భారీ బడ్జెట్ తో రూపొందిన కన్నప్ప చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించారు. హిందీలో మహాభారతం టీవీ సీరియల్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, లెజెండ్ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటివారు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు.
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్
భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ని నేను బావ అని పిలుస్తా. నాకంటే చిన్నవాడైనప్పటికీ చాలా ఏళ్లుగా ఒకరినొకరం బావ అని పిలుచుకుంటాం.
ప్రభాస్ పై మోహన్ బాబు ప్రశంసలు
ప్రభాస్ ఇండియాలోనే అగ్ర హీరోలలో ఒకరు. ఒకరోజు ప్రభాస్ కి ఫోన్ చేసి.. బావ నిన్ను కలవాలి అని అడిగా.. సరే బావా రేపు ఇంటికి రా అని ఆహ్వానించాడు. నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నా. అవును, కాదు అని మాత్రమే సమాధానం చెప్పు అని అడిగా. ఏంటి బావ అని ప్రభాస్ అడిగాడు. కన్నప్ప చిత్రంలో నువ్వు నటించాలి కొన్ని రోజుల షూటింగ్ ఉంది అని చెప్పా. ఏంటి బావ దీనికోసం నువ్వు రావాలా. నేను ఈ సినిమాలో నటిస్తా.. నేను ఈ విషయం గురించి విష్ణుతో మాట్లాడతాలే అని చెప్పాడు. అంతే అంతకు మించి ఇంకేమీ అడగలేదు.
ప్రభాస్ గొప్ప మనసున్న వ్యక్తి. అతడు వందేళ్ల పాటు క్షేమంగా ఉండాలి అని మోహన్ బాబు అన్నారు. మంచు విష్ణు కూడా ప్రభాస్ ని ప్రశంసలతో ముంచేస్తారు. ప్రభాస్ నాకోసం ఈ సినిమా చేయలేదు.. ఆ విషయం నాకు తెలుసు. నాన్నగారి కోసమే ఈ చిత్రంలో నటించాడు. ప్రభాస్ కి నాన్న గారిపై ఉన్న గౌరవం అలాంటిది అని మంచు విష్ణు తెలిపారు.