షాకింగ్ న్యూస్ సమంత తను సంపాదనలో ఎక్కవగా దానికే ఖర్చుపెడుతుందట...? దేనికో తెలుసా..?
చేతినిండ సంపాదన ఉన్న హీరోయిన్లలో సమంత ముందు వరసలో ఉన్నారు. విడాకుల తరువాత అది ఇంకా పెరిగిపోయింది. మరి అంత సంపాదనతో సమంత ఏం చేస్తుందో తెలుసా...? ఊహించగలరా...?
ఏజ్ పెరుగుతున్నా.. ఇమేజ్ తగ్గని హీరోయిన్ సమంత. కోలీవుడ్ లో నయనతార తనహవా ఇంకా కొనసాగిస్తున్నట్టుగానే.. ఇక్కడ కూడా సమంత తన సత్తా చాటుకుంటోంది. ఏమాత్రం ఏజ్ కనిపించకుండా.. ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ... స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది.
Samantha ruth prabhu
నాగచైతన్యతో విడాకుల తరువాత సినిమాల విషయంలో జోరు పెంచింది సమంత. ఏమాత్రం ఖాళీగా ఉండకుండా.. గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేసేస్తోంది. చేతినిండా సంపాదిస్తుంది. కోట్లకు కోట్లు వేనకేసుకుంటున్నట్టు సమాచారం. కాస్త ఖాళీ టైమ్ దొరికితే.. ఫ్రెడ్స్ తో టూర్లకు చెక్కేస్తోంది సీనియర్ బ్యూటీ.
రెమ్యూనరేషన్ విషయంలో టాలీవుడ్ లో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న కుర్ర హీరోయిన్లకు డబుల్ తీసుకుంటుందట సమంత. దాదాపు సినిమాకు 30 కోట్ల వరకూ తీసుకుంటుంద. ఇవి కావకుండా కొన్ని వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత సంపాదన అంతా.. ఇంతా కాదు. మరి అదంతా ఆమె ఏం చేస్తోందో తెలుసా...?
సమంత డబ్బును ఖర్చు చేయడానికి సంబంధించి షాకింగ్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సమంత తాను సంపాదించిన డబ్బుల్లో చాలా వరకు విరాళాల రూపంలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. సమంత సేవ కార్యక్రమాల గురించి చాలా కొద్ది మందికే తెలుసు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమాజానికి తన వంతుగా సేవా చేస్తుంటుంది సమంత
ముఖ్యంగా చిన్న పిల్లలను, వృద్థులనుఆదుకోవడంలో ఆమె ముందుంటారు. అందుకే తన సంపాదనలో ఎక్కువ శాతం అనాధల కోసం ఖర్చు చేస్తున్నారట సమంత. ఈ విషయం తెలిసి ఎవరైనా ఇంప్రెస్అవ్వకుండా ఉంటారా..? .
ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజిగా ఉంది. తను నటించి శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అటు బాలీవుడ్ లో, కోలీవుడ్ లో కూడా సినిమాలు కమిట్ అవుతోంది సమంత. అంతే కాదు హాలీవుడ్ మూవీలో కూడా నటిస్తోంది. కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది సామ్. మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ప్యాన్స్ ఎదురు చూస్తున్నారు.