MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆల్రెడీ పెళ్ళైన హీరోని పెళ్లి చేసుకోమంటున్న ఫ్యాన్స్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రాశి ఖన్నా

ఆల్రెడీ పెళ్ళైన హీరోని పెళ్లి చేసుకోమంటున్న ఫ్యాన్స్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రాశి ఖన్నా

రాశి ఖన్నా హీరోయిన్ గా మారింది హిందీలోనే. బాలీవుడ్ లో ఆమె నటించిన మొదటి చిత్రం మద్రాస్ కేఫ్. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో రాశి ఖన్నా కి క్రేజ్ రావడంతో ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు 11 ఏళ్ళ తర్వాత రాశి ఖన్నా బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 29 2024, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.   రాశి ఖన్నా హీరోయిన్ గా మారింది హిందీలోనే. బాలీవుడ్ లో ఆమె నటించిన మొదటి చిత్రం మద్రాస్ కేఫ్. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో రాశి ఖన్నా కి క్రేజ్ రావడంతో ఇక్కడే సెటిల్ అయిపోయింది. 

37

ఇప్పుడు దాదాపు 11 ఏళ్ళ తర్వాత రాశి ఖన్నా బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సిద్దార్థ్ మల్హోత్రా కి జోడిగా యోధ అనే చిత్రంలో నటించింది. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం జస్ట్ ఒకే అనే టాక్ సొంతం చేసుకుంది. అయితే సిద్ధార్థ్, రాశి ఖన్నా జోడికి మాత్రం ఆడియన్స్ ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు. 

47

వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతలా ఆకట్టుకుంటోంది. సినిమా ఎలా ఉన్న సిద్ధార్థ్, రాశి ఖన్నా జోడి అద్భుతంగా నటించారు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. సిద్దార్థ్.. కియారా అద్వానీ కి బదులుగా రాశి ఖన్నాని పెళ్లి చేసుకుని ఉంటే బావుండేది అని అంటున్నారు. 

57

కియారా, సిద్ధార్థ్ జోడి కంటే రాశి, సిద్ధార్థ్ జోడి బావుందని అంటున్నారు. అభిమానుల కామెంట్స్ పై రాశి ఖన్నా ఇంటర్వ్యూలో స్పందించింది. అది కేవలం అభిమానుల అభిప్రాయం మాత్రమే. సినిమాలో కనిపించింది చూసి ఊహించేసుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. రియల్ లైఫ్ లో మేము ఎలా ఉంటాం అనేది వాళ్ళకి తెలియదు. 

67

సినిమాలో కచ్చితంగా హీరో హీరోయిన్ మధ్య కన్విన్స్ అయ్యేలా రొమాన్స్ ఉంటుంది. అంతమాత్రాన రియల్ లైఫ్ లో కూడా ముడిపెట్టేయడం కరెక్ట్ కాదు. సినిమాలో మా జోడి బాగా అనిపించొచ్చు. కానీ రియల్ లైఫ్ లో వరస్ట్ గా ఉంటామేమో ఎవరికీ తెలుసు ? అని రాశి కౌంటర్ ఇచ్చింది. 

77

అదే విధంగా రియల్ లైఫ్ లో తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా రాశి ఖన్నా తెలిపింది. నాకు కాబోయే భర్త మెచ్యూరిటీ తో ఉండాలి. చిన్న పిల్లల్లాగా ప్రవర్తించే మనస్తత్వం ఉండకూడదు. అలా ఉంటే నాకు చిరాకు. ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించే భర్త రావాలని కోరుకుంటున్నట్లు రాశి తెలిపింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved