MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే

Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే

వరుణ్‌ తేజ్‌ నటించిన కొరియన్ కనకరాజు సెప్టెంబర్‌ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం. థియేటర్ల తర్వాత ఓటీటీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 30 2026, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Korean Kanakaraju
Image Credit : Asianet News

Korean Kanakaraju

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ఇటీవల కొరియన్ కనకరాజు సినిమాతో విజయాన్ని అందుకున్నారు. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్‌ కామెడీ చిత్రంలో రితికా నాయక్‌, సత్య కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ యాప్‌ కేటలాగ్‌ ప్రకారం కొరియన్ కనకరాజు సెప్టెంబర్‌ 4, 2026 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్‌
Image Credit : Asianet News

కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్‌

కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే సినిమా ఏయే భాషల్లో అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాతల నుంచి కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత తెలుగు వెర్షన్‌తో పాటు ఇతర భాషల్లో సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందా అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

35
వరుస ఫ్లాప్‌ల తర్వాత విజయం
Image Credit : Asianet News

వరుస ఫ్లాప్‌ల తర్వాత విజయం

వరుస ఫ్లాప్‌ల తర్వాత వరుణ్‌ తేజ్‌కు కొరియన్ కనకరాజు రూపంలో విజయం దక్కింది. హారర్‌, కామెడీ అంశాలను మేళవించి రూపొందించిన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందనను అందుకుంది. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌, రితికా నాయక్‌, సత్య నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. థియేటర్లలో విజయాన్ని సాధించిన తర్వాత ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో డిజిటల్‌ రిలీజ్‌పై కూడా ఆసక్తి నెలకొంది.

45
మెర్లపాక గాంధీ దర్శకత్వం
Image Credit : Asianet News

మెర్లపాక గాంధీ దర్శకత్వం

యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. తమన్‌ ఎస్‌ సినిమాకు సంగీతం అందించారు. మెర్లపాక గాంధీ తనదైన శైలిలో హారర్‌, కామెడీ అంశాలను కలిపి సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీపై మరోసారి సినిమాను చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

55
నెట్‌ఫ్లిక్స్‌
Image Credit : Asianet News

నెట్‌ఫ్లిక్స్‌

మొత్తానికి వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో వరుస పరాజయాల తర్వాత వచ్చిన కొరియన్ కనకరాజు విజయం సాధించడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. థియేట్రికల్‌ రన్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టనుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
Mamitha Baiju: ఆ హీరోయిన్ ఉంటే 100 కోట్లు గ్యారెంటీ, పట్టిందల్లా బంగారమే.. రెమ్యునరేషన్ కూడా చుక్కల్లోకి
Recommended image2
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved