- Home
- Entertainment
- Brahmamudi: రాహుల్ చెంప పగలగొట్టిన రుద్రాణి.. తెలివిగా అత్తని దారిలోకి తెచ్చుకున్న కావ్య!
Brahmamudi: రాహుల్ చెంప పగలగొట్టిన రుద్రాణి.. తెలివిగా అత్తని దారిలోకి తెచ్చుకున్న కావ్య!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఇష్టం లేని కోడల్ని వదిలించుకోవాలని చూస్తున్న ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎపిసోడ్ ప్రారంభంలో ఆ కిడ్నాపర్ ఎక్కడ ఉన్నాడో చెప్తే వెళ్లి వాళ్ళ కాళ్లు చేతులు విరిచేస్తాను అని ఆవేశంగా అంటాడు రాహుల్. అంత ఆవేశం అక్కర్లేదు వాళ్లని పోలీసులకు పట్టించాము అంటుంది కావ్య. అలాంటి వాళ్ళని పోలీసులు పట్టించడం కాదు, ఉప్పు పాతర వేసేయాలి అంటుంది చిట్టి. అసలు వాడికి అలాంటి సలహా ఇచ్చిన వాడిని యాసిడ్లో ముంచేయాలి అని అంటాడు ప్రకాష్.
ఇంక తిట్టింది చాలు అంటుంది రుద్రాణి. వాళ్లెవర్నో తిడుతుంటే నీకెందుకు కోపం వస్తుంది అంటుంది ధాన్యలక్ష్మి. మీరు ఎవరినైనా తిట్టుకోండి నాకు అనవసరం కానీ పాపం ఇప్పుడే ఇంటికి వచ్చిన స్వప్నకి ఏమైనా తినటానికి పెట్టాలి కదా అని చెప్పి రాహుల్ తో స్వప్నని పైకి తీసుకు వెళ్ళమని చెప్తుంది రుద్రాణి. రాహుల్ స్వప్నను తీసుకొని పైకి వెళ్ళబోతుంటే ఎత్తుగా ఉన్న సప్న కడుపుని చూసి అదేంటి అంత పెరిగిపోయింది అని అనుమానంగా అడుగుతుంది.
ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నాను కాబట్టి మీరు గమనించలేదు. ఇప్పుడు వారం రోజులు కనిపించకపోయేసరికి మీకు అలా అనిపిస్తుంది. అయినా మీరు నా మీద ఎప్పుడు దృష్టి పెట్టారు కాబట్టి ఎప్పుడూ ఆ కావ్య భజనే కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. ఆ తర్వాత రాహుల్ దగ్గరికి వచ్చిన రుద్రాణి కొడుకు చెంప పగలగొడుతుంది. ఒక పని కూడా సరిగ్గా చేయవు, ఇది మంచి అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదని చెప్పాను అయినా వినిపించుకోలేదు అంటుంది.
ఆ మైకేల్ గాడు తనని చంపుతాడు అనుకున్నాను కానీ ఇలా పెళ్లి చేసుకునే ఆలోచన అతని మనసులో ఉందని అసలు గ్రహించలేకపోయాను. ఈసారి నేను ఎవరి మీద ఆధారపడను, నేనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను అంటాడు రాహుల్. ఇకమీదట మనం అవకాశాలని వెతుక్కోవటం కాదు మనమే అవకాశాలని సృష్టించుకుని ఏదో ఒకటి చేయాలి అంటుంది రుద్రాణి. మరోవైపు ఆలోచనలో ఉన్న కావ్య ఆ కిడ్నాపర్ కి అంత సీన్ లేనట్టు ఉంది వాడి వెనక ఎవరో ఉన్నారు అని భర్తతో అంటుంది.
ఇప్పుడు వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తావా ఏంటి అని అడుగుతాడు రాజ్. అదేంటి అంత పెద్ద విషయాన్ని అంత తేలిగ్గా వదిలేస్తామా అని అడుగుతుంది కావ్య. ఇంతలో ప్రసాద్ విగ్రహాలు తాలూకా చెక్ తీసుకొని వచ్చి కావ్యకి చెక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ చెక్కు చూసి ఎమోషనల్ అవుతుంది కావ్య. భర్త హృదయం పై వాలి ఇదంతా మీ వల్లే ఈ చెక్ మీ చేతులతోనే మార్వాడికి ఇప్పిస్తాను అని చెప్పి చెక్ బలవంతంగా భర్త చేతిలో పెట్టి మార్వాడి ఫోన్ చేయడానికి వెళుతుంది.
ఆమె ప్రవర్తనకి షాకైన రాజ్ ఇదంతా తాతయ్య కోసం చేస్తున్నాను కానీ కావ్య తన మీద ప్రేమతో చేస్తున్నాను అనుకుంటుంది నిజం తెలిస్తే ఎలా తీసుకుంటుందో ఏంటో అనుకుంటాడు. మరోవైపు కారులో వెళ్తూ నీతో గడిపితే సమయం తెలియడం లేదు అంటుంది అనామిక. పెళ్లయ్యాక కూడా ఇలా ఈ మాటే అనాలి అంటాడు కళ్యాణ్. ఆడవాళ్లు ఒకసారి ప్రేమించడం మొదలుపెడితే మీ మగవాళ్ళు ఎందుకు పనికిరారు అంటుంది అనామిక.
అవును మా వదిన ని చూస్తున్నాను కదా అంటాడు కళ్యాణ్. సరే మన పెళ్లి విషయం మాట్లాడటానికి మా వాళ్ళని తీసుకొని రేపు మీ ఇంటికి వస్తాను అంటుంది అనామిక. కంగారు పడిన కళ్యాణ్ నేను ఇంకా ఇంట్లో ఏమి చెప్పలేదు అంటాడు. పెద్దవాళ్ళని ఎదురెదురుగా కూర్చోబెడితే వాళ్లే మాట్లాడుకుంటారు అంటుంది అనామిక. మరోవైపు స్వప్నని కాపాడటానికి ఒక్కతే వెళ్ళినందుకు తల్లిని మందలిస్తుంది అప్పు.
నీకేమైనా అయితే ఎవరిది బాధ్యత అని అడుగుతుంది. మరి నువ్వు ప్రతిసారి గొడవడలకు వెళ్తే మేము కూడా అంతే కంగారు పడతాము అంటుంది కనకం. అటు తిరిగే ఇటు తిరిగి నన్నే అంటావేంటి అంటూ కనకం పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అప్పు. అదే సమయంలో కళ్యాణ్ ఫోన్ చేసి అనామిక గురించి చెప్పాలనుకుంటే అతను చెప్పేది వినిపించుకోకుండా కళ్యాణ్ ని కూడా నాలుగు తిట్టి ఫోన్ పెట్టేస్తుంది అప్పు.
ఏది పూర్తిగా వినిపించుకోదు అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్. మరోవైపు కావ్య తల్లికి ఫోన్ చేసి ప్రసాద్ చెక్ ఇచ్చిన విషయం చెప్తుంది. రేపు వినాయక చవితి పండుగ కదా మీరు వచ్చినప్పుడు మీ అల్లుడు చేత్తోనే చెక్కిప్పిస్తాను అంటుంది. మేము మీ ఇంటికి వస్తే మీ అత్తగారు ఏమైనా అనుకుంటారేమో అంటుంది కనకం. మా అత్తగారి పిలిస్తేనే వద్దువుగానివిలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కావ్య. మా అత్తగారిని ఎలాగైనా అమ్మని పిలిచేలాగా చేయాలి అనుకుంటుంది.
ఆ తర్వాత భోజనాల సమయంలో మీ అబ్బాయిని తీసుకుని మా పుట్టింటికి వెళ్తాను అని అడుగుతుంది కావ్య. కుదరదు అంటుంది అపర్ణ. మరి సమస్య తీరేదెలా..చెక్కు ఈయన చేతుల మీదుగా మా అమ్మ వాళ్లకి ఇవ్వాలనుకుంటున్నాను. అమ్మేమో ఇక్కడికి రాదు అంటూ అమాయకంగా మొహం పెడుతుంది కావ్య. కనకానికి ఫోన్ చేసి పిలిస్తే ఎందుకు రాదు అంటుంది అపర్ణ. తరువాయి భాగంలో అందరూ తన మనసులో మాటని పేపర్ల మీద రాసి వినాయకుడు దగ్గర పెడతారు.