- Home
- Entertainment
- ప్యాంట్ విప్పేసి బూర్జ్ ఖలీఫా ముందు రెచ్చిపోయిన శివాత్మిక.. వామ్మో ఇదెక్కడి అరాచకం..
ప్యాంట్ విప్పేసి బూర్జ్ ఖలీఫా ముందు రెచ్చిపోయిన శివాత్మిక.. వామ్మో ఇదెక్కడి అరాచకం..
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్‌కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడి కోసం లక్షలాది మంది అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అంతగా ఒక్క సినిమాతోనే ఫాలోయింగ్‌ని పెంచుకుంది శివాత్మిక.

ఇదిలా ఉంటే శివాత్మిక ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. అందులో భాగంగా దుబాయ్‌లో అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేస్తుంది. తన అక్క శివానీ రాజశేఖర్, ఫ్రెండ్, హీరోయిన్ ఈషారెబ్బాలు కలిసి దుబాయ్‌లో రచ్చ చేస్తున్నారు. ముగ్గురు కలిసి నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌లో మునిగి తేలుతున్నారు. బ్రేకుల్లేకుండా తన ఎంజాయ్‌మెంట్‌ని ఆస్వాధిస్తున్నారు.
ఇటీవల ఇసుక తిన్నెల్లో మోటార్ బైక్‌లో తిరుగుతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శివాత్మిక, ఈషా రెబ్బా బైక్ పై కూర్చొని ఇసుక తిన్నెల్లో కలియ తిరిగారు. సమ్మర్ వెకేషన్‌ని జీవితం కాలం గుర్తిండిపోయేలా స్పెషల్‌గా మార్చుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా బూర్జ్ ఖలీఫా వద్ద రచ్చ చేసింది శివాత్మిక. ప్రపంచంలోనే అతిపెద్ద టవర్ అయిన బూర్జ్ ఖలీఫాల వద్ద ఫోటోలకు పోజులిచ్చింది శివాత్మిక. దుబాయిలోని ఈ బిల్డింగ్ ముందు రాజశేఖర్ తనయ రెచ్చిపోయింది. ప్యాంట్ లేకుండా పోజులిచ్చి దుమారం రేపింది.
ప్యాంట్ విప్పేసి, చెప్పులు సైతం తీసేసి అలా తనని తాను మర్చిపోయి హోయలు పోయింది. పొట్టి గౌన్‌లో తన హాట్ థైస్ చూపిస్తూ రెచ్చిపోయింది శివాత్మిక. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుండటం విశేషం.
ఈసందర్భంగా శివాత్మిక ఓ పోస్ట్ పెట్టింది. `నేను నిజంగా దుబాయ్ వెళ్లాను అనడానికి ఇదిగో రుజువు అంటూ నేను ఫుట్‌వేర్ ధరించలేదు. కారణం ఇక్కడ చాలా హీల్స్ జరిగింది అంటూ పోస్ట్ పెట్టింది. మొత్తంగా శివాత్మిక పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలు పోస్ట్ లు పెడుతున్నారు.
శివాత్మిక తెలుగులో నటించింది ఒక్క సినిమానే. `దొరసాని` చిత్రంతోనే మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతుంది. హాట్ హాట్ అందాలతో వారిని కనువిందు చేస్తుంది. సినిమాల్లో లేకపోయినా ఇలా ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది.
ఇక ప్రస్తుతం శివాత్మిక నాలుగు సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో రెండు చిత్రాలుండగా, తమిళంలో రెండు సినిమాలున్నాయి. తెలుగులో `పంచతంత్రం`, `రంగమార్తాండ` చిత్రాలున్నాయి. ఇందులో `పంచతంత్రం` విడుదలకు సిద్ధమవుతుంది. ప్రమోషన్ కార్యక్రమాలు షురు చేశారు. వరుసగా పాటలు విడుదల చేస్తూ సినిమాపై హైప్‌ని పెంచుతున్నారు.