- Home
- Entertainment
- కొత్త రాగం అందుకున్న నటి మహాలక్ష్మి, తన భర్త ఇలాంటివాడని అనుకోలేదంటూ ఆవేదన, నిజమేనా..?
కొత్త రాగం అందుకున్న నటి మహాలక్ష్మి, తన భర్త ఇలాంటివాడని అనుకోలేదంటూ ఆవేదన, నిజమేనా..?
తాను మళ్లీ మోసపోయానంటోంది తమిళ నటి మహాలక్ష్మి శంకర్. నిర్మాత రవిందర్ చంద్రశేఖర్ ను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. తాజాగా ఆయన అరెస్ట్ కావడంతో.. మరో కొత్త రాగం అందుకుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తమిళ సినీ పరిశ్రమలో నటిగా మంచి మార్కులు వేయించుకుంది మహాలక్ష్మీ శంకర్. అయితే పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎప్పుడూ వివాదాలే సరిపోయాయి. ప్రేమించి పెళ్ళాడిన ఆమె.. ఒక కొడుకు పుట్టిన తరువాత విడాకులు తీసుకుంది. ఆతువాతకొంత కాలానికి తమిళ ప్రోడ్యూసర్ రవిందర్ చంద్రశేఖర్ ను ప్రేమించి పెళ్ళాడింది. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది.
నిర్మాత రవిందర్ ను ఆమె డబ్బుకోసం పెళ్ళి చేసుకుందంటూ..విమర్షలు వచ్చిన నేపథ్యంలో.. తాను మనస్పూర్తిగా ప్రేమించి అతన్ని పెళ్ళాడానని వివరణ కూడా ఇచ్చింది బ్యూటీ. ఆక్రమంలో తాజాగా చీటింగ్ కేసులో రవిందర్ ను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. ఓ వ్యక్తిని నమ్మించి డబ్బు కాజేశారని కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్నాడు రవిందర్.
అయితే ఆయన జైల్లో ఉంటే.. బెయిల్ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేయకుండా.. సోషల్ మీడియాలో ఫోటోలు అప్ డేట్ చేస్తూ.. మహాలక్ష్మి హ్యాపీగా ఉండటాన్ని గమనించి నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. నిజంగా అతన్ని ప్రేమించే పెళ్లాడావా..? లేక వెనుక ఉన్న డబ్బు చూసి ప్రేమించావా అంటూ గట్టిగా విమర్షించారు. దాంతో ఆమె ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
తాను మరోసారి మోసపోయాయనని... తన భర్త రవీందర్ ఇంత చీటర్ అని తనకు తెలియదని.. తెలిస్తే పెళ్లి చేసుకోపోదునంటూ.. సన్నిహితుల దగ్గర బాధపడిందట మహాలక్ష్మి. అంతలా బాధపడితే.. అంత హ్యాపీగా ఫోటోలు ఎందుకు పెడుతుంది సోషల్ మీడియాలో అంటూ.. విమర్షిస్తున్నారు జనాలు. మరికొందరు అయితే.. ఇంకాస్త ముందడుకు వేసి.. ఈమె డబ్బుకోసం అతన్ని ఇరికించి ఉంటుంది అంటున్నారు.
ఆమె మాత్రం తాను మోసపోయాను అని ఒకటే మాట అంటుందట. ఇప్పటికే విడాకులు తీసుకొని ఒక కొడుకుతో ఒంటరిగా ఉంటున్న మహాలక్ష్మి, రవీందర్ ను రెండో పెళ్లి చేసుకున్నారు ఇలా ఇప్పుడు ఈయన కూడా జైలు పాలు కావడంతో తాను మరోసారి మోసపోయాను అంటూ ఈమె చాలా ఒత్తిడికి గురవుతున్నారు అంటూ ఈ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఇష్షూ వైరల్ అవుతోంది.
తమిళ సినీ పరిశ్రమలో నటిగా మంచి మార్కులు వేయించుకుంది మహాలక్ష్మీ శంకర్. అయితే పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎప్పుడూ వివాదాలే సరిపోయాయి. ప్రేమించి పెళ్ళాడిన ఆమె.. ఒక కొడుకు పుట్టిన తరువాత విడాకులు తీసుకుంది. ఆతువాతకొంత కాలానికి తమిళ ప్రోడ్యూసర్ రవిందర్ చంద్రశేఖర్ ను ప్రేమించి పెళ్ళాడింది. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది.