MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ రిలీజ్ డేట్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ.. నమ్మకం లేదంటున్న ఫ్యాన్స్.. కుదిరేలా లేదుగా.!

ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ రిలీజ్ డేట్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ.. నమ్మకం లేదంటున్న ఫ్యాన్స్.. కుదిరేలా లేదుగా.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కే’ (Project K). ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ రిలీజ్ డేట్ కన్ఫమ్ కాగా.. తాజాగా ‘ప్రాజెక్ట్ కే’ విడుదల తేదీపై అదిరిపోయే అప్డేట్ అందింది. అయితే దానిపై అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 17 2022, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం అతి భారీ చిత్రాల్లో  నటిస్తున్నారు. చివరిగా  ‘రాధే శ్యామ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ (Prabhas) వచ్చే ఏడాది తను నటిస్తున్న భారీ చిత్రాలను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత అంతటి హిట్ ప్రభాస్ ఖాతాలో పడలేదు. దీంతో అంతకు మించి ఉండే చిత్రాల్లో నటిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  ‘సలార్’(Salaar), ‘ప్రాజెక్ట్ కే’, ‘ఆది పురుష్’. ఇప్పటికే  హిందీలో రూపొందించిన  భారీ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆది పురుష్’ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. దీంతో నిర్విరామంగా ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్.

36

కాగా రీసెంట్ గా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సెస్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా  గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ‘ప్రాజెక్ట్ కే’ రిలీజ్ డేట్ పైనా కూడా క్రేజీ  అప్డేట్ అందుతోంది.
 

46

పాన్ వరల్డ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని 2023 అక్టోబర్ 18న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని ‘ప్రాజెక్ట్ కే’ నిర్మాత అశ్విని దత్ నిన్న ప్రకటించారు. ఆ సమయంలో ప్రభాస్ పుట్టిన రోజు, అలాగే దసరా ఫెస్టివల్ కూడా రాబోతున్నట్టు తెలిపారు. దీంతో ప్రభాస్ చిత్రాలకు వచ్చే ఏడాది థియేటర్లు దద్దరిల్లనున్నాయి. ఇటు అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. 
 

56

అయితే బ్యాక్ టు బ్యాక్ ఇటు సలార్, అటు ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్స్ అనౌన్స్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  మరికొంత మంది మాత్రం మాకు నమ్మకం లేదంటున్నారు. ఇప్పుడు ఇలాగే చెప్పిన తర్వాత మార్చేస్తారని 2024లోనే రిలీజ్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ లోనే ‘సలార్’ రిలీజ్ ఉండటంతో నెల గ్యాప్ లో ‘ప్రాజెక్ట్ కే’ వచ్చే ఛాన్సే లేదంటున్నారు.  చూడాలి మరీ మున్ముందు ఏం జరుగుతుందో.
 

66

ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ వైజయంతి బ్యానర్ పై రూ.500 కోట్లతో ‘ప్రాజెక్ట్ కే’ను రూపొందిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం  వహిస్తున్నారు. ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సీ అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్ లోనూ రిలీజ్ చేయబోతున్నారు.
 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ్ అశ్విన్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved