MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌

Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌

Reshma Rathore: సినిమా గ్లామర్, స్టార్‌డమ్ వదులుకోవడం ఎవరికైనా కష్టమే. కానీ, ఓ హీరోయిన్ మాత్రం నటనకు గుడ్‌బై చెప్పి, ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి రెడీ అయ్యింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 01 2026, 08:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పిన టాలీవుడ్‌ హీరోయిన్‌
Image Credit : Asianet News

యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పిన టాలీవుడ్‌ హీరోయిన్‌

సినిమా రంగంలో గ్లామర్, పేరుప్రఖ్యాతలు ఉంటాయి. కెమెరా ముందుకొచ్చి చప్పట్లు కొట్టించుకున్న వాళ్లు ఆ ప్రపంచాన్ని వదిలి వెళ్లడం చాలా కష్టం. అవకాశాలు ఉన్నా, లేకపోయినా వదల్లేరు. అలాంటి పరిస్థితి వస్తే అది ఎంతో స్ట్రగుల్‌తో కూడుకొన్నదే అవుతుంది. కానీ, తెలుగు అందం రేష్మా రాథోర్‌ మాత్రం 'గ్లామర్ అనేది క్షణికం, న్యాయం కోసం పోరాడటమే అసలైన జీవితం' అని నిరూపిస్తున్నారు రేష్మ. ఆమె యాక్టింగ్‌కి గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కేందుకు రెడీ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఈ రోజుల్లో మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన రేష్మా రాథోర్‌
Image Credit : Instagram

ఈ రోజుల్లో మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన రేష్మా రాథోర్‌

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రేష్మాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఎక్కువ. బాలనటిగా కెమెరా ముందుకొచ్చిన ఆమె, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో చదువుతుండగా దర్శకుడు మారుతి కంటపడ్డారు. ఆయన తీసిన యూత్‌ఫుల్ హిట్ 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి.

37
వెంకటేష్‌, ఉదయ్‌ కిరణ్‌ సినిమాల్లో రేష్మ
Image Credit : Instagram

వెంకటేష్‌, ఉదయ్‌ కిరణ్‌ సినిమాల్లో రేష్మ

విక్టరీ వెంకటేష్ 'బాడీగార్డ్' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా, దివంగత నటుడు ఉదయ్ కిరణ్‌తో కలిసి 'జై శ్రీరామ్' సినిమాలోనూ రేష్మా నటించి మెప్పించారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లోనూ ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
47
నటిగా సక్సెస్ కాకపోవడంతో లా వైపు రేష్మ చూపులు
Image Credit : Instagram

నటిగా సక్సెస్ కాకపోవడంతో లా వైపు రేష్మ చూపులు

2017 వరకు చాలా సినిమాల్లో నటించినా, రేష్మాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కలేదు. దీంతో ఆమెకు సినీ రంగంలోని అనిశ్చితి అర్థమైంది. అప్పుడే ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తన తల్లి రాధాబాయి రాథోడ్ (హైకోర్టు లాయర్) బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. మేకప్ కిట్ పక్కనపెట్టి, న్యాయశాస్త్ర పుస్తకాలు చేతపట్టారు.
57
సుప్రీంకోర్ట్ లాయర్‌గా మారిన రేష్మా రాథోర్‌
Image Credit : Instagram

సుప్రీంకోర్ట్ లాయర్‌గా మారిన రేష్మా రాథోర్‌

సినిమా డైలాగుల కన్నా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఆమెకు బాగా నచ్చాయి. న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి, లాయర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తన తెలివితేటలు, వాదనా పటిమతో అనతికాలంలోనే దిల్లీలోని సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే స్థాయికి ఎదిగారు. ఒకప్పుడు సెట్స్‌లో లైట్ల మధ్య ఉన్న అమ్మాయి, ఇప్పుడు కోర్టులో న్యాయం కోసం వాదిస్తుండటం విశేషం.
67
రాజకీయాలపై రేష్మాకి ఇంట్రెస్ట్
Image Credit : Instagram

రాజకీయాలపై రేష్మాకి ఇంట్రెస్ట్

రేష్మా కేవలం కోర్టులకే పరిమితం కాలేదు. ఆమెకు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది. అంతేకాకుండా, సామాజిక సేవలోనూ చురుకుగా పాల్గొంటున్నారు. నటిగా ప్రజలను అలరించిన రేష్మా, ఇప్పుడు లాయర్‌గా వారి హక్కుల కోసం పోరాడుతున్నారు.
77
రేష్మ సక్సెస్‌ స్టోరీ
Image Credit : Instagram

రేష్మ సక్సెస్‌ స్టోరీ

'సినిమా ప్రపంచం నుంచి సుప్రీంకోర్టు వరకు' రేష్మా ప్రయాణం కేవలం ఒక మార్పు కాదు, అది ఒక దృఢ సంకల్పం సాధించిన విజయం. సాధించాలనే పట్టుదల ఉంటే గ్లామర్ ప్రపంచం నుంచి న్యాయ ప్రపంచం వరకు ఎక్కడైనా గెలవచ్చని ఆమె నిరూపించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image2
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved