MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ విషయం అర్థం చేసుకోలేకపోయా, అందుకే ఫెయిల్.. సమంత కామెంట్స్ చైతు గురించేనా ?

ఆ విషయం అర్థం చేసుకోలేకపోయా, అందుకే ఫెయిల్.. సమంత కామెంట్స్ చైతు గురించేనా ?

సమంత వీలైనంత త్వరగా ఫిట్ నెస్ సాధించి తిరిగి సినిమాల్లో యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తోంది. మయో సైటిస్ నుంచి కోలుకున్న సమంత పూర్తిగా ఫిట్ నెస్ సాధించలేక ఇబ్బందులు పడుతోంది. మయోసైటిస్ వల్ల ఎదురైనా ఇబ్బందులని అధికమించేందుకు సామ్ తరచుగా యోగా, జిమ్ వర్కౌట్స్ చేస్తోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 18 2024, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమంత వీలైనంత త్వరగా ఫిట్ నెస్ సాధించి తిరిగి సినిమాల్లో యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తోంది. మయో సైటిస్ నుంచి కోలుకున్న సమంత పూర్తిగా ఫిట్ నెస్ సాధించలేక ఇబ్బందులు పడుతోంది. మయోసైటిస్ వల్ల ఎదురైనా ఇబ్బందులని అధికమించేందుకు సామ్ తరచుగా యోగా, జిమ్ వర్కౌట్స్ చేస్తోంది. సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. సమంత ప్రస్తుతం ఎలాంటి చిత్రానికి సైన్ చేయలేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటోంది. నాగ చైతన్య, సమంత మధ్య ఏం జరిగింది ? ఎందుకు విడిపోయారు అనే సంగతులు ఎవరికీ తెలియదు. 

 

36

అయితే గతంలో అనేక రూమర్స్ వినిపించాయి. చైతు సమంత విడిపోవడానికి కారణం ఇదే అంటూ అనేక పుకార్లు వినిపించాయి. ఆ పుకార్లని సమంత ఖండించింది. అప్పుడప్పుడూ తన పర్సనల్ లైఫ్ గురించి సమంత పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. 

 

46

తాజాగా సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. తాను జీవితంలో చేసిన తప్పు గురించి సమంత ఓపెన్ అయింది. మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటి అని అభిమాని ప్రశ్నించాడు. దీనికి సమంత బదులిస్తూ.. నా సొంత ఇష్టాలని, అయిష్టాలని అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను. బహుశా జీవితంలో నేను చేసిన తప్పు అదేనేమో. ఒక సమయంలో నా భాగస్వామి ద్వారా నేను ప్రభావితం అయ్యాను. 

 

56

అత్యంత క్లిష్టమైన సమయంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే నా వ్యక్తిగత ఎదుగుదల చాలా కీలకం అని తెలుసుకున్నా అంటూ సమంత చెప్పుకొచ్చింది. దీనితో సమంత చేసిన ఈ వ్యాఖ్యలని చైతన్య గురించే అంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు. 

 

66

వైవాహిక బంధం వల్ల సమంత ప్రొఫెషనల్ లైఫ్ కి ఇబ్బందులు ఏర్పడ్డాయా ? సమంత కామెంట్స్ కి ఉద్దేశంఅదేనా ? అంటూ చర్చించుకుంటున్నారు. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: కూతురి గురించి గేమ్ ఛేంజర్ నటి ఎమోషనల్ పోస్ట్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
Recommended image2
Cannes 2026: రెడ్ కార్పెట్‌పై అలియా నుంచి అదితి వరకు.. భర్తకు విడాకులిచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ
Recommended image3
Soundarya: 12 మంది హీరోలు వద్దన్న మూవీ..సౌందర్య సినిమా ఫ్లాప్ అయినా రికార్డుల్లో మాత్రం తోపు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved