MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • సుమన్ ని మాత్రమే సీక్రెట్ గా ఆ ప్లేస్ కి తీసుకెళ్లిన రజనీకాంత్, దెబ్బకి షాక్.. ఇది నా నిజస్వరూపం అంటూ

సుమన్ ని మాత్రమే సీక్రెట్ గా ఆ ప్లేస్ కి తీసుకెళ్లిన రజనీకాంత్, దెబ్బకి షాక్.. ఇది నా నిజస్వరూపం అంటూ

సీనియర్ నటులందరితో అప్పట్లో సుమన్ సన్నిహితంగా ఉండేవారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒకరు. కొన్ని చిత్రాల్లో సుమన్, రజనీకాంత్ కలసి నటించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 03 2024, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సీనియర్ నటుడు, హీరో సుమన్ కి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. సీనియర్ నటులందరితో అప్పట్లో సుమన్ సన్నిహితంగా ఉండేవారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒకరు. కొన్ని చిత్రాల్లో సుమన్, రజనీకాంత్ కలసి నటించారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Suman Talwar

Suman Talwar

సుమన్ నటించిన ఒక చిత్రంలో రజనీ గెస్ట్ రోల్ లో నటించారు. అప్పటికి రజని సూపర్ స్టార్ అయ్యారు. కానీ తన కోసమే రజనీ ఆ పాత్ర చేసారని సుమన్ తెలిపాడు. ఇక సుమన్ సెకండ్ ఇన్నింగ్ లో అతడి కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చిన చిత్రం శివాజీ. శివాజీ మూవీలో సుమన్ విలన్ గా విలక్షణ నటన కనబరిచారు. ఈ చిత్రంలో సుమన్ పాత్రకి అనేక అవార్డులు కూడా వచ్చాయి. 

37
Suman Talwar

Suman Talwar

చాలా మంది రజనీకాంత్ ని సుమన్ డామినేట్ చేసే విధంగా పెర్ఫామ్ చేశారు అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. ఆ మూవీ షూటింగ్ లో రజనీకాంత్ శంకర్ తో ఒక మాట అన్నారట. ఈ విషయాన్ని సుమన్ తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సుమన్ నా కోసం ఈ చిత్రంలో విలన్ గా చేస్తున్నాడు.. ఎలాగైనా అతడికి మంచి పేరు రావాలి నీదే భాద్యత అని శంకర్ కి రజనీ చెప్పినట్లు తెలిపారు. 

47

రజని వ్యక్తిత్వం గురించి సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరులో శివాజీ మూవీ క్లైమాక్స్ షూటింగ్ ఒక కాలేజ్ లో జరుగుతోంది. టెర్రస్ పైన షూటింగ్. అక్కడి నుంచి పక్కనే ఉన్న ఒక ప్లేస్ కనిపిస్తుంది. షాట్ రెడీ కాలేదు. ఇంకా టైం పడుతుందని చెప్పడంతో నా చేయి పట్టుకుని ఎవరికీ చెప్పకుండా రజని ఆ ప్లేస్ కి తీసుకెళ్లారు. 

57
Rajinikanth

Rajinikanth

ఎక్కడికి సార్ అంటే రా చెబుతా అన్నారు. ఆ ప్లేస్ కి వెళ్ళాక.. ఇదే సుమన్ నా నిజ స్వరూపం.. నేను బెంగుళూరులో కండక్టర్ గా పనిచేస్తూ డ్యూటి అయిపోయాక ఇక్కడే మూటలు మోసా. కండక్టర్ జీతం సరిపోయేది కాదు. నాకు మందు సిగరెట్ అలవాటు ఉంది. వాటికి డబ్బుల కోసం ఇక్కడికి వచ్చి మూటలు మోసేవాడిని. ఆ డబ్బుతోనే మందు, సిగరెట్ కొనేవాడిని అని రజని చెప్పారు. 

67

రజని మాటలు వినగానే సుమన్ షాక్ అయ్యారట. ఇంత పెద్ద సూపర్ స్టార్ ఈ ప్లేస్ లో గడిపారా అంటే నమ్మలేకపోయా. అయినా కూడా నన్ను మాత్రమే సీక్రెట్ గా తీసుకెళ్ల తన జీవిత రహస్యాన్ని నాతో పంచుకున్నారు అని సుమన్ తెలిపారు. 

77

ఆయన ఇంటికి వెళితే మందు తాగుతుంటారు. మనకి కూడా ఒక పెగ్ ఇస్తారేమో అనుకుంటే పొరపాటే.. దానికి ఆయన చెప్పిన సమాధానం.. నేను మందు సిగరెట్ తాగితే నా లివర్, లంగ్స్ పాడవుతాయి. అది నా ఇష్టం. నీ లివర్ లంగ్స్ నేనెందుకు పాడు చేయాలి.. మీ ఇంట్లో వాళ్ళు నన్నెందుకు తిట్టుకోవాలి అని సరదాగా అన్నారు అని సుమన్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved