- Home
- Entertainment
- Priyanka Mohan Pics : చూపుల బాణాలు విసురుతున్న నాని హీరోయిన్.. చుడీదార్ లో మైమరిపిస్తున్న ప్రియాంక మోహన్..
Priyanka Mohan Pics : చూపుల బాణాలు విసురుతున్న నాని హీరోయిన్.. చుడీదార్ లో మైమరిపిస్తున్న ప్రియాంక మోహన్..
నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. అప్పటి నుంచి తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంటోంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

తమిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ (Prinka Arul Mohan) ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. తన కేరీర్ ను తొలుత కన్నడ ఇండస్ట్రీతో స్టార్ చేసింది. ‘ఓంద్ కథే హెల్లా’ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది.
టాలీవుట్ నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో నానికి జోడీగా మెప్పించింది ప్రియాంక మోహన్. తన గ్లామర్, నటనకు తెలుగు ఆడియెన్స్ కు ఫిదా అయ్యారు.
ఆ వెంటనే శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు అవరేజ్ హిట్ తో సరిపెట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రాలతోనే ఇండస్ట్రీకి పరిచయమైన తమిళ బ్యూటీకి ఆఫర్లు కూడా పెద్దగా రాలేదనే చెప్పాలి.
దీంతో, తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ప్రస్తుతం అక్కడే వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తను నటించిన చిత్రాలు తెలుగులోనూ డబ్ చేయడం పట్ల ఇటు తెలుగు ఆడియెన్స్ కు కూడా దగ్గరగానే ఉంటోంది.
చివరిగా తమిళ స్టార్ హీరో సూర్య (Surya) నటించిన ‘ఈటీ’ ET చిత్రంలో ప్రియాంక మోహన్ కు మంచి ప్రాధాన్యత ఉన్న రోల్ దక్కిందనే చెప్పాలి.సూర్య పాత్రకు సమాన స్థాయిని కల్పించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం ఇటీవల రిలీజై మంచి విజయవంతంగానే నిలిచింది. ప్రస్తుతం ప్రియాంక తమిళం చిత్రం ‘డాన్’లో నటిస్తోంది.
అటు సినిమాలతో పాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ ప్రియాంక మోహన్ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఫెస్టివల్స్, స్పెషల్ డేస్ లో నెటిజన్లను విష్ చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా చుడీదార్ లో దర్శనమిచ్చింది. ఉగాది పండుగ సందర్భంగా ఫొటోలు షేర్ చేసి మెస్మరైజ్ చేస్తోంది. తన బ్యూటీతో నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది.