MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్

Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్

Rashmika: హిప్ గాయం కారణంగా కొంతకాలంగా ఇంటికే పరిమితమైన రష్మిక మందన్న త్వరలోనే షూటింగ్‌కు తిరిగి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియాలో ప్రకటించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 30 2026, 08:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rashmika Mandanna
Image Credit : Asianet News

Rashmika Mandanna

హిప్ గాయం కారణంగా కొంతకాలంగా సినిమాల షూటింగ్స్‌కు దూరంగా ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న త్వరలోనే తిరిగి వర్క్‌లోకి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సమయం గడుపుతున్న ఆమె తన ఆరోగ్యం మెరుగుపడటంతో త్వరలో షూటింగ్‌కు హాజరుకానున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రష్మిక నటిస్తున్న మైసా సినిమా షూటింగ్ సమయంలో ఆమెకు ఈ గాయం అయింది. గాయం కారణంగా దాదాపు నెల రోజులుగా సినిమాలకు విరామం తీసుకున్న ఆమె, ఈ సమయంలో ఇంట్లో గడిపిన మధురమైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే తిరిగి షూటింగ్‌కు వెళ్లాల్సి రావడంతో ఇంట్లో గడిపిన ఈ సమయాన్ని మిస్ అవుతానని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు
Image Credit : others

రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు

రష్మిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు, వీడియోల్లో గాయం నుంచి కోలుకుంటూ ఇంట్లో ఎలా సమయం గడిపారో చూపించారు. పూజ చేయడం, తన పెంపుడు కుక్కతో ఆడుకోవడం, పిక్చర్ పజిల్స్ పరిష్కరించడం, తోటను చూస్తూ రిలాక్స్ అవడం వంటి పలు విషయాలను ఆమె ఈ సమయంలో ఆస్వాదించారు. త్వరలోనే తిరిగి పనిలోకి వెళ్లబోతున్నానని, అయితే ఇంట్లో ఇలా గడిపిన సమయాన్ని కచ్చితంగా మిస్ అవుతానని రష్మిక పేర్కొన్నారు. గాయం కారణంగా షూటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, ఈ విరామాన్ని ఆమె సానుకూలంగా తీసుకున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడైంది.

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

35
మైసా షూటింగ్ లో గాయం
Image Credit : others

మైసా షూటింగ్ లో గాయం

తన గాయం గురించి రష్మిక గతంలో ఆగస్టు 3న సోషల్ మీడియా ద్వారా వివరించారు. తనకు వరుసగా మూడోసారి గాయం అయిందని, శరీరాన్ని మెషీన్‌లా కాకుండా మనిషి శరీరంలా చూసుకోవడం నేర్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. హిప్‌కు సంబంధించిన నాలుగు టెండన్లలో కుడి వైపు ఉన్న ఒక టెండన్ విడిపోయిందని, అది తిరిగి అతుక్కోవాల్సి ఉందని వివరించారు. కాలు పైకి ఎత్తడం వంటి కదలికలు సరిగ్గా జరగాలంటే ఆ టెండన్ తిరిగి అతుక్కోవాల్సి ఉంటుందని తెలిపారు. మైసా సినిమా కోసం డాన్స్ షూట్ చేస్తున్న సమయంలోనే ఈ గాయం జరిగినట్లు రష్మిక వెల్లడించారు. నొప్పి ఉన్నప్పటికీ భరించలేనంతగా ఏమీ లేదని, ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు ఈ విరామం ఉపయోగపడిందని చెప్పారు.

45
యాక్షన్ థ్రిల్లర్‌
Image Credit : others

యాక్షన్ థ్రిల్లర్‌

ప్రస్తుతం రష్మిక చేతిలో మైసా, రణబాలి సినిమాలు ఉన్నాయి. మైసా గోండ్ తెగల నేపథ్యంలో సాగే ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇందులో రష్మిక గోండ్ మహిళ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆమె పోషించిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో ధైర్యమైన పాత్రను చేస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి సినిమాలో రష్మిక నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు పీరియడ్ డ్రామా బ్రిటిష్ రాజ్ కాలం నేపథ్యంలో సాగుతుంది. భారత చరిత్రలో అంతగా వెలుగులోకి రాని కొన్ని అంశాల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను కల్పిత కథనంతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

55
రష్మిక సినిమాలు
Image Credit : others

రష్మిక సినిమాలు

గాయం కారణంగా కొంతకాలం షూటింగ్స్‌కు దూరమైన రష్మిక ఇప్పుడు మళ్లీ పనిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో పజిల్స్ ఆడటం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటి విషయాలను ఆస్వాదించిన ఆమె, త్వరలోనే షూటింగ్‌లో బిజీ కానున్నారు. దీంతో మైసా, రణబాలి సినిమాల తదుపరి షెడ్యూల్స్‌లో రష్మిక పాల్గొనే అవకాశం ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: నా డబ్బు తిరిగి రావాలంటే చిరంజీవి ఒక్కడే మార్గం..ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ నే ముంచేసిన డైరెక్టర్
Recommended image2
Amitabh Bachchan Net Worth: 90 కోట్ల అప్పు నుంచి 4 వేల కోట్ల ఆస్తి వరకు బిగ్ బీ జర్నీ
Recommended image3
Allu Arjun: ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు ముగ్గురి వల్లా కాలేదు..భార్య సాయం తీసుకుని చించిపడేసిన అల్లు అర్జున్
Related Stories
Recommended image1
Mamitha Baiju: ఆ హీరోయిన్ ఉంటే 100 కోట్లు గ్యారెంటీ, పట్టిందల్లా బంగారమే.. రెమ్యునరేషన్ కూడా చుక్కల్లోకి
Recommended image2
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved