- Home
- Entertainment
- Singer Sunitha: మామిడి కాయలతో సింగర్ సునీత పోజులు.. `బ్లెస్డ్` అంటూ పోస్ట్.. మళ్లీ తల్లి కాబోతుందా?
Singer Sunitha: మామిడి కాయలతో సింగర్ సునీత పోజులు.. `బ్లెస్డ్` అంటూ పోస్ట్.. మళ్లీ తల్లి కాబోతుందా?
సింగర్ సునీత ఏడాది క్రితం పెళ్లి చేసుకుంది. హ్యాపీగా కొత్త జీవితాన్ని గడుపుతోంది. కానీ ఇంతలో పెద్ద షాకిచ్చింది. లేటెస్ట్ గా ఆమె మామిడి కాయలతో ఫోటోలకు పోజులివ్వడం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇంతకి ఏమైంది.?

సింగర్ సునీత(Singer Sunitha) లేటెస్ట్ గా మామిడి తోటలో దిగిన ఫోటోలను పంచుకుంది. ఆమె చిరునవ్వులు చిందిస్తూ, క్యూట్ లుక్‌లో మామిడి కాయలను పట్టుకుని ఫోటోలు దిగింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీనికి విశేష ఆదరణ దక్కుతుంది. జనరల్‌గా సింగర్ సునీత ఇటీవల తన ఫామ్ హౌజ్‌లో వ్యవసాయ పనులు చేస్తూ, పండ్లు, కూరగాయాలు కోస్తూ కనిపించింది.
ఫ్రీ టైమ్‌లో సునీత తన వ్యవసాయ క్షేత్రంలో రిలాక్స్ అవుతుంది. సాధ్యమైన చిన్న చిన్న పనులు చేస్తూ, సహజమైన ఆహారం తీసుకుంటుంది. ఆదర్శంగా నిలుస్తుంది.ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ ఆయా పిక్స్ ని షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది సింగర్ సునీత. కానీ ఇప్పుడు మామిడి కాయలతో పోజులిస్తూ దిగిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
దీనికి కారణం సునీత ఈ ఫోటోలతోపాటు `బ్లెస్డ్` అంటూ పోస్ట్ పెట్టడమే. దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సునీత మళ్లీ తల్లికాబోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే, ఏకంగా సునీత ప్రెగ్నెంట్ అని, మరోసారి తల్లికాబోతున్న సింగర్ సునీత అంటూ కామెంట్లు చేయడం విశేషం. మరి నిజంగానే సునీత తల్లికాబోతుందా? అనే అనుమానాలు సగటు వ్యక్తికి వ్యక్తమవుతుంది.
జనరల్‌గా ప్రెగ్నెంట్ అయిన సమయంలోనే మామిడి కాయలు పట్టుకుని కనిపిస్తుంటారు. మామిడి కాయలు తింటూ తమ ప్రెగ్నెన్సీని వెల్లడిస్తుంటారు. అయితే ఇప్పుడు మామిడి కాయల సీజన్. పైగా సునీత రెగ్యూలర్‌గా తన తోటలో అరటిపళ్లు, కూరగాయలు కోస్తూ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మామిడి కాయలతో ఫోటోలు పెట్టిందా? అనే డౌట్ కూడా వస్తుంది. కానీ ఏదేమైనా `బ్లెస్డ్ ` అనే పోస్ట్ తో సునీత కూడా తాను ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని కన్ఫమ్ చేసిందని మెజారిటీ నెటిజన్లు పోస్ట్ లు పెట్టడంతో ఇది ఇంటర్నెట్ వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
సింగర్ సునీత్ మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నాక చాలా రోజులు సింగిల్‌గానే ఉంది. మొదటి భర్త కారనంగా ఒక కుమారుడు, కూతురు జన్మించారు. వాళ్లు పెద్దవాళ్లయ్యారు. ఉన్నత చదువుల్లో ఉన్నారు. కెరీర్‌లో సెటిల్ అవ్వబోతున్నారు. ఈ క్రమంలో వారి అంగీకారంతో డిజిటల్ అధినేత రామ్ వీరపనేనిని గతేడాది జనవరిలో వివాహం చేసుకుంది సింగర్ సునీత. కొద్ది మందితో చాలా గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.
రెండో పెళ్లి తర్వాత సింగర్ సునీత కెరీర్‌లో ఫుల్ బిజీ అయ్యింది. వరుస షోలు చేస్తుంది. మరోవైపు సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ రాణిస్తుంది. తరచూ సోషల్ మీడియాలో నెటిజన్లతో చిట్‌చాట్ చేస్తుంది. వ్యక్తిగత జీవితంలోనూ రెట్టింపు ఉత్సాహంతో ఉంది. అన్ని రకాలుగా రెండో పెళ్లి సునీతకి కలిసొచ్చిందనే కామెంట్స్ వినిపించాయి. ఇండస్ట్రీనుంచి ఆమెకి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఇంతటి సంతోషకర సమయంలో లేటెస్ట్ అప్‌డేట్ మాత్రం అభిమానులను మరింత ఆనందానికి గురి చేస్తుంటే, జనరల్ నెటిజన్లకి మాత్రం తాజా పోస్ట్ షాకిస్తుంది.