MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు

Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు

Raviteja Remuneration: రవితేజ హీరోగా నటించిన `ఇరుముడి` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఈ మూవీకి రవితేజ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే మతిపోవాల్సిందే. కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కావడం విశేషం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 01 2026, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇరుముడితో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న రవితేజ
Image Credit : Asianet News

ఇరుముడితో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `ఇరుముడి` మూవీతో విజయాన్ని అందుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు విజయం దక్కింది. ఆల్మోస్ట్ `ధమాఖా` తర్వాత రవితేజ హిట్‌ అందుకున్నాడని చెప్పొచ్చు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన `ఇరుముడి` మూవీ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. రెండో వారంలో కూడా దీనికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. వీక్‌ డేస్‌లోనూ డీసెంట్‌ కలెక్షన్లు వస్తున్నాయి. `టాక్సిక్` ప్రభావం ఉన్నా కూడా రవితేజ బాక్సాఫీసు వద్ద సత్తా చాటడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇరుముడి కలెక్షన్లు
Image Credit : Asianet News

ఇరుముడి కలెక్షన్లు

ఇక `ఇరుముడి` మూవీ సోమవారం రూ.6.60కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.179.10కోట్లు రావడం విశేషం. ఇది రెండు వందల కోట్ల దిశగా వెళ్తుంది. అంటే ఈ సినిమా ద్వారా సుమారు రూ.90కోట్ల షేర్‌ వచ్చింది. మూవీకి అయిన బడ్జెట్‌ రూ.40కోట్లు అయితే, థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.20కోట్లు మాత్రమే. దీంతో ఈ మూవీ ద్వారా మేకర్స్ సుమారు రూ.70కోట్ల లాభాలను సాధించారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో లాభాలు పొందిన సినిమా ఇదే కావడం విశేషం. చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ తర్వాత `ఇరుముడి` అత్యధిక లాభాలు పొందిన సినిమాగా నిలవడం విశేషం.

34
ఇరుముడికి రవితేజ పారితోషికం
Image Credit : Asianet News

ఇరుముడికి రవితేజ పారితోషికం

అయితే `ఇరుముడి` మూవీకి రవితేజ తీసుకున్న పారితోషికం ఎంతనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి రవితేజ తీసుకున్న పారితోషికం కేవలం రూ.8కోట్లు అని సమాచారం. సినిమా విడుదలకు ముందు ఒప్పుకున్న పారితోషికం ఇది. అయితే ఆయనకు పారితోషికం కింద నైజాం రైట్స్ ని ఇచ్చారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లని రాబట్టింది. నైజాంలో అదిరిపోయేలా కలెక్షన్లని రాబట్టింది. ఈ లెక్కన చూస్తే రవితేజకి ఓవరాల్‌గా రూ.50-60కోట్లు అందుకున్నారు. అంటే ఈ మూవీకి ఆయన పారితోషికం రూ.60కోట్లు అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

44
ఇరుముడి టీమ్‌ పారితోషికాలు
Image Credit : Asianet News

ఇరుముడి టీమ్‌ పారితోషికాలు

ఇరుముడి మూవీలో నటించిన ఇతర కాస్టింగ్‌ పారితోషికాల వివరాలు చూస్తే, ఇందులో హీరోయిన్‌గా నటించిన ప్రియా భవానీ శంకర్‌కి కోటిన్నర రెమ్యూనరేషన్‌ ఇచ్చారట సాయికుమార్‌కి రూ.70లక్షల, అజయ్‌ ఘోష్‌కి రూ.55 లక్షలు, బేబీ నక్షత్రకి రూ.10లక్షలు ఇచ్చారని సమాచారం. మొత్తంగా రవితేజ ఈ సినిమా ద్వారా కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్నారని చెప్పొచ్చు. చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీకి తీసుకున్న పారితోషికం కంటే రవితేజ రెమ్యూనరేషన్‌ ఎక్కువ కావడం విశేషం. ఆ మూవీకి చిరు దాదాపు రూ. 50కోట్ల వరకు అందుకున్నారని సమాచారం. అంటే కూతురు కోసం తగ్గించి తీసుకున్నారట.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image2
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved