MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘శాకుంతలం’, ‘రావణసుర’తో పాటు ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే చిత్రాలివే.. ఫుల్ డిటేయిల్స్..

‘శాకుంతలం’, ‘రావణసుర’తో పాటు ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే చిత్రాలివే.. ఫుల్ డిటేయిల్స్..

2023 మొదటి త్రైమాసికం పూర్తయ్యే సరికి  ప్రేక్షకుల ముందుకు మంచి చిత్రాలు వచ్చాయి.  వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, బలగం, ధమ్కీ, దసరా సినిమాలు  తెలుగు ప్రేక్షకులను  మెప్పించాయి. బ్లాక్ బాస్టర్లతో బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపాయి. ప్రస్తుతం ఏప్రిల్ నెలలోనూ థియేటర్లలో సందడి చేసేందుకు చిన్న, పెద్ద సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ రోజున ఏ చిత్రం రానుందనేది తెలుసుకుందాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 01 2023, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాస్ మహారాజ రవితేజ (Raviteja) చిత్రంతోనే ఏప్రిల్ నెలలో సినిమా పండగ షురూ కానుంది. వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్న మాస్ రాజా ‘రావణసుర’ Ravanasuraతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  ఏప్రిల్ 7న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ సంస్థలు నిర్మించాయి. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అదించారు. సుశాంత్, హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు సాయంత్రం హైటెక్ సిటీ శిల్ప కళా వేదికలో ప్రీ  రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్నారు. చివరిగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో అలరించారు. ప్రస్తుతం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘మీటర్’ సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్రం కూడా ఏప్రిల్ 7నే థియేటర్లలో విడుదల కానుంది. ఏకంగా మాస్ మహారాజతోనే పోటీపడుతుండటం ఆసక్తికరంగా మారింది.  

36

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (samantha) - గుణశేఖర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం ‘శాకుంతలం‘ (Shaakuntalam). ఈనెల రెండో వారం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చిత్రానికి మణిరత్నం సంగీతం అందించారు. సమంత - దేవ్ మోహన్ జంటగా నటించారు.  అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా తొలిసారిగా వెండితెరపై ఆకట్టుకోబోతోంది. 

46

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) లేటెస్ట్ ఫిల్మ్  virupaksha కూడా ఈ నెలలో విడుదల కాబోతోంది. టీజర్, తదితర అప్డేట్స్ తో అంచనాలను పెంచేసిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముుందుకు రాబోతోంది. కార్తీక్‌ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంయుక్తా హెగ్డే హీరోయిన్.  శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. 
 

56

అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akil) నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఏజెంట్’ (Agent) ఎట్టకేళలకు ఈనెలలో విడుదల కానుంది. ఏప్రిల్ 28న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత  రాంబ్రహ్మం  నిర్మించారు. అఖిల్ సరసన సాక్షి వైద్య ఆడిపాడింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ కానుంది. 

66

ప్రముఖ నిర్మాత కొడుకు బెల్లకొండ గణేష్ (Bellamkonda Ganesh) నటించిన ‘నేను స్టూడెంట్ సార్!’ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో గణేష్ కు జోడీగా అవంతిక దస్సని నటిస్తోంది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీ2 బ్యానర్ పై సతీష్ వర్మ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మహతీ స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR: బాబూ మన సినిమాకి థియేటర్లు బద్దలైపోతున్నాయ్, హీరోకి అనుచరులు చెప్పిన ఫస్ట్ షో టాక్..రియాలిటీ తుస్సు
Recommended image2
JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ
Recommended image3
Vishwanath and Sons day1 Collection: సూర్యకు తమిళ ప్రేక్షకుల షాక్, తెలుగులో దుమ్మురేపుతోన్న విశ్వనాథ్ అండ్ నన్స్, ఫస్ట్ డే వసూళ్లు ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved