MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?

Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?

బలగం నటి కావ్య కళ్యాణ్‌రామ్ కీరవాణి తనయుడు, సింగర్ కాలభైరవతో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కావ్య కళ్యాణ్ రామ్ షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 31 2026, 07:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kavya Kalyanram
Image Credit : Asianet News

Kavya Kalyanram

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ జంట తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. బలగం సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువైన నటి కావ్య కళ్యాణ్‌రామ్, ప్రముఖ సంగీత దర్శకుడు కాలభైరవతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. కాలభైరవ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు అనే విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కావ్య కళ్యాణ్‌రామ్, కాలభైరవ మధ్య రిలేషన్‌షిప్ ఉందంటూ ప్రచారం జరుగుతుండగా, తాజాగా కావ్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఆ ఊహాగానాలకు ముగింపు పలికారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైరల్ ఫోటోలు
Image Credit : Asianet News

వైరల్ ఫోటోలు

కాలభైరవతో కలిసి ఉన్న పలు ఫొటోలను కావ్య కళ్యాణ్‌రామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలతో పాటు ఆమె రాసిన భావోద్వేగ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిని కనుగొన్నానని పేర్కొంటూ కావ్య తన ప్రేమను బహిరంగంగా వెల్లడించారు. కొంతమంది మన జీవితంలోకి వచ్చి మనం దేవుడికి అత్యంత ఇష్టమైన పిల్లలమనే భావన కలిగిస్తారని ఆమె పేర్కొన్నారు. సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ప్రేమను చూసే దృష్టిలో ఉండే ఆ ప్రత్యేకత అంత చెడ్డది కాదని కూడా తన సందేశంలో తెలిపారు.

35
కాలభైరవపై కావ్య ప్రేమ
Image Credit : Asianet News

కాలభైరవపై కావ్య ప్రేమ

కాలభైరవ తన సాధారణ రోజులను కూడా ప్రత్యేకంగా మార్చారని కావ్య పేర్కొన్నారు. తన జీవితంలో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చి, తనను అదృష్టవంతురాలిగా భావించేలా చేశారని ఆమె తన పోస్టులో వెల్లడించారు. ఇక ముందు కూడా ఇలాంటి ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండాలని కోరుకుంటూ కాలభైరవపై తన ప్రేమను వ్యక్తం చేశారు. తాను వద్దని చెప్పిన తర్వాత కూడా డైట్ కోక్ కావాలని కోరుకుంటాననే విషయం నీకు తెలిసేలా మరెన్నో సంవత్సరాలు గడవాలని అంటూ సరదాగా కూడా కావ్య తన పోస్టులో పేర్కొన్నారు.

45
తమ్ముడి సినిమాలో హీరోయిన్ గా
Image Credit : Asianet News

తమ్ముడి సినిమాలో హీరోయిన్ గా

కావ్య కళ్యాణ్‌రామ్ చేసిన ఈ పోస్టు తర్వాత సన్నిహితులు, సినీ రంగానికి చెందిన సహచరులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి ఉన్నారనే ప్రచారం సాగుతున్నప్పటికీ, దీనిపై ఇద్దరి నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు కావ్య స్వయంగా కాలభైరవతో ఉన్న ఫొటోలను పంచుకుని తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించడంతో ఈ ప్రచారానికి అధికారికంగా తెరపడినట్లయింది. కాల భైరవ తమ్ముడు శ్రీసింహ నటించిన ఉస్తాద్ చిత్రంలో కావ్య హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాకు కాల భైరవ పాటలు పాడారు. అప్పటి నుంచే కావ్య, కాల భైరవ మధ్య ప్రేమ మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.

View this post on Instagram

A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

55
వివాహం ఎప్పుడు ?
Image Credit : Asianet News

వివాహం ఎప్పుడు ?

కావ్య కళ్యాణ్‌రామ్, కాలభైరవ తమ ప్రేమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించడంతో ఇప్పుడు వీరి తదుపరి అడుగులపై కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వీరిద్దరూ వివాహం గురించి ఎప్పుడు ప్రకటిస్తారు, భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటనే అంశాలపై సినీ అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం వీరిద్దరి రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించడం మినహా వివాహానికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో పెళ్లిపై కావ్య, కాలభైరవ ఎప్పుడు ప్రకటన చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image2
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved