- Home
- Entertainment
- Regina Cassandra : తెలుగు హీరోలని కాదని అతడికి రెజీనా ఓకే చెప్పిందా.. త్వరలోనే పెళ్లి
Regina Cassandra : తెలుగు హీరోలని కాదని అతడికి రెజీనా ఓకే చెప్పిందా.. త్వరలోనే పెళ్లి
గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది.

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. ఎవరు లాంటి చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది.
అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం.
అయితే ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. ఇదిలా ఉండగా రెజీనా పర్సనల్ లైఫ్ గురించి తరచుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
Regina
అయితే తాజాగా రెజీనా గురించి వస్తున్న వార్తలు ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. రెజీనా త్వరలో ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు ఒకే చెప్పడంతో రెజీనా ఆ బిజినెస్ మ్యాన్ తో తన భర్తగా పొందబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో రెజీనా.. సాయిధరమ్ తేజ్ తో ఎఫైర్ సాగించినట్లు వార్తలు వచ్చాయి. రెజీనా గురించి డైరెక్ట్ గా సాయిధరమ్ తేజ్ కే ప్రశ్నలు ఎదురయ్యాయి. అదే విధంగా సందీప్ కిషన్ తో కూడా రూమర్స్ వచ్చాయి. ఇటీవల సందీప్ కిషన్ రెజీనా తనకి స్నేహితురాలు మాత్రమే అని తెలిపాడు.
ఆన్ స్క్రీన్ పై వీళ్ళిద్దరితో రెజీనా ఒక రేంజ్ లో రొమాన్స్ పండించింది. బహుశా అందువల్ల కూడా రూమర్స్ వ్యాపించి ఉండొచ్చు. కానీ చాలా కాలంగా రెజీనా సింగిల్ గా ఉంటోంది. ప్రస్తుతం రెజీనా వయసు 33 ఏళ్ళు. ఎట్టకేలకు రెజీనా పెళ్ళికి రెడీ అవుతుండడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రెజీనా తన పెళ్లి వార్త గురించి అధికారికంగా స్పందించాల్సి ఉంది.