MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • చిరంజీవికి సిస్టర్ రోల్ లో నటించిన నలుగురు హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరిది సాహసమే..

చిరంజీవికి సిస్టర్ రోల్ లో నటించిన నలుగురు హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరిది సాహసమే..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది హీరోయిన్లు ఆశిస్తుంటారు. కానీ ఈ నటీమణులు మాత్రం చిరుతో సిస్టర్ రోల్స్ లో నటించి కెరీర్ లో పెద్ద సాహసమే చేశారు.  

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Dec 14 2023, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా స్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎంతో మంది హీరోయిన్లతో  కలిసి పని చేశారు. ఈ తరం హీరోయిన్లు కూడా ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాస్ సరసన బిగ్ స్క్రీన్ పై మెరిసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నలుగురు స్టార్ హీరోయిన్లు మాత్రం చిరుకు సిస్టర్ రోల్స్ లో నటించి ఆశ్చర్య పరిచారు. వారి గురించి తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

శ్రీలంకలో జన్మించిన కేరళ నటి, దివంగత సుజాత (Sujatha)  తమిళ చిత్రాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ, మలయాళం, హిందీలో హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. తెలుగులోనూ ‘గోరింటాకు’, తదితర చిత్రాలతో అలరించింది. అయితే సుజాత చిరుకు మొట్టమొదట చెల్లెలు పాత్రలో నటించిన హీరోయిన్ గా ముద్ర వేసుకున్నారు. 1982లో వచ్చిన ‘సీతాదేవి’ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించారు. అయితే అంతకు ముందు 1980లో కృష్ణం రాజు, చిరంజీవి మల్టీస్టారర్ గా వచ్చిన ‘ప్రేమ తరంగాలు’ చిత్రంలో చిరుకు హీరోయిన్ గా నటించడం విశేషం. ఆ తర్వాత ‘బిగ్ బాస్’లో తల్లిగానూ నటించి ఆశ్చర్యపరిచారు. ఈమె 2011 ఏప్రిల్ లో తుదిశ్వాస విడిచారు. అన్ని భాషల్లో కలిపి 300కుపైగా సినిమాల్లో నటించింది. 

35

సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Kushboo Sundar)  కొన్ని వందల సినిమాల్లో నటించారు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, తెలుగులో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించింది. లీడ్ యాక్ట్రెస్ గానే కాకుండా పలు కీలక పాత్రలు కూడా పోషించారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా మెప్పించిన ఖుష్బూ చిరంజీవికి మాత్రం సోదరి పాత్రలో నటించింది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ చిత్రంలో చిరుకు అక్కగా ‘జాన్సీ’ పాత్రలో అలరించింది. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కీలక పాత్రల్లో మెరుస్తోంది.

45

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతున్నారు. కీలక పాత్రలు కూడా పోషిస్తున్నారు. హీరోయిన్ గానే ఇంకా కెరీర్ ను లీడ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ చిరంజీవికి చెల్లెలిగా నటించింది. ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో చిరుకు సిస్టర్ రోల్ పోషించి అలరించింది. స్టార్ స్టేటస్ ఉన్న నయనతార.. మెగాస్టార్ కు చెల్లెలుగా నటించడం సాహసమనే చెప్పాలి. ఏదేమైనా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నారు. 

55

‘మహానటి’తో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు వచ్చాయి. మహేశ్ బాబు, వరుణ్ ధావన్, నాని వంటి స్టార్స్ తో అలరిస్తోంది. ఇప్పుడిప్పుడు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కీర్తి సురేష్ రీసెంట్ గానే చిరుకు చెల్లెలుగా నటించింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ‘భోళా శంకర్’లో చిరంజీవితో సిస్టర్ రోల్ లో నటించి అలరించింది. 
 
 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image2
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image3
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved