MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • పబ్ లో 'యానిమల్' హీరో ని చెప్పుతో కొట్టిన సల్మాన్.. సంజయ్ దత్ మధ్యలోకి రావడంతో.. అసలేం జరిగింది?

పబ్ లో 'యానిమల్' హీరో ని చెప్పుతో కొట్టిన సల్మాన్.. సంజయ్ దత్ మధ్యలోకి రావడంతో.. అసలేం జరిగింది?

 రణబీర్ ముఖం మీద చెప్పుతో కొట్టాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న సంజయ్ దత్...మరికొందరు స్నేహితులతో కలసి జోక్యం చేసుకుని గొడవను అప్పటికప్పుడే ఆపేశారు

3 Min read
Author : Surya Prakash
Published : May 01 2024, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19


బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్‌ఖాన్‌, యంగ్ హీరో రణబీర్‌ కపూర్‌ల  కోల్డ్ వార్ చాలా కాలంగా సాగుతూ వస్తోంది. దానికి తోడు ఇద్దరు స్టార్స్ ఒకే అమ్మాయి కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేశారు. అయితే , అదే వారి గొడవకి కారణం అయితే కాదు.  రణబీర్, సల్మాన్ మధ్య కత్రినా రాకముందే ఓ గొడవ జరిగింది. ఆ విషయం ఇప్పుడు మరోసారి మీడియాలో హైలెట్ అవుతోంది.  వీరిద్దరూ గత చరిత్రలను వదిలిపెట్టి ఇప్పుడు సరిపెట్టుకున్నట్లు కనిపించినా ఇప్పటికీ వారి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని చెప్తారు. అసలు ఈ స్టార్ హీరోల మధ్య ఏం జరిగింది... 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి సల్మాన్ ఖాన్ మొదటి నుంచి మొక్కోపి. ఎంత మంచివాడిగా భాయిజాన్‌గా అందరిచేతా ప్రశంసించబడే ఈ సూపర్ స్టార్ కోపం వస్తే తట్టుకోలేడు. కంట్రోలు చేసుకోలేదు. దాంతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఆయన్ను చుట్టముడుతూనే ఉంది.ఆ క్రమంలోనే యానిమల్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని చెప్పుతో కొట్టడం జరిగిందని చెప్తారు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు. చాలా కాలం క్రితంది.
 

39

రణబీర్ కపూర్ 2007లో సంజయ్ లీలా బన్సాలీ చిత్రం సావరియాలో సోనమ్ కపూర్ సరసన నటించాడు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర కూడా ఉంది. ఇండియా టుడేలో వచ్చిన కథనం ప్రకారం, సల్మాన్ ఒకసారి సంజయ్ దత్‌తో కలిసి ఒక పోష్ పబ్‌లో రణబీర్‌ను కలిశాడు. పార్టీ లో మెల్లి మెల్లిగా వీరిద్దరూ ఆ మాటలు,ఈ మాటలు వచ్చాయి. అయితే రణ్బీర్ క్యాజువల్ గా మాట్లాడినా  సల్మాన్ ని వెటకారం చేసినట్లు అనిపించింది. అయితే తాను క్యాజువల్ గా అన్నాను అన్నాడు. దాంతో  చాలా సేపు మాటల యుద్దానికి దిగారు. 

49

ఇద్దరూ ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్లు ఈ స్టార్స్ మాటలు విసుకున్నారు. ఈ విషయంపై సల్మాన్ నిగ్రహాన్ని కోల్పోయాడు .  వాదన తీవ్రమైంది. సూపర్ స్టార్ తన లబనం కోల్పోయాడు. లాగిపెట్టి ఒకే ఒకే సినిమా చేతిలో ఉన్న ఈ పిల్ల హీరో  నాకు చెప్పేదేంటని .. రణబీర్ ముఖం మీద చెప్పుతో కొట్టాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న సంజయ్ దత్...మరికొందరు స్నేహితులతో కలసి జోక్యం చేసుకుని గొడవను అప్పటికప్పుడే ఆపేశారు. 
 

59


ఈ ఘటనతో రణ్‌బీర్ చాలా సిగ్గుపడ్డాడు. సల్మాన్ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత పబ్ నుంచి వెళ్లిపోయాడు. రణబీర్ చాలా అవమానం ఫీలయ్యాడు. అందరి ఎదురుగా తనని చెప్పుతో కొట్టడం తట్టుకోలేకపోయాడు. కానీ అప్పటికే జరాగాల్సిన డామేజ్ జరిగిపోయింది. ఇంట్లో తెలిపోయింది. ఇటు సల్మాన్ ఇంట్లోనూ తెలిసింది. మధ్యలో ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ ప్రెండ్ ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చే ప్రయత్నం చేసారు. 

69


చివరకు మరుసటి రోజు ఉదయం, సల్మాన్ ఖాన్ తండ్రి, సలీం ఖాన్ రణబీర్ ఇంటికి వెళ్లి రిషి కపూర్‌కి క్షమాపణలు చెప్పి, ఆ గొడవను సర్దు మణిగేలా చేసారు. అయితే, ఆ తర్వాత సల్మాన్ మరియు రణబీర్ మధ్య అగాధం అలాగే ఉండిపోయింది.  ఇద్దరూ ముఖాముఖి చూడలేకపోయారు. ఒక హీరో ఫలాన్ షూటింగ్ స్పాట్ లో కానీ, పార్టీలో కాని ఉన్నారంటే ఇద్దరూ అటు వైపుకు వెళ్లేవారు కాదు. దాంతో ఇండస్ట్రీలో ఇదో పెద్ద సమస్యగా మారిపోయింది. 

79

  రణబీర్ కపూర్ .. కత్రినా కైఫ్‌తో శృంగార సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ పరిస్థితులు మరింత దిగజారాయి, ఎందుకంటే సల్మాన్ తన తల్లి,సోదరీమణులను కాకుండా సమానంగా మనస్పూర్తిగో  ప్రేమించిన ఏకైక స్త్రీ ఆమె. అయితే  కత్రినా.. రణబీర్‌తో పిచ్చిగా ప్రేమలో ఉన్నందున, సల్మాన్  సహించాడు. అయితే, రణబీర్ ,కత్రినాతో విడిపోయిన తర్వాత, మాజీపై సల్మాన్ ద్వేషం రెట్టింపు అయ్యింది.

89

తరువాత, రజత్ శర్మ  టాక్ షో, ఆప్ కి అదాలత్‌లో కనిపించిన సమయంలో, సల్మాన్ ఖాన్ ఈ సంఘటన గురించి ఇండైరక్ట్ గా మాట్లాడాడు . అయితే ఇవన్నీ మర్చిపోయి ఈద్ 2024 నాడు, రణబీర్ కపూర్ మరియు అలియా భట్ ముంబైలోని బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ ఫ్లాట్‌ను ఆశ్చర్యపరిచారు. అక్కడికి వెళ్లేటప్పుడు అలియా భట్ పూర్తిగా తెల్లటి పూలతో ముద్రించిన   సూట్‌లో అద్భుతంగా కనిపించింది . మినిమల్ మేకప్‌ వేసుకుంది. మరోవైపు, రణబీర్ నీలిరంగు డెనిమ్ షర్ట్‌లో గ్రే టీ-షర్ట్ మరియు జీన్స్‌తో జతగా డాపర్‌గా కనిపించాడు. ఈ  జంట భాయిజాన్ సిబ్బందిలో ఒకరితో ఫోటోకు పోజులివ్వడం కనిపించింది. ఫోటోలో సల్మాన్ ఎక్కడా కనిపించనప్పటికీ, రణబీర్ మాజీ ఇంటికి వెళ్లడం వల్ల ఇద్దరూ పాచ్ అప్ అయ్యారని కలిసిపోయారని తేలింది. 

99

రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' చిత్రం గతేడాది విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల రూపాయల బిజినెస్ చేయడం విశేషం. ఇప్పుడు నితీష్ రామాయణంలో రాముడుగా చేస్తున్నాడు. రణ్‌బీర్ కపూర్ కెరీర్, వ్యక్తిగత విషయానికి వస్తే.. గతేడాది ఆలియాభట్‌ను వివాహం చేసుకొన్న ఆయన ఇటీవలే ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఆ మధ్య విడుదలైన బ్రహ్మస్త్ర చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ చిత్రంలో చేసారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved