పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఓజీ' (They Call Him OG). తాజాగా పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఓజీ' (They Call Him OG). ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌ను యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఓజి షూటింగ్ పూర్తి చేసిన పవన్
ఈ చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. విజయవాడలోనే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్యాకప్ ఫర్ గంభీర.. గేరప్ ఫర్ ది రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ రక్తంతో తడిచిన చేతులతో కనిపిస్తున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు ఎంత బలంగా ఉండబోతున్నాయో అని.
అండర్ వరల్డ్ డాన్ పాత్రలో..
'ఓజీ' చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీరా అనే ముంబై అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. కథ ప్రకారం, ఓజస్ గంభీరా పదేళ్ల విరామం తర్వాత ముంబైకి తిరిగి వచ్చి, తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నారు, ఇది ఆయన తొలి తెలుగు చిత్రం.
ప్రియాంకా మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల మధ్య ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయడం విశేషం. ఇటీవల 'హరి హర వీరమల్లు' చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌ను నాలుగు గంటల్లో పూర్తి చేసిన పవన్, 'ఓజీ' షూటింగ్‌ను కూడా సమయానికి ముగించారు.
