- Home
- Entertainment
- నగల యాడ్ కోసం సితార పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఔట్.. స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్..
నగల యాడ్ కోసం సితార పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఔట్.. స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్..
మహేష్‌బాబు కూతురు సితార.. లేటెస్ట్ గా ఓ ఆభరణాల కంపెనీ యాడ్ లో నటించింది. టైమ్స్ స్వ్కైర్స్ పై ప్రదర్శించిన బడిన ఈ యాడ్ కోసం సితార తీసుకుంటున్న పారితోషికం షాకిచ్చేలా ఉంది.

మహేష్‌బాబు కూతురు సితార సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. డాన్సులతో అదరగొడుతుంది. అవన్నీ కాదని లేటెస్ట్ గా ఏకంగా అమెరికాలోని టైమ్స్ స్వ్కైర్‌పైకి ఎక్కింది. ఆమె నటించిన జ్యూవెల్లరీ యాడ్‌ని టైమ్స్ స్క్వైర్‌పై ప్రదర్శించారు. చిన్న వయసులో అంతటి అరుదైన ఘనత సాధించిన స్టార్ కిడ్‌గా సితార రికార్డ్ సృష్టించింది.
దీనిపై మహేష్ సైతం ఉబ్బితబ్బిబ్బయ్యారు. గర్వంగా ఉందని, ఇలానే దూసుకువెళ్లాలని తెలిపారు. మరోవైపు సితార సైతం స్పందిస్తూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తనని తాను టైమ్స్ స్వ్కైర్‌పై చూసుకుని ఎమోషనల్ అయినట్టు తెలిపింది. తనకిది బెస్ట్ మెమరీ అని పేర్కొంది. తల్లి నమ్రత ఆనందానికి కూడా అవదుల్లేవ్.
sitara ghattamaneni
ఇక ఈ యాడ్ కోసం సితార తీసుకున్న పారితోషికం ఇప్పుడు మరో సంచలనం సృష్టించింది. అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు ఆ వివరాలు తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఈ జ్యూవెల్లరీ యాడ్ కోసం సితార ఏకంగా రూ.కోటి తీసుకున్నారట. ఇది నమ్మడానికి షాకింగ్‌గా ఉన్నా ఇదే నిజమని తెలుస్తుంది. అంతటి మొత్తం కావడం వల్లే మహేష్.. సితార ఈ యాడ్ చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం.
నిజానికి సితారకి అంతకు ముందే చాలా యాడ్స్ వచ్చాయట. కానీ మహేష్ నో చెబుతూ వచ్చారు. కానీ ఈ జ్యూవెల్లరీ యాడ్‌కి మాత్రం ఓకే చెప్పడానికి కారణం పారితోషికం అని తెలుస్తుంది. కానీ టైమ్ స్క్వైర్‌పై తన కూతురిని చూసుకున్నాక, ఆయనకు అంతకు మించిన ఆనందం కలిగిందని టాక్. ఎందుకంటే కమర్షియల్ యాడ్స్ ద్వారా మహేష్ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. సినిమాల పారితోషికానికి డబుల్ యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నాడు. ఆయన అనేక యాడ్స్ చేస్తుంటారు. టీవీ యాడ్స్ నుంచి, కూల్ డ్రింక్స్, స్టడీస్ యాడ్, వంట మసాలా, సోప్స్ యాడ్స్ లోనూ నటిస్తున్నారు. టాలీవుడ్‌లో అత్యధిక యాడ్స్ చేసే హీరోగా మహేష్ నిలిచారు.
sitara ghattamaneni
ఇదిలా ఉంటే సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాను చేసే ప్రతిదీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా ఆమె డాన్సు వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అద్భుతంగా డాన్సు చేస్తూ ఆకట్టుకుంటుంది. క్లాసికల్ డాన్సుల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది. దీంతోపాటు ట్రావెలింగ్ ఫోటోలు, తనకిష్టమైన ఫుడ్, ఇష్టమైన ప్రదేశాలు షేర్ చేస్తూ ఇప్పుడే తనకంటే ఫ్యాన్స్ ని ఏర్పర్చుకుంటుందీ మషేష్ ముద్దుల తనయ.