- Home
- Entertainment
- టైటిల్స్ ప్లీజ్...ఇంకెప్పుడు చెపుతారు, ప్రభాస్, మెగాస్టార్, బాలయ్య, చరణ్, తారక్ ఫ్యాన్స్ వెయిటింగ్
టైటిల్స్ ప్లీజ్...ఇంకెప్పుడు చెపుతారు, ప్రభాస్, మెగాస్టార్, బాలయ్య, చరణ్, తారక్ ఫ్యాన్స్ వెయిటింగ్
ఉగాది కూడా వచ్చి వెళ్లిపోయింది. పండగకోసం ఎదురు చూసే సినిమావాళ్ల నుంచి ఈసారి పెద్దగా అప్ డేట్స్ కనిపించలేదు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పై చాలా ఉన్నాయి. కొన్ని సెట్స్ ఎక్కడానికి రెడీగా ఉన్నాయి. సినిమాలు అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది కాని టైటిల్స్ మాత్రం ఇప్పటి వరకూ అనౌన్స్ చేసింది లేదు.

ప్రభాస్,ఎన్టీఆర్,మెగాస్టార్,మెగా పవర్ స్టార్, బాలయ్య, తారక్ ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ సెట్స్ మీద ఉన్నాయి. అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది కాని ఇప్పటి వరకూ టైటిల్స్ అనౌన్స్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. మేకర్స్ పై గుర్రుగా ఉన్నారు. ఇప్పటి వరకూ టైటిల్స్ అనౌన్స్ చేయని టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలపై ఓ లుక్కేద్దాం.
టాలీవుడ్ నుంచి యూనివర్సల్ రేంజ్ కు ఎదిగాడు ప్రభాస్.. ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు నాలుగు సెట్స్ మీద ఉన్నాయి మరో రెండు ప్రపోజల్స్ లో ఉన్నాయి. అందులో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ప్రభాస్ మూవీ. బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్న ఈసినిమా రెండేళ్ళ క్రితమే అనౌన్స్ చేసినా.. టైటిల్ విషయంలో మాత్రం సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ అనౌన్స్ చేసిన సందీప్ రెడ్డి మూవీకి స్పిరిట్ టైటిల్ ఇచ్చేశారు కాని ఎప్పుడో రెండేళ్ళ క్రితం అనౌన్స్ చేసిన నాగ్ అశ్వీన్ మాత్రం ఇంత వరకూ టైటిల్ చెప్పలేదు.
టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ మాత్రమే మంచి ఊపు మీద ఉన్నారు. ఇప్పటికే ఆయన ఖాతాలో ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో సెట్స్ మీద ఉన్న సినిమాలలో ఆచార్య,బోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమాల టైటిల్స్ ఎప్పుడో ఇచ్చేశాడు చిరు. కాని బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు మాత్రం టైటిల్ ఇంత వరకూ అనౌన్స్ చేయలేదు. మాస్ కంటెంట్ తో రూపొందుతున్న ఈసినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇక రీసెంట్ గా అనౌన్స్ చేసిన వెంకీ కుడుముల మూవీకి కూడా మెగా టైటిల్ రావాల్సి ఉంది.
మాస్ హీరోలలో బాలయ్యకు తిరుగులేదు. బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్ కు పూనకాలే.. ముఖ్యంగా బాలయ్య సినిమా టైటిల్ అంటే.. అది ఎంతో పవర్ ఫుల్ గా ఉండాలని కోరకుంటారు. రీసెంట్ గా అఖండ సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలకృష్ణ. ఇక నెక్ట్స్ మూవీ విషయంలో కూడా ఫ్యాన్స్ ఇదే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు బాలయ్య. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చాలా పవర్ ఫుల్ స్టోరీతో పవర్ ఫుల్ సినిమాను చేస్తున్నాడు బాలయ్య. అందుకే పవర్ ఫుల్ టైటిల్ కోసం చూస్తున్నారు. ప్రస్తుతానికి ఈమూవీకి వేటపాలెం అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
కరోనా వల్ల గ్యాప్ రావడంతో దాదాపు రెండేళ్లు యంగ్ స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇబ్బందులు తప్పలేదు. అందులో తారక్, చరణ్ ట్రిపుల్ ఆర్ కూడా ఉంది. ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో నెక్ట్స్ వారి సినిమాలపై దృష్టి పెట్టారు యంగ్ స్టార్స్. చరణ్ శంకర్ తో సినిమా ఆల్ రెడీ సెట్స్ మీద ఉంది. ఎన్టీఆర్ మాత్రం కొరటాలతొ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.
ట్రిపుల్ ఆర్ లేట్ అవుతుండటంతో చరణ్ ముందే శంకర్ తో పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేసేశాడు. ఈ మూవీ ముచ్చటగా మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నా.. ఇంత వరకూ టైటిల్ అనౌన్స్ చేయలేదు. సర్కారోడు టైటిల్ మాత్రం ప్రచారంలో ఉంది.
అటు ఎన్టీఆర్ కూడా త్వరలో కొరటాల సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంద. అనుకుంటు ఇప్పటికి టైటిల్ అనైన్స్చేయడం పెద్ద విషయం కాదు. కాని ఇప్పటి వరకూ టైటిల్ అనౌన్స్ చేయలేదు మేకర్స్. వీరి కాంబోలో జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈసినిమా టైప్ లోనే మంచి కథతో పాటు టైటిల్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
వీటితో పాటు మరికొంత మంది స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సర్కారువారి పాట సినిమా దాదాపు కంప్లీట్ చేశాడు మహేష్ బబు. నెక్ట్స్ త్రివిక్రమ్ తోసినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ మూవీ కూడా అనౌన్స్ చేసి చాలాకాలం అవుతుంది కాని ఇప్పటి వరకూ టైటిల్ చెప్పలేదు త్రివిక్రమ్. ఇలా మరికొంత మంది యంగ్ హీరోలు, సీనియర్ హీరోల సినిమాలకు టైటిల్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.