MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తన ముందు తొడకొట్టాడని కైకాల సత్యనారాయణకి చుక్కలు చూపించిన ఎన్టీఆర్‌.. ఇలాంటి శాడిజం కూడా ఉందా?

తన ముందు తొడకొట్టాడని కైకాల సత్యనారాయణకి చుక్కలు చూపించిన ఎన్టీఆర్‌.. ఇలాంటి శాడిజం కూడా ఉందా?

తన ముందు తొడ కట్టాడని కైకాల సత్యనారాయణ కి చుక్కలు చూపించాడట ఎన్టీఆర్‌. ఆయన ఈగో దెబ్బతింటే ఏ స్థాయికి వెళ్తాడో వెల్లడించారు కైకాల సత్యనారాయణ.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 28 2024, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎన్టీఆర్‌ అంటే తెలుగు సినిమాకి యుగ పురుషుడు లాంటివాడు. ఆయన్ని మించిన నటుడు, హీరో లేరంటుంటారు. ఎలాంటి పాత్ర అయినా అద్భుతంగా చేసి రక్తికట్టిస్తారు. అందుకే ఆయన్ని నటనా సార్వభౌముడిగా కీర్తిస్తుంటారు సినిమా జనాలు. అప్పట్లో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, కైకాల సత్యనారాయణల మధ్య నటనలో బాగా పోటీ ఉండేది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే ఎన్టీఆర్‌ అంటే భోళా మనిషి అంటుంటారు. కానీ నటన విషయంలో మాత్రం కాస్త అసూయ ఉండేదట. తన మార్క్ చిలిపి శాడిజం చూపించేవాడట. అలా ఓసారి కైకాల సత్యనారాయణకి తన యాటిట్యూడ్‌ చూపించాడట ఎన్టీఆర్‌. ఓ సినిమా సమయంలో కైకాలకి చుక్కలు చూపించాడట. 

35

అప్పట్లో ఎన్టీఆర్‌.. తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించేవాడు. ఎన్నో సినిమాలు చేశాడు. ఈ క్రమంలో ఓ సినిమా సమయంలో ఎన్టీఆర్‌, కైకాల సత్యనారాయణ మధ్య సీన్లు ఉన్నాయి. ఇద్దరు పోటీ పడే సీన్లు. ఎన్టీఆర్‌కి సవాల్‌ విసిరే సీన్‌లో కైకాల సత్యనారాయణ తొడ కొడతాడట. అయితే అది ఎన్టీఆర్‌కి నచ్చలేదు. ఆయన ఈగో దెబ్బతిన్నది. తన ముందు తొడగొడతాడట కైకాల. అయితే ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని సీన్‌ బాగా రాలేదని చెప్పి పది పదిహేను టేక్‌లు తీసుకున్నాడట రామారావు. 
 

45

ఇలా తీస్తుంటే కైకాల ప్రశ్నించాడట. ఏంటి అండి ఇన్ని టేకులు తీసుకున్నారు అంటే.. లేకపోతే నా ముందే తొడగొడతావా అని అన్నాడట ఎన్టీఆర్‌. దీనికి కైకాల చెబుతూ, అయ్యో తన ఉద్దేశ్యం అది కాదని మీకు లీడ్‌ ఇవ్వడం కోసం చేశానని చెబితే తర్వాత కూల్‌ అయిన ఎన్టీఆర్‌.. చాలా బాగా చేశారని, ఆ ఆలోచన ఎలా వచ్చిందో మీకు కానీ అద్భుతంగా వచ్చిందని ప్రశంసించాడట. అలా తన ఈగో కారణంగా కైకాలని ఇబ్బంది పెట్టారు ఎన్టీఆర్‌. 
 

55

ఎన్టీఆర్‌, కైకాల సత్యనారాయణ కలిసి అనేక చిత్రాలు చేశారు. జానపద, పౌరాణిక చిత్రాల్లో ఇద్దరు ఉండాల్సిందే. `దాన వీర శూరకర్ణ`, `లవకుశ`, `శ్రీరామ పట్టాభిషేకం`, `వేటగాడు`, `పాండవ వనవాసం`, `బొబ్బిలి పులి`, `కొండవీటి సింహం`, `శ్రీకృష్ణపాండవీయం`, `జస్టీస్‌ చౌదరీ`, `డ్రైవర్‌ రాముడు`, `యుగందర్‌` ఇలా అనేక సినిమాలు ఇద్దరు కలిసి  నటించారు. వెండితెరని రక్తికట్టించారు. నేడు ఎన్టీఆర్ జయంతి అనే విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత
Recommended image2
OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ప్రైమ్‌లో టాప్‌ 10 మూవీస్‌
Recommended image3
Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved