MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మంచు ఫ్యామిలీలో కోల్డ్ వార్ అన్నదమ్ముల మధ్య పెరిగిన దూరం... విబేధాలకు అదే కారణం?

మంచు ఫ్యామిలీలో కోల్డ్ వార్ అన్నదమ్ముల మధ్య పెరిగిన దూరం... విబేధాలకు అదే కారణం?

మంచు ఫ్యామిలీలో విబేధాలు తలెత్తాయంటూ ఒక కథనం చక్కర్లు కొడుతుంది. మోహన్ బాబు ఇద్దరు కుమారులు మంచు విష్ణు-మనోజ్ మధ్య దూరం పెరిగిందనేది తాజా వార్తల సారాంశం.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 04 2022, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Manchu Vishnu Manoj

Manchu Vishnu-Manoj

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో మోహన్ బాబు ఒకరు. తన విలక్షణ నటనతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారి కలెక్షన్ కింగ్ అయ్యారు. 90లలో మోహన్ బాబు నటించిన బాక్సాఫీస్ కొల్లగొట్టాయి. ఒక ప్రక్క హీరోగా హిట్స్ ఇస్తూనే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిత్రాల్లో మోహన్ బాబు విలన్ రోల్స్ చేయడం విశేషం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Mohan Babu

Mohan Babu

500 లకు పైగా చిత్రాల్లో నటించి మోహన్ బాబు నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మంచు విష్ణు, మనోజ్ ఫెయిల్ అయ్యారు. మోహన్ బాబు కుమారుల కెరీర్ డిజాస్టర్ అని చెప్పాలి. కనీసం టైర్ టూ హీరోల సరసన చేరలేకపోయారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చిన నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు వాళ్ళను దాటి ముందుకు వెళ్లిపోయారు.

37

ఈ మధ్య కాలంలో మోహన్ బాబు ఫ్యామిలీ హీరోలు నటించిన చిత్రాలు కనీస ప్రభావం చూపలేకపోయాయి. సన్ ఆఫ్ ఇండియా, జిన్నా టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్స్ గా మిలిగిపోయాయి. ఒక ముక్కు ముఖం తెలియని హీరో సినిమా చేసిన అంత కంటే మంచి వసూళ్లు వస్తాయి. 
 

47

విష్ణు, మనోజ్ కెరీర్స్ మోహన్ బాబును తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఈ క్రమంలో మనోజ్ వ్యక్తిగత లైఫ్ కూడా ఒడిదుడుకులకు లోనైంది. 2019 లో ఆయన భార్యతో విడాకులు తీసుకున్నారు. కాగా మనోజ్ కారణంగా కుటుంబంలో విభేదాలు తలెత్తాయనే వాదన తెరపైకి వచ్చింది. 

 

57


మంచు విష్ణు-మనోజ్ మధ్య దూరం పెరిగింది. వారిద్దరికి మనస్పర్థలు తలెత్తాయి అంటున్నారు. దీంతో మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడట. ఇటీవల మంచు విష్ణు బర్త్ డే జరుపుకున్నారు. అన్నయ్యకు మనోజ్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. అలాగే విష్ణు కూతుళ్ళ బర్త్ డే నేపథ్యంలో విషెష్ తెలియజేస్తూ మనోజ్ సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టారు. 
 

67


మనోజ్ విషెస్ కి విష్ణు నుండి ఎలాంటి రిప్లై లేదు. ఆయన కనీసం స్పందించలేదు. మిగతా ప్రతి ఒక్కరికీ మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక విబేధాలకు కారణం భూమా మౌనికతో మంచు మనోజ్ సన్నిహితంగా ఉండటమే అంటున్నారు. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి కూతురైన మౌనికతో మనోజ్ సన్నిహితంగా ఉంటున్నాడు. 

77

వినాయక పండుగ సమయంలో మనోజ్-మౌనిక కలిసి పూజలు చేశారు. మౌనికను వివాహం చేసుకోవాలని మనోజ్ కోరుకుంటున్నారట. అయితే మంచు విష్ణుతో పాటు కుటుంబ సభ్యులకు ఈ సంబంధం పట్ల ఇష్టం లేదట. తన మాట వినకుండా మౌనికతో ఉంటున్న మనోజ్ పై కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నారట. ప్రచారం జరుగుతున్న ఈ కథనాల్లో వాస్తవం ఏమిటో తెలియాల్సి ఉంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మంచు మనోజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: తన జానపద పాటలతో యూట్యూబ్‍ను షేక్ చేసిన అల్లుఅర్జున్ సింగర్
Recommended image2
First Time Review: ఫస్ట్ టైమ్‌ మూవీ రివ్యూ, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రియుడి సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Ram Charan Peddi: హమ్మయ్య, పెద్దిగాడి అవయవాలు సేఫ్.. స్టోరీపై రూమర్స్ అన్నీ పటాపంచలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved