- Home
- Entertainment
- కమల్ హాసన్ ఆస్తులు, అప్పులు ఎన్ని కోట్లు, కార్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ల సంగతేంటి?
కమల్ హాసన్ ఆస్తులు, అప్పులు ఎన్ని కోట్లు, కార్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ల సంగతేంటి?
తాజాగా తమిళనాడు నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం కమల్ హాసన్ కు ఉన్న ఆస్తుల మొత్తం విలువ ఎంతో తెలుసా?

బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, హీరోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ హాసన్. ఇండస్ట్రీలో ప్రయోగాలకు పెట్టింది పేరు కమల్ హాసన్. అంతే కాదు సినిమా కోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాని నటుడు కమల్ హాసన్. దాదాపు 60 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కమల్ హాసన్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారో తెలుసా?
రీసెంట్ గా తమిళనాడు నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం కమల్ హాసన్ కు ఉన్న ఆస్తులు మొత్తంగా 305.55 కోట్లు .
ఆ వివరాల ప్రకారం, కమల్ వద్ద స్థిరాస్తులు రూ. 245.86 కోట్లు, చరాస్తులు రూ. 59.69 కోట్లు ఉన్నాయి. ఆయనకు నాలుగు కమర్షియల్ బిల్డింగ్స్ ఉండగా, వాటి విలువ రూ. 111.1 కోట్లు. అదనంగా, కమల్ పేరిట ఒక వ్యవసాయ భూమి ఉండగా, దాని విలువ రూ. 22.24 కోట్లుగా నమోదు చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి కమల్ హాసన్ ఆదాయం రూ. 78.9 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ఆయనకు బెంజ్, బీఎండబ్ల్యూ, లెక్సస్, మహీంద్రా కంపెనీలకు చెందిన నాలుగు విలాసవంతమైన కార్లను వాడుతుండగా.. వాటి మొత్తం విలువ రూ. 8.43 కోట్లు. ప్రస్తుతానికి కమల్ వద్ద రూ. 2.6 లక్షల నగదు కూడా ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఇక సంపాదన తో పాటు అప్పులు కూడా ఉన్నాయి లోకనాయకుడికి. కమల్ హాసన్ వద్ద రూ. 49.67 కోట్ల రుణబాధ్యతలు ఉన్నట్టు ఎన్నికల అఫిడవీట్ లో వెల్లడించారు. ఈ మొత్తం లోన్స్ రూపంలో ఆయనపై ఉన్నట్టు వివరించారు.
ఇటీవల కమల్ హాసన్ తన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ ద్వారా డిఎంకె మద్దతుతో రాజ్యసభకు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈలోపు కమల్ నటించిన చిత్రం థగ్ లైఫ్ పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించకపోయినా, రాజకీయంగా మాత్రం ఆయన తిరిగి పుంజుకోడానికి అడుగులు వేస్తున్నాడు.
ఈ క్రమంలో కమల్ హాసన్ వెల్లడించిన ఆస్తుల వివరాలు రాజకీయ, సినిమా వర్గాల్లో చర్చనీయం అవుతున్నాయి. అంతే కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.