- Home
- Entertainment
- రాఖీ సావంత్ కు హ్యాండ్ ఇచ్చిన కొత్త బోయ్ ఫ్రెండ్ అదిల్, రెండు గంటలు నాన్ స్టాప్ గా ఏడ్చిన నటి
రాఖీ సావంత్ కు హ్యాండ్ ఇచ్చిన కొత్త బోయ్ ఫ్రెండ్ అదిల్, రెండు గంటలు నాన్ స్టాప్ గా ఏడ్చిన నటి
బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్ జీవితం రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. అనుకున్నది ఒక్కటి.. జరిగేది మరొక్కటి అన్నట్టు మారిపోతోంది అంతా..? రీసెంట్ గా రాఖీ సావంత్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఆమెకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ బుల్లితెర,వెండితెన రాఖీ సావంత్ పర్సనల్ లైఫ్ కొత్త మలుపులు తిరుగుతోంది. పాత మొగుడికి గుడ్ బై చెప్పి.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో మొన్నటి వరకూ షికార్లు చేసింది బ్యూటీ. అయితే రీసెంట్ గా కొత్త బాయ్ ఫ్రెండ్ తనకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో.. ఎక్కడికి వెళ్లినా వెంట బోయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ తో కలిసి చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ కనిపించేది. అయితే కొత్తగా రాఖీ సావంత్.. మొదటిసారి ఒంటరిగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. అది కూడా డల్ గా, చెదిరిన మేకప్ తో, పింక్ సల్వార్ సూట్ లో కనిపించింది.
బోయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ ను కలవడానికి ఢిల్లీకి వెళ్ళింది రాఖీ సావంత్.. అయినా అతడు తనను కలవకపోవడంతో రాఖీ సావంత్ హార్ట్ అయ్యింది అంతే కాదు అతనిపై కారాలు మిర్యాలు నూరుతూ... రచ్చ రచ్చ చేసింది ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆమె మాట్లాడిన వీడియోని ప్రస్తుతం నెట్టింట్ట వైరల్ అవుతోంది.
అందంగా రెడీ అయ్యింది రాఖీ సావంత్.. ఆదిల్ కోసమే ఇలా రెడీ అయ్యాను. కాని అదిల్ చేసిన పనికి ఫ్లయిట్ లో రెండు గంటల పాటు ఏడవడంతో నా కాజల్ చెరిగిపోయింది.. అంటూ దీనంగా చెప్పుకొచ్చింది. అదిల్ కు కాల్ చేయండి అని అక్కడ ఉన్న వీడియా వారు అడగ్గా.. నేను ఇప్పుడు అతడికి కాల్ చేయడం లేదు. నాకు నా ఆత్మ గౌరవమే ముఖ్యం అంటూ వ్యాఖ్యానించింది.
రాఖీ సావంత్ ఈ విధంగా చెప్పుకోచ్చింది. నేను నిన్న ఢిల్లీకి వెళ్లాను, ఈ రోజు ముంబైకి వచ్చాను.. మీకు తెలుసా? అతడు నన్ను కలుసుకోవడం కోసం రాలేదు... అసలు మేము ఇద్దరం కలసి ముంబైకి రావాల్సి ఉంది. కాని అతను నన్ను పట్టించుకోలేదు. నేను ఎంతో బాధలో ఉన్నాను అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.
2009లో రాఖీ కా స్వయంవర్ పేరుతో ఓ టీవీ ఛానల్ లో రియాలిటీ షోను నిర్వహించి సంచలనం సృష్టించింది. ఆ ప్రోగ్రాంలో ఎలేష్ పురుంజన్ వాలా అనే అతన్ని సెలక్ట్ చేసుకుని సహజీవనం చేసింది. ఇక కొన్ని నెలల తర్వాత విడిపోయి.. 2019లో ఎన్ఆర్ఐ రితేష్ ను వివాహం చేసుకుని 2022 స్టార్టింగ్ లో విడాకులు ఇచ్చింది. ఇక అప్పటి నుంచీ..బిజినెస్ మెన్ ఆదిల్ ఖాన్ దుర్రానీతో తిరుగుతోంది బ్యూటీ.
ఇక ఈ విషయంలో రాఖీ సావంత్ అభిమానులు మాత్రం ఆమెనే తప్పుబడుతున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మాజీ భర్త రితేష్ మాదిరే ఆదిల్ ఖాన్ కూడా రాఖీ సావంత్ ను భరించలేకపోయి ఉంటాడు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.