తన తల్లి ఆకరికోరిక తీర్చబోతున్న మహేష్ బాబు, ఏర్పాట్లు భారీగా చేస్తున్న సూపర్ స్టార్.
తల్లి మరణించిన చాలా కాలానికి ఆమె చివరికోరికను నెరవేర్చడానికి రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారంటే..?
కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తండ్రిని మించిన స్టార్ డమ్ ను సాధించాడు మహేష్ బాబు. తండ్రి బిరుదును తాను పొందాడు. సూపర్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదిగారు మహేష్ బాబు. తాను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆయన తాను ఉండే పద్దతిలో ఉంటాడు మహేష్. మరి ముఖ్యంగా సెంటిమెంట్స్ ను బలంగా నమ్ముతారు మహేష్. ముహూర్తాలు లాంటివి గట్టిగా ఫాలో అవుతాడు.
సెంటిమెంట్స్ ను పక్కాగా ఫాలో అవుతూ ఉంటాడు మహేష్. మరి ముఖ్యంగా తన కెరీర్ లో కొన్నిసినిమాల దగ్గర నుంచి ఆయన తన సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ కు వెళ్లడు. మహేష్ లేకుండానే సినిమా ఓపెనింగ్ జరిగిపోతుంది. అది మహేష్ బాబు సెంటిమెంట్.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆమె మాట కాదనడు మహేష్. అయితే ఆమె ఈమధ్య కాలంలోనే కాలం చేశారు. కాని ఆమె చివరికోరిక మాత్రంఅలాగే మిగిలిపోయిందట. లైఫ్లో కొన్ని ముహూర్తాలు.. కొన్ని డేస్ బాగా ఫాలో అవుతుంటారు. అయితే అలాంటి మహేష్ తన తల్లి ఆఖరి కోరికను తీర్చలేకపోయాడన్న వార్త ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణంగా కన్నుమూశారు. అయితే ఆమెకు ఎప్పటినుంచో ఓ కోరిక ఉండేదట. సితారకు ఓణీల ఫంక్షన్ చేయించాలని ఆమెచాలా ఆశపడిందట. కాని మహేష్ కు మాత్రం ఇది మొదటి నుంచి ఇష్టం లేదట. చాలా సార్ల మహేష్ తల్లి ఈ విషయం గుర్తు చేసినా.. ఇప్పుడెందుకు అని దాటవేస్తూ వచ్చేవారట.
ఇలా తన తల్లి ఆ కోరిక తీరకుండానే చనిపోయింది. దీంతో చనిపోయిన తన తల్లి కోరిక తీర్చేందుకు మహేష్ బాబు సితార ఓణీల ఫంక్షన్ చేసేందుకు అంగీకరించారట.తన భార్య నమ్రత ఈ ఫంక్షన్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అందుకు కావల్సిన ఏర్పాట్లుకూడా ఆమె మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈతరంలో .. ఘట్టమనేని ఇంట మొదటి శుభకార్యం జరగబోతుండటంతో.. అది మీడియాలో హైలెట్ కాబోతోంది.
సితార ఘట్టమనేని ఓణీల ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిపించబోతున్నారట. ఈ ఫంక్షన్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే కాకుండా.. పొలిటికల్ లీడర్స్ తో పాటు.. దేశ విదేశాల నుంచి అతిరథమహారథులను అందరినీ ఆహ్వానించనున్నట్లు సమాచారం. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఈ కార్యక్రమం ఇంతే గ్రాండ్ గా చేస్తే.. ఇండస్ట్రీలో నిలిచిపోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
Indira Devi
సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆమె మాట కాదనడు మహేష్. అయితే ఆమె ఈమధ్య కాలంలోనే కాలం చేశారు. కాని ఆమె చివరికోరిక మాత్రంఅలాగే మిగిలిపోయిందట.
మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణంగా కొంత కాల క్రితం కన్నుమూశారు.