MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరో సినిమా కమిటైన శ్రీలీల, నిజమైతే కెరీర్ లో పెద్ద మలుపే?

స్టార్ హీరో సినిమా కమిటైన శ్రీలీల, నిజమైతే కెరీర్ లో పెద్ద మలుపే?

శ్రీలీలకు  కొద్దిరోజులుగా ఆమెకు అదృష్టం కలిసి రావడంలేదు. గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్‌ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. 

3 Min read
Surya Prakash
Published : May 07 2024, 08:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
sreeleela

sreeleela


 సినీ పరిశ్రమలో ఏ స్టార్స్ ఎప్పుడు వెలుగుతారో..ఏ స్టార్స్ కు ఎప్పుడు పరిస్దితులు తిరగబడతాయో చెప్పలేము. ఓ శుక్రవారం ఓవర్ నైట్ అప్పటిదాకా ఆ వీధిలో కూడా పెద్దగా తెలియనివారు ప్రపంచానికి పరిచయమై స్టార్స్ గా వెలగటం మొదలవుతుంది.  అందుకు ఉదాహరణగా  శ్రీలీల ను చెప్పచ్చు. ఆమె న‌క్క తోక‌ను తొక్కి వ‌చ్చిన‌ట్టుంది అంటూంటారు దర్శక,నిర్మాతలు. 

210
sreeleela

sreeleela

రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచచిన ‘పెళ్ళి సంద‌D’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు మొద‌టి సినిమాతోనే యూత్‌లో విప‌రీతమైన క్రేజ్ వ‌చ్చింది. గతేడాది దసరాకు రిలీజైన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ తెచ్చుకుంది. కానీ రిలీజ్‌కు ముందు హైప్‌ తెచ్చిన పాటలు.. రిలీజ్‌ తర్వాత శ్రీలీల అందాల ఆరబోతకు యూత్‌ థియేటర్‌లకు బాగా నే వెళ్లారు. కేవలం శ్రీలీల గురించే ఈ సినిమా ఆడిందంటే అతిశయోక్తి కాదు. 

310


‘పెళ్ళి సంద‌D’ సినిమా సక్సెస్‌లో శ్రీలీల మేజర్‌ పాత్ర పోషించింది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా తన గ్లామర్‌ షోతో యూత్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరస సినిమాలు చేసింది. లాస్ట్ ఇయిర్ ‘ధమాకా’ సినిమా కూడా అంతే.  ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్ళు సాధించింది.  ఈ సినిమాలో కొత్తదనం ఏమి లేకపోయినా రవితేజ కామెడీ, శ్రీలీల గ్లామర్ షోతో లాగేసింది. 

 

410

అలాగే ‘ధమాకా’లో పర్ఫార్మెన్స్‌ పరంగా   హీరోయిన్‌ శ్రీలీల పాత్రకు అంతగా స్కోప్‌ లేదు. దాంతో నటనకు పెద్దగా పని చెప్పే అవసరం రాలేదు. కానీ ఉన్నంతలో బాగానే దుమ్ము రేపింది.  ముఖ్యంగా శ్రీలీల తన డ్యాన్స్‌లతో అదరగొట్టింది. రవితేజ పర్‌ఫార్మెన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా డాన్స్‌తో రెచ్చిపోయింది. నిజానికి ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్‌ ఈమెకే దక్కుతుంది.
 

 

510
Sreeleela

Sreeleela


‘ధమాకా’ తర్వాత ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్క హిట్ కొట్టిది లేదు. వరస పెట్టి ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యింది. నవీన్‌ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ అయితే ముందుకు వెళ్లలేదు., బోయపాటి-రామ్‌ పోతినేని మూవీ స్కంధ డిజాస్టర్. , బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి జస్ట్ ఓకే. వీటితో పాటుగా గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కీరిటీ డెబ్యూ మూవీలోనూ ఆమెనే హీరోయిన్‌గా నటిస్తుంది.   

610

శ్రీలీలకు  కొద్దిరోజులుగా ఆమెకు అదృష్టం కలిసి రావడంలేదు. గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్‌ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇలా శ్రీలీలకి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో శ్రీలీల జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మెప్పించినా.. అది కూడా యావరేజ్‌గానే మిగిలింది. దీంతో కొద్దిరోజులు బ్రేక్‌ తీసుకుని స్టడీస్‌పై ఫోకస్‌ చేయాలని ఫిక్సయ్యింది శ్రీలీల. 

710


రీసెంట్ గా  ఓ స్టార్‌ హీరో సినిమాలో శ్రీలీలతో ఐటెం సాంగ్‌ చేయించాలని మేకర్స్‌ భావించారు. ఇదే విషయమై శ్రీలీలను సంప్రదించి భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ కూడా ఆఫర్‌ చేశారు. కానీ ప్రస్తుతం సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఐటెం సాంగ్స్‌ చేయడం శ్రీలీలకు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే కోట్లు ఇచ్చినా సరే ఐటెం సాంగ్స్‌ చేయనని శ్రీలీల చెప్పేసిందట. గతంలో పుష్ప 2 సినిమాలోనూ ఐటెం సాంగ్‌ కోసం అడిగితే రిజెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

810
sreeleela

sreeleela


ఇక తెలుగులో వరస ఫ్లాప్స్ దెబ్బకు ఈమెకు టాలీవుడ్‌లో ఛాన్సులు తగ్గిపోయాయనే చెప్పాలి. లేదంటే ఈమె వద్దనుకుందో తెలియదు గానీ మన సినిమాలు ఇప్పట్లో చేసే సూచనలు కనిపించట్లేదు. అదే టైంలో తమిళంలో విజయ్, అజిత్ చిత్రాల్లో నటించే అవకాశం వరించిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
 

910
Sreeleela

Sreeleela


కాగా శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ అవకాశం తలుపు తట్టినట్లు తెలిసింది. కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని, ఇందులో హీరోయిన్‌గా ఈమెని తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమై, మూవీ హిట్ అయితే మాత్రం తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. తెలుగులో జెండా ఎగరేసినట్లుగానే తమిళంలోనూ ఆమె ఖచ్చితంగా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటుంది అనటంలో సందేహం లేదు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా మాత్రమే ఉంది.

1010

ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్‌ చదువుతూనే సినిమాలు చేస్తుంది. ఒకవైపు కెరీర్, మరోవైపు సినిమాలను బ్యాలెన్సింగ్‌ చేసుకుంటూ వెళ్తోంది. అయితే ఇప్పుడు ఎంబీబీఎస్‌ పరీక్షలు ఉండటంతో శ్రీలీల సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకుంటుంది. అందుకే కొత్తగా వేరే సినిమాలను ఒప్పుకోవడం లేదు. ముందుగా ఒప్పుకున్న సినిమాలనే కంప్లీట్‌ చేస్తోంది. 

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved