- Home
- Entertainment
- NIharika: చిరంజీవి-పవన్ లలో ఆయన్ని మోసం చేయడం చాలా ఈజీ... పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన మెగా డాటర్ నిహారిక
NIharika: చిరంజీవి-పవన్ లలో ఆయన్ని మోసం చేయడం చాలా ఈజీ... పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన మెగా డాటర్ నిహారిక
మెగా డాటర్ నిహారిక పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పర్సనల్ సీక్రెట్ లీక్ చేసింది. ఓ కార్యక్రంలో పాల్గొన్న నిహారిక వారిద్దరిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

మెగా ఫ్యామిలీ నుండి డేరింగ్ అమ్మాయిగా నిహారికకు(Niharika Konidela) పేరుంది. మెగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ వద్దంటున్నా హీరోయిన్ గా మారి పంతం నెగ్గించుకుంది. నటి కావాలన్న అభిలాష తీర్చుకుంది. సక్సెస్ ఫెయిల్యూర్ అటుంచితే నిహారిక నటిగా, నిర్మాతగా పరిశ్రమలో కొనసాగుతున్నారు. నిహారిక హీరోయిన్ గా నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. దీనితో పెద్దలు కుదిర్చిన అబ్బాయితో ఏడు అడుగులు వేసింది.
Niharika Konidela
2020 డిసెంబర్ లో నిహారిక-వెంకట చైతన్యల వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ ఈ వివాహ వేడుకకు వేదికయ్యింది. ఐదు రోజుల పాటు అట్టహాసంగా నిహారిక పెళ్లి కార్యక్రమం నిర్వహించారు. మెగా హీరోలందరూ పాల్గొన్న ఈ వేడుక నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.
పెళ్లి తర్వాత నిహారిక మేకప్ వేసుకోరని అందరూ భావించారు. అయితే అత్తమామలు, భర్త సహకారంతో తన అభిరుచిని వదలకుండా నటిగా కొనసాగుతున్నారు. అలాగే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. నిహారిక పలు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించడం జరిగింది. నాగబాబు కూతురిగా బుల్లితెర షోస్ లో కూడా ఆమె సందడి చేస్తూ ఉంటారు.
తాజాగా నిహారిక క్యాష్ ప్రోగ్రాం కి వచ్చారు. సుమ హోస్ట్ గా ఉన్న క్యాష్ షోకి నిహారికతో పాటు యూట్యూబర్స్ నిఖిల్, అనిల్, దేవుళ్ళు ఫేమ్ నిత్యా శెట్టి రావడం జరిగింది. ఈ ముగ్గురు యంగ్స్టర్స్ తో సుమ నవ్వులు పూయించారు. సరదాలు పంచారు. ఇక ఓ టాస్క్ లో భాగంగా నిహారికకు యాంకర్ సుమ ఓ ప్రశ్న అడిగారు.
Niharika Konidela
నీ మాటలతో, చేతలలో, చేస్థలతో చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్ లలో ఎవరిని కరిగిస్తావని అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు నిహారిక కరిగించాలి అంటే పెదనాన్న చిరంజీవిని ఈజీగా కరిగించవచ్చు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బాబాయ్ ని నమ్మించడం కష్టమని నిహారిక చెప్పుకొచ్చింది. భోళా శంకరుడైన చిరంజీవిని ఇట్టే బుట్టలో వేసుకోవచ్చని నిహారిక పర్సనల్ సీక్రెట్ లీక్ చేసింది. పవన్ మాత్రం మాయమాటలకు పడరని తేల్చేసింది.
ఇక నిహారిక హ్యాపీ మారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఖాళీ సమయం దొరికితే విదేశాలకు విహారానికి చెక్కేస్తున్నారు. ఇటీవల నిహారిక జోర్డాన్ దేశం వెళ్లారు. అక్కడ అందమైన ప్రదేశాల్లో దిగిన ఫోటోలు ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నిహారిక ఎప్పటికప్పుడు అభిమానులతో అన్ని విషయాలు పంచుకుంటారు.
Niharika konidela
ఇక ఉగాది పండగ నాడు నిహారిక లేట్ నైట్ పార్టీలో పాల్గొని పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ లో గల ఫుడింగ్ అండ్ మింగ్ పబ్ లో లేట్ నైట్ పార్టీ జరుగుతుందని డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడులు చేశారు. నిహారికను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఈ సంఘటన జరిగినప్పటికీ నుండి ఆమె పై ట్రోల్స్ ఎక్కువయ్యాయి.