, దీంతో క్రమంలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పడిపోతుందన్నారు.

