- Home
- Entertainment
- Bheemla Nayak: సిగ్గు మొగ్గలేస్తున్న భీమ్లా నాయక్ బ్యూటీ.. రానా ఆన్ స్క్రీన్ వైఫ్ మైండ్ బ్లోయింగ్ ఫోటోస్
Bheemla Nayak: సిగ్గు మొగ్గలేస్తున్న భీమ్లా నాయక్ బ్యూటీ.. రానా ఆన్ స్క్రీన్ వైఫ్ మైండ్ బ్లోయింగ్ ఫోటోస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

Samyukta Menon
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
Samyukta Menon
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంయుక్త మీనన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. గ్లామర్ మెరుపులు మెరిపించడమే కాదు.. తన స్పీచ్ తో సంయుక్త అందరినీ కట్టి పడేసింది. రానా, పవన్ కళ్యాణ్ లపై ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్ తన హోమ్ టౌన్ కావాలని ఆశిస్తున్నట్లు తన మనసులో మాట బయట పెట్టింది.
Samyukta Menon
అలాగే 'ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాఢాంధకారం' అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో చెప్పే మాటలు చెప్పి ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిత్యామీనన్ హాజరు కాలేదు. దీనితో సంయుక్త అందరి దృష్టిని ఆకర్షించింది. సంయుక్త మీనన్ ఆశించినట్లుగానే భీమ్లా నాయక్ చిత్రం మంచి విజయం సాధించింది.
Samyukta Menon
ఇక ఆమెకు ఆఫర్స్ రావడమే తరువాయి. భీమ్లా నాయక్ లాంటి క్రేజీ ఆఫర్స్ కోసం సంయుక్త ఎదురుచూస్తోంది. భీమ్లా నాయక్ చిత్రంలో కథకు తగ్గట్లుగా సంయుక్త హోమ్లీగా మెప్పించింది. ఆమెలో గ్లామర్ యాంగిల్ కూడా ఉంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలే అందుకు ఉదాహరణ. బికినీ ఫోజుల్లో సైతం కుర్రాళ్ళని హీటెక్కిస్తోంది.
Samyukta Menon
తాజాగా సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. గ్లామర్ హద్దులు దాటకుండానే అందమైన చుడిదార్ లో అభిమానులని కట్టి పడేస్తోంది. కళ్ళు చెదిరేలా ఆమె ఫోజులు ఉన్నాయి. కొంచెం కొంచెంగా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ.. సిగ్గు మొగ్గలేస్తూ సంయుక్త ఇచ్చిన ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.
Samyukta Menon
సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి భార్యగా నటించింది. ఎమోషనల్ యాక్టింగ్ తో మంచి మార్కులు దక్కించుకుంది. క్లయిమాక్స్ లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Samyukta Menon
తెలుగులో భీమ్లా నాయక్ గుర్తింపు లభించింది కాబట్టి.. గ్లామర్ రోల్స్ లో కూడా తనని తాను నిరూపించుకునేందుకు సంయుక్త రెడీగా ఉంది. త్వరలో తన ట్యాలెంట్ కి తగ్గ ఆఫర్స్ వస్తాయని ఈ మలయాళీ బ్యూటీ భావిస్తోంది.